attempts suicede
-
కోదండరాం ఓడిపోయాడని ఆత్మహత్యాయత్నం
సాక్షి, మహబూబాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ఓటమిని జీర్ణించుకోలేక మహబూబాబాద్ జిల్లా మల్యాల సాదుతండాకు చెందిన గుగులోతు రాజు ఆదివారం మధ్యాహ్నం నలంద డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డోలి సత్యనారాయణ, నాయకులు అతడిని కాపాడారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని వేడుకున్నాడు. ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుధాకర్, యువజన నాయకుడు ఇరుగు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: టీవీవీ గౌరవాధ్యక్షుడు రవీందర్రావు అరెస్టు -
కుటుంబం ఆత్మహత్యాయత్నం.. కానీ
సాక్షి, చెన్నై: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పురుగుల మందు తాగి అత్మహత్యకు ప్రయత్నించారు. ఇందులో మహిళ మృతిచెందింది. ఈ సంఘటన చెన్నైలోని కవరపేటలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుమ్మిడిపూండి యూనియన్ కవరపేట సమీపంలోని అయ్యర్ కండ్రిగై గ్రామానికి చెందిన సెల్వం(42). గ్రామ శివారులోని కవరపేట– సత్యవేడు రోడ్డు సమీపంలో హోటల్ నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. ఈయన భార్య జయంతి(35). వీరికి మహాలక్ష్మి(17), మోనిషా(15) అనే కుమార్తెలున్నారు. వీరితో పాటు సెల్వం తల్లి వళ్లియమ్మళ్ (63) కూడా ఉంటుంది. మంగళవారం రాత్రి సెల్వం కవరపేట నుంచి ఇంటికి వస్తు తనతోపాటు పురుగుల మందు తీసుకువచ్చాడు. అందరూ కలిసి భోజనం చేశాక పురుగుల మందును భార్య, కుమార్తెలు, తల్లికి తాగించాడు. అనంతరం అతను తాగి కింద పడిపోయారు. పిల్లలు పెద్దగా కేకలు వేయడంతో విన్న పక్కింటివారు అక్కడికి వచ్చారు. తలుపులు తెరచి చూడగా అందరూ స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న కవరపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారిని చికిత్స నిమిత్తం చెన్నై ప్రభుత్వ స్టాన్లీ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సెల్వి తల్లి వళ్లియమ్మాళ్ బుధవారం మృతి చెందింది. మిగిలిన నలుగురుకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసును విచారణ చేస్తున్నారు. -
తహశీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
నల్లగొండ: తన సమస్యను ఎన్ని సార్లు మొరపెట్టుకున్న అధికారులు స్పందిచలేదు. మరో వైపు నీళ్లు లేక పొలం ఎండిపోతోంది. దీంతో దిక్కుతోచని ఓ రైతు తహశీల్దార్ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్యాయత్నం చేశాడు. నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. మండల కేంద్రానికి చెందిన సంజీవ్‌రెడ్డి(55) వ్యవసాయ బోరు ఈ మధ్య కాలంలో ఎండిపోయింది. వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తూ పక్క పొలం వాళ్లు బోర్లు వేయడంవల్లే తన పొలంలోని బోరులో నీళ్లు అడుగంటి పోయాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంజీవ్ రెడ్డి పలు మార్లు తహశీల్దారుకు మొరపెట్టుకున్నాడు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విసుగెత్తి.. తహశీల్ ఆఫీసులోనే వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అప్పుడుగానీ స్పందించిన తహశీల్దారు తన కారులో అతడ్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు సంజీవ్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.