వైన్స్‌పై అంబేద్కర్ సంఘ నాయకుల దాడి
దండేపల్లి : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని అంబేద్కర్ సంఘ నాయకులు దాడులకు పాల్పడ్డారు. స్థానికంగా ఉండే పెద్దయ్య వైన్స్‌పై గురువారం దాడికి దిగారు. ఓ వైపు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతుంటే మద్యం అమ్మకాలు జరుపుతారా అంటూ వైన్స్ యజమానిని అడ్డుకుని షాపు మూసివేయించారు. నాయకుల దాడిలో మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి.