attacked on SI
-
మద్యం మత్తులో ఏఎస్సై వీరంగం
కావలి: పట్టణంలోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సై సుబ్రహ్మణ్యం మద్యం మత్తులో సోమవారం రాత్రి వీరంగం చేశారు. వివరాలు.. కావలి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడేళ్ల నుంచి ఏఎస్సైగా సుబ్రహ్మణ్యం విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఈయన దెబ్బకు స్టేషన్‌లోని ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు హడలిపోయేవారు. సీఐగా రోశయ్య బాధ్యతలు స్వీకరించాక ఇవేవీ కుదరలేదు. ఈ క్రమంలో తుఫాన్ హెచ్చరికలతో కావలి సముద్ర తీరంలో పోలీసులకు ప్రత్యేక డ్యూటీలు వేశారు. ఏఎస్సై సుబ్రహ్మణ్యానికి సైతం డ్యూటీ వేశారు. ఈ క్రమంలో సీఐ రోశయ్య గదిలోకి వెళ్లి అసభ్య పదజాలంతో దూషించారు. ఇది గమనించిన పక్క గదిలో ఉన్న ఎస్సై గుంజి అంకమ్మ హుటాహుటిన అక్కడికి చేరుకొని ఏఎస్సైను నిలువరించే యత్నం చేశారు. దీంతో ఏఎస్సై ఎస్సై గొంతుపై చేయి వేసి తోసేసి దూషించారు. అక్కడి సిబ్బంది దీనిని తమ సెల్ఫోన్లో చిత్రీకరించారు. అనంతరం సీఐ రోశయ్య ఏఎస్సైను ప్రభుత్వ ఆస్పత్రికి మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన్ను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి బలవంతంగా తీసుకెళ్లారు. ఘటనపై ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, ఏఎస్పీ శరత్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సై గుంజి అంకమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఏఎస్సైపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు. -
ఎస్.ఐ పై టీడీపీ కార్యకర్తల దాడి
-
ఎస్.ఐ పై టీడీపీ కార్యకర్తల దాడి
స్థానిక ఎన్నికల వేళ చిత్తురు జిల్లా పాల సముద్రం మండలం కావేరి రాజపురంలో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెడుతు ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడున్న టీడీపీ కార్యకర్తలను స్థానిక ఎస్.ఐ అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని సదరు కార్యకర్తలను ఎస్.ఐ హెచ్చరించారు. అప్పటికి వారు వినకపోవడంతో వీడియో తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ తీవ్ర స్థాయిలో ఎస్.ఐ హెచ్చరించారు. అంతే మమ్మల్ని హెచ్చరించే స్థాయి నీదా అంటూ టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎస్.ఐపై దాడికి దిగారు. ఆ ఘటనలో ఎస్.ఐ గాయపడ్డారు. దాంతో పోలీసులు ఆగ్రహంతో టీడీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసులు దెబ్బకు టీడీపీ కార్యకర్తలు కాళ్లకు పని చెప్పారు. స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలింగ్‌ను నిలిచిపోయింది. దాంతో పోలింగ్ బూత్‌లోని అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో జోనల్ ఉన్నతాధికారులు హుటాహుటిన కావేరి రాజపురం చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. దాంతో దాదాపు గంట తర్వాత పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. అయితే కృష్ణా జిల్లా ముసునూరు మండలం వేల్పుచర్లలో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి ఆదినారాయణపై ఆగంతకులు దాడి చేశారు. ఆ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆదినారాయణను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదినారాయణపై దాడిని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.