attendants
-
మా గోడు వినండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల వెతలు మళ్లీ మొదలయ్యాయి. చట్టంలోని నిబంధనలను అమలు చేసి ఉద్యోగులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చట్ట ప్రకారం ఇచి్చన జీవోలను అమలు చేయకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేసే మహాయజ్ఞాన్ని తలపెట్టింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో దశాబ్దాలుగా కాంట్రాక్టు పద్ధతిపై వర్క్‌షాప్ అటెండర్లుగా విధులు నిర్వహిస్తున్న 22 మందిని రెగ్యులర్ చేస్తూ.. ఈ ఏడాది మార్చి 16న జీవో నంబర్–8 జారీ చేసింది. అనంతరం ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జీవో అమలు తాత్కాలింగా నిలిచిపోయింది. కొత్తగా అధికారంలోకి వచి్చన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల శ్రేయస్సును విస్మరించి న్యాయంగా వారికి దక్కాల్సిన హక్కులను దూరం చేస్తోంది. 50 ఏళ్లు పైబడిన వారే ఎక్కువ ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగుల చట్టంలోని నిబంధనల ప్రకారం వర్క్‌షాప్ అటెండర్లుగా పని చేస్తున్న వారిని గత ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. వీరు ఐటీఐ, డిప్లొమా విద్యార్హతతో దాదాపు 15 ఏళ్లుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పని చేస్తున్నారు. సుమారు 50 ఏళ్ల వయసులో ప్రభుత్వం తమ సేవలను గుర్తించి క్రమబదీ్ధకరించడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. పదవీ వివరణ 62 ఏళ్లు ఉండటంతో.. మిగిలిన పుష్కర కాలం శాశ్వత ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసే అవకాశం దక్కిందనే ఆనందం కాస్తా రెండు నెలల్లోనే ఆందోళనగా మారింది. గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా సాంకేతిక విద్యాశాఖ మాత్రం వాటిని అమలు చేస్తూ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా జాప్యం చేయడం కలవరపెడుతోంది. వాస్తవానికి 22 మంది రెగ్యులర్ ఉద్యోగుల పరిధిలోకి వచ్చినప్పటికీ సాంకేతిక కారణాలతో గడచిన మూడు నెలలుగా కాంట్రాక్టులోనే కొనసాగుతున్నారు. అయితే.. సీఎఫ్ఎంఎస్ ఐడీని మాత్రం బ్లాక్ చేశారు. ఫలితంగా జూన్ నెలలో రావాల్సిన జీతాలు సైతం పెండింగ్‌లో పడ్డాయి. జీతాలపై ఆధారపడటంతో కుటుంబాల పోషణ భారంగా మారుతోంది. ఎందుకింత ఆలస్యం? సాంకేతిక విద్యాశాఖలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న వారిలో 22 మంది పార్క్షాపు అంటెండర్లు, ఇద్దరు లెక్చర్లను క్రమబదీ్ధకరిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచి్చంది. ఇద్దరు లెక్చరర్లు నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులర్ అయ్యారంటూ కొంతమంది కోర్టులో సవాల్ చేశారు. అయితే న్యాయస్థానం మాత్రం ఆ ఇద్దరు లెక్చరర్లు తప్ప మిగిలిన వారందరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది. కానీ, సాంకేతిక విద్యాశాఖ అధికారులు మాత్రం కావాలనే జాప్యం చేస్తున్నట్టు వర్క్‌షాపు అటెంటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ పేరుచెప్పి ఒకసారి, కోర్టు కేసుల పేరు చెప్పి మరోసారి తమకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. -
ఎయిర్‌లైన్స్‌లో కొత్త రూల్! గర్భిణి క్యాబిన్ సిబ్బంది కూడా...
ఎయిర్‌లైన్స్ గర్భిణి క్యాబిన్ సిబ్బందిని విధుల నుంచి తొలగించనని చెబుతుంది. వారు ఉద్యోగం కొనసాగించేలా ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా ఇచ్చింది. అంతేగాదు డెలిరీ అయినా తర్వాత కూడా యథావిధిగా ఉద్యోగాన్ని కొనసాగించవచ్చని కూడా స్పష్టం చేసింది. గత కొంతకాలంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌పై పలు విమర్శులు ఉన్నాయి. లింగ సమానత్వం పాటించడం లేదని గర్భిణి క్యాబిన్ సిబ్బందిని నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. అంతేగాదు వారిని ప్రెగ్నెన్సీ సమయంలో బలవంతంగా వేతనం లేని సెలవుల్లో ఉంచి, తదనంతర డెలివరీ తర్వాత పిల్లల బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వారిని విధుల నుంచి తొలగిస్తుంది. దీనిపై సర్వత్ర విమర్శలు రావడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈ కొత్త రూల్‌ని అమలు చేయనుంది. ఇక నుంచి గర్భణి క్యాబిన్ సిబ్బందిని తొలగించమని చెబుతోంది. అంతేగాదు గర్భిణి క్యాబిన్ సిబ్బంది తాత్కాలికంగా గ్రౌండ్ అటాంచ్మెంట్ పని చేసుకోవచ్చని, ప్రశూతి సెలవుల అనంతరం తిరిగి విధులు నిర్వర్తించ వచ్చని పేర్కొంది. ఈ మహమ్మారి కారణంగా సిబ్బంది కొరత సమస్యను ఎదుర్కొనడంతో ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ గర్భిణి సిబ్బంది మూడు నుంచి తొమ్మిది నెలలు గ్రౌండ్ ప్లేస్మెంట్లో విధులు నిర్వర్తించవచ్చు అని తెలిపింది. అలాగే ప్రతిభావంతులైన తమ సిబ్బందిని వదులుకోమని కూడా పేర్కొంది. అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ యాక్షన్ అండ్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొరిన్నా లిమ్ ప్రసవానంతరం తల్లులు విమాన ప్రయాణం చేయకుండా మరైదైన బాధ్యతలు అప్పగించే అవకాశం లేదా అని ప్రశ్నించారు. అంతేగాదు ఈ కొత్త రూల్ కచ్చితంగా అమలవుతుందా అని కూడా ఎయిర్‌లైన్స్‌ని నిలదీశారు. ఐతే సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈ విషయంపై ఇంకా స్పందించ లేదు. (చదవండి: కొట్టుకువచ్చిన... 500కి పైగా భారీ తిమింగలాలు) -
ఫ్లైట్ విండోస్ ఎందుకు ఓపెన్ చేయాలో తెలుసా?
న్యూయార్క్: సాధారణంగా విమానంలో ప్రయాణమంటే అందరికీ హుషారే. ప్రారంభంలో కొంచెం భయంగా అనిపించినా ప్రయాణం ఊపందుకున్నాక ఏం చక్కా గాల్లో తేలిపోతుంటారు. ఆకాశంలో విహరిస్తున్నట్లుగా ఫీలయిపోతుంటారు. కాసేపట్లోనే చిన్నపాటి నిద్రలోకి జారుకుని ఎన్నో అందమైన కలలు కంటుంటారు. అయితే, మీ కలలను, స్వల్ప నిద్రను భగ్నం చేస్తూ మరికొద్ది సేపట్లో కిందికి దిగబోతున్నాం.. అంతా మీ కిటికీలను ఓపెన్ చేసుకోవచ్చు అని చెబుతుంటారు. అబ్బా అని మీకు చెర్రెత్తిపోతుంది. అయితే ఈ చిరాకు పడటానికి కూడా ఒక కారణం ఉంది. విమానం దిగిపోయే సమయంలో అలా ఎందుకు విండోస్ ఓపెన్ చేయాలని చెప్తారంటే 'ఒక వేళ అత్యవసర పరిస్థితి ఉన్నట్లయితే.. విమానం వెలుపల పరిస్థితులు ఏమిటో ఈ విండో బయట నుంచి చూడొచ్చు. ఒక వేళ అక్కడ శిథిలాలు, అగ్ని కీలలు, నీళ్లు ఉంటే మనం ఇక ఇతర జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకంటే కిటికీలను కమ్మేసేంత పరిస్థితుల్లో ఇవి ఉంటే ముఖ్య ద్వారం గుండా కాకుండా ఇతర మార్గాలను అనుసరించాలని చెప్పే అవకాశం కలుగుతుంది. వాస్తవానికి ఇదంతా కూడా చాలా చిన్న అంశంగా కనిపించవచ్చేమోగానీ.. అలాంటి అత్యవసర సమయాల్లో ప్రతి సెకను లెక్కించుకోవాల్సి ఉంటుంది. విమాన ప్రమాదం చోటుచేసుకునేందుకు 90 సెకన్లలోపు తేరుకుంటే దీనిని నుంచి బయటపడొచ్చు. అందుకే కిటికీలు తెరవాలని చెప్తారని నిపుణులు చెప్తున్నారు.