జైలులో సాధ్వి ఆమరణదీక్ష
భోపాల్: మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో క్లీన్ చీట్ పొందిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ జైలులో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభమేళాకు వెల్లేందుకు తనను అనుమతించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి దీక్షకు దిగారు. దీనిపై స్పందించిన దేవాస్ లోని న్యాయస్థానం మే 21 లోగా సాధ్విని కుంభమేళాకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని సోమవారం పోలీసులను ఆదేశించింది.
సాధ్వితో సహా మరో 12 మందిని 2008లో మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వం మెకా చట్టం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2008 అక్టోబర్ నుంచి సాధ్వి జైలులో ఉంటున్నారు. అయితే సాధ్వి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేవని ఎన్ఐఏ తాజాగా కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో పేర్కొంది.