Australi
-
ధోని ముఖం చాటేశాడు...!
-
కళ్లు తిరిగి పట్టాలపై పడ్డాడు ఆపై...
-
ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం
మిర్పూర్: ట్వంటీ 20 ప్రపంచకప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే సెమీఫైనల్ దూసుకెళ్లిన టీమిండియా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ విసిరిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వంద పరుగుల లోపే చేతులెత్తేసింది. భారత బౌలర్లు మరోమారు రాణించడంతో ఆస్ట్రేలియా 86 పరుగులకే చాపచుట్టేసి టోర్నీనుంచి భారంగా నిష్ర్కమించింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో మ్యాక్స్ వెల్ (23), వార్నర్(19) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లు సమిష్టిగా పోరాడటంతో ఆసీస్ 16.2 ఓవర్లలోనే 86 పరుగులకు ఆలౌటయ్యింది. భారత బౌలరల్లో లెగ్ స్పిన్నర్ రవీంద్ర అశ్విన్ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించగా, మిశ్రాకు రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, శర్మలకు తలో వికెట్టు లభించాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (5) నాలుగో బంతికే హాడ్జ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. యువ సంచలనం విరాట్ కోహ్లీ (23), రహానె (19)తో కలసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కాగా వీరిద్దరూ వెంటవెంటనే వెనుదిరగగా, రైనా (6) తక్కువ పరుగులకే అవుటయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 66/4. ఈ దశలో యువరాజ్‌కు ధోనీ అండ లభించింది. మహీ సంయమనంతో ఆడుతూ యువీకి సహకరించాడు. యువరాజ్ ఫోర్లు, సిక్సర్లతో విజృంభిస్తూ తనలో వాడి తగ్గలేదని నిరూపించాడు. 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. యువరాజ్ ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కాగా చివర్లో ధోనీ (24), యువరాజ్ వెంటవెంటనే అవుటయ్యారు. దీంతో 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ మెగా ఈవెంట్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌లపై గెలుపొందిన సంగతి తెలిసిందే. -
టి-20 ప్రపంచ కప్: చెలరేగిన యువరాజ్, ఆస్ట్రేలియా లక్ష్యం 160
మీర్పూర్: టి-20 ప్రపంచ కప్‌లో నిరాశపరుస్తూ వస్తున్న భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తొలిసారి రెచ్చిపోయాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో యువరాజ్ (43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60) సహజ శైలిలో మెరుపులు మెరిపించాడు. దీంతో ధోనీసేన కంగారూలకు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (5) నాలుగో బంతికే హాడ్జ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. యువ సంచలనం విరాట్ కోహ్లీ (23), రహానె (19)తో కలసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కాగా వీరిద్దరూ వెంటవెంటనే వెనుదిరగగా, రైనా (6) తక్కువ పరుగులకే అవుటయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 66/4. ఈ దశలో యువరాజ్‌కు ధోనీ అండ లభించింది. మహీ సంయమనంతో ఆడుతూ యువీకి సహకరించాడు. యువరాజ్ ఫోర్లు, సిక్సర్లతో విజృంభిస్తూ తనలో వాడి తగ్గలేదని నిరూపించాడు. 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. యువరాజ్ ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కాగా చివర్లో ధోనీ (24), యువరాజ్ వెంటవెంటనే అవుటయ్యారు. దీంతో 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ మెగా ఈవెంట్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌లపై గెలుపొందిన సంగతి తెలిసిందే. -
టి-20 ప్రపంచ కప్: బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా
మీర్పూర్: టి-20 ప్రపంచ కప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ చివరి లీగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ధోనీసేన బ్యాటింగ్‌కు దిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుని భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మెగా ఈవెంట్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌లపై గెలుపొందిన సంగతి తెలిసిందే. కంగారూలపైనా ఇదే జోరు కొనసాగించాలని సమరోత్సాహంతో ఉంది.