Aunt Murder
-
భార్య కాపురానికి రావడంలేదని.. అత్తను చంపేశాడు
బుక్కరాయసముద్రం(అనంతపురం జిల్లా): మాటామాట పెరగడంతో ఓ వ్యక్తి తన అత్తపై కొడవలితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన శుక్రవారం చెన్నంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చెన్నంపల్లి గ్రామానికి చెందిన హుసేన్‌బీ(55) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు కాగా అందరికీ వివాహాలయ్యాయి. రెండో కుమార్తె షేకున్‌బీని నార్పలకు చెందిన మహబూబ్‌బాషాకిచ్చి పదేళ్ల క్రితం పెళ్లి చేసింది. అయితే మద్యానికి బానిసైన మహబూబ్‌బాషా రోజూ భార్యను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో వేధింపులు ఎక్కువ కావడంతో రెండురోజుల క్రితం హుసేన్‌బీ తన కూతురు షేకున్‌బీని చెన్నంపల్లికి తీసుకువచ్చింది. శుక్రవారం సాయంత్రం పూటుగా మద్యం తాగి చెన్నంపల్లికి వచ్చిన అల్లుడు మహబూబ్‌బాషా తన భార్యను పంపాలని హుసేన్‌బీతో గొడవకు దిగాడు. మాటామాట పెరగడంతో వెంట తెచ్చుకున్న కొడవలితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో హుసేన్‌బీ తలకు, చేతులకు గాయాలు కాగా తీవ్ర రక్తస్రావమైంది. అక్కడి నుంచి పరారైన మహబూబ్‌బాషా నేరుగా నార్పల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కొన ఊపిరితో ఉన్న హుసేన్‌బీని స్థానికులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. నార్పల పోలీసులు నిందితున్ని బుక్కరాయసముద్రం పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అనూష హత్య కేసులో నిందితుడి అరెస్ట్ కనిపించని తమ్ముళ్లు.. టీడీపీ డీలా! -
అత్త చేతిలో అల్లుడి హతం
కడప, ఎర్రగుంట్ల : తన కూతురును రోజూ మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని పిల్లనిచ్చిన అత్తనే అల్లుడిని దారుణంగా హత్యచేసింది. ఎర్రగుంట్ల మండలం కేజీవీపల్లెలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు రమేష్ తల్లి వీరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి... హనుమనుగుత్తి గ్రామ పంచాయతీ కేజీవీ పల్లెకు చెందిన పెద్దక్క కుమార్తె అంజనమ్మకు, సింహద్రిపురం మండలం హిమకుంట్ల గ్రామానికి చెందిన వీరమ్మ కుమారుడు రమేష్(43)కు 15 ఏళ్లు కిందట వివాహం అయింది. రమేష్ మద్యానికి బానిసై తరచూ అంజనమ్మను, కుమార్తె అనూషాను వేధిస్తుండేవాడు. దీంతో అంజనమ్మ తల్లి పెద్దమనుషులతో పంచాయతీ పెట్టి అల్లుడు రమేష్‌ను కేజీవీపల్లెకు పిలుచుకొని వచ్చింది. కాగా అక్కడే రమేష్ కూలి పనులకు వెళుతూ జీవనం సాగించేవాడు. అయితే మళ్లీ మద్యానికి బానిసై భార్యను, అత్తను చిత్రహింసలకు గురి చేస్తుండేవాడు. శుక్రవారం ఉదయం అంజనమ్మ, రమేష్ గొడవపడ్డారు. ఈక్రమంలో పక్కనే ఉన్న అత్త చలించి తట్టుకోలేక గొడ్డలి తీసుకొని రమేష్ తలపై బలంగా కొట్టగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని సీఐ వెంకటరమణ పరిశీలించారు. మృతుడి తల్లి వీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అత్తను హత్య చేసిన అల్లుడు
బెంగళూరు (కేఆర్ పురం) : చికెన్ రుచిగా వండలేదనే కారణంతో సొంత అత్తను అల్లుడు హత్య చేసిన సంఘటన ఆవలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన వీరప్ప కృష్ణరాజపురంలోని కేఆర్ ఇన్ హోటల్లో సూపర్వైజర్ పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతను కిత్తగనూరుకు చెందిన మునిరత్నమ్మ (50) కుమార్తె సౌమ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరప్ప తన అత్త ఇంటిలోనే నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉంటే మద్యానికి బానిసైన వీరప్ప నిత్యం తాగి వచ్చి అత్తతో గొడవకు దిగేవాడు. ఆదివారం చికెన్ సరిగా వండలేదని అత్తతో గొడవకు దిగాడు. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని సర్ది చెప్పి పంపారు. దీంతో అల్లుడిని బయటే ఉంచి వాకిలి వేసుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇంటి పొగ గొట్టం నుంచి ఇంట్లోకి దిగిన వీరప్ప భార్య సౌమ్య సహాయంతో మునిరత్నమ్మ గొంతునులిమి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.