Australia bats man
-
ఫైనల్ మ్యాచ్‌కు ముందే కొత్త కారు కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ - వీడియో వైరల్
Matthew Hayden Mahindra Scorpio N: మహీంద్రా కార్లను సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. దేశీయ విఫణిలో విడుదలైన అతి తక్కువ కాలంలో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లిన 'మహీంద్రా స్కార్పియో ఎన్' (Mahindra Scorpio N) ఎస్‌యూవీని మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ 'మాథ్యూ హేడెన్' (Matthew Hayden) కొనుగోలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలో భారతీయ కార్ల తయారీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ మాథ్యూ హేడెన్ ఇటీవల తన గ్యారేజీకి 'స్కార్పియో ఎన్' జోడించాడు. దీనికి సంబంధించిన వీడియోను మహీంద్రా ఆస్ట్రేలియా యూట్యూబ్ ఛానెల్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో మాథ్యూ హేడెన్ క్వీన్స్ల్యాండర్ బ్రిస్బేన్‌లోని మహీంద్రా డీలర్షిప్ చుట్టూ తిరుగుతూ, ఎవరెస్ట్ వైట్ కలర్ స్కీమ్ కలిగిన స్కార్పియో-ఎన్ డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. మహీంద్రా స్కార్పియో-ఎన్ ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలను పొందుతున్న మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రారంభ ధర రూ. 13.26 లక్షలు, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 22.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). వేరియంట్లలో లభించే ఈ కారు 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్లలో లభిస్తుంది. మహీంద్రా స్కార్పియో ఎన్ SUV 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 175 పీఎస్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 203 పీఎస్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది. ఇదీ చదవండి: మస్క్ చేసిన పనికి మండిపడ్డ అమెరికా.. గుణపాఠం చెప్పిన దిగ్గజ కంపెనీలు! ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మొదలైనవి ఉంటాయి. -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు
21 ఏళ్ల ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఆస్ట్రేలియా దేశవాలీ వన్డే టోర్నీ మార్ష్ కప్ 2023-24లో భాగంగా టస్మానియాతో ఇవాళ (అక్టోబర్ 8) జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్రేజర్ (సౌత్ ఆస్ట్రేలియా) కేవలం 29 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న ఫ్రేజర్ 10 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి ఔటయ్యాడు. 21-year-old Jake Fraser-McGurk set a world record by scoring a 29-ball century in Australia's Marsh Cup, breaking Ab de Villiers' record of a 31-ball List A hundred! 🤯👏 pic.twitter.com/z53anVA89r — CricTracker (@Cricketracker) October 8, 2023 ఈ సెంచరీ ద్వారా ఫ్రేజర్ లిస్ట్-ఏ క్రికెట్లో సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలుకొట్టాడు. 2014-15లో జొహనెస్‌బర్గ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ 31 బంతుల్లోనే శతక్కొట్టగా.. ఇవాల్టి మ్యాచ్‌లో ఫ్రేజర్ దాదాపు 10 సంవత్సరాలుగా చలామణిలో ఉండిన ఆ రికార్డును బద్దలు కొట్టాడు. టస్మానియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్రేజర్ సృష్టించిన విధ్వంసం ఏ రేంజ్లో ఉండిందంటే.. 436 పరుగులు అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న అతని జట్టు (సౌత్ ఆస్ట్రేలియా) కేవలం 11.4 ఓవర్లలోనే 172 పరుగులు చేసింది. కేవలం 11.4 ఓవర్లలోనే ఫ్రేజర్ సెంచరీని పూర్తి చేసుకుని ఔటయ్యాడు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్న సౌత్ ఆస్ట్రేలియా సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తుంది. 35 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే 90 బంతుల్లో 122 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. నాథన్ మెక్‌స్వీనీ (47), జేక్ లీమన్ (25) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఫ్రేజర్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. హెన్రీ బ్రంట్ (51), డేనియల్ డ్రూ (52) అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. టస్మానియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జోర్డన్ సిల్క్ (85 బంతుల్లో 116; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు శతకంతో విరుచుకుపడగా.. ఓపెనర్ కాలెబ్ జువెల్ (52 బంతుల్లో 90; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో మెరిశాడు. రైట్ (51) అర్ధసెంచరీతో రాణించగా... చార్లీ వాకిమ్ (48), వెబ్‌స్టర్ (42), వెథరాల్డ్ (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో టస్మానియా నిర్ధేశించిన 436 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆస్ట్రేలియా ఛేదిస్తే.. దేశవాలీ క్రికెట్ అతి భారీ లక్ష్య ఛేదనగా.. లిస్ట్-ఏ క్రికెట్లో రెండో సక్సెస్ఫుల్ రన్ చేజ్‌గా రికార్డుల్లోకెక్కుతుంది. లిస్ట్-ఏ క్రికెట్లో సక్సెస్ఫుల్ రన్‌ఛేజ్ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. -
దుమ్మురేపిన వాట్సన్
లండన్: ఫామ్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ (247 బంతుల్లో 176; 25 ఫోర్లు, 1 సిక్సర్) ఎట్టకేలకు యాషెస్ సిరీస్‌లో గాడిలో పడ్డాడు. ఇంగ్లండ్‌తో బుధవారం ప్రారంభమైన చివరిదైన ఐదో టెస్టులో శతకంతో చెలరేగాడు. ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఒంటిచేత్తో జట్టును గట్టెక్కించాడు. స్మిత్ (133 బంతుల్లో 66 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్సర్) కూడా తన వంతు పాత్రను సమర్థంగా పోషించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్లకు 307 పరుగులు చేసింది. స్మిత్‌తో పాటు సిడిల్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇప్పటికే 0-3తో సిరీస్‌ను కోల్పోయిన క్లార్క్‌సేన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో జట్టులో స్వల్ప మార్పులు చేసింది. జేమ్స్ ఫాల్క్‌నర్ టెస్టుల్లో అరంగేట్రం చేయగా... పేసర్ మిచెల్ స్టార్క్‌కు తుది జట్టులో చోటు దక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే ఓపెనర్ వార్నర్ (6) వికెట్ కోల్పోయింది. రోజర్స్ (23) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా వన్‌డౌన్‌లో వచ్చిన వాట్సన్‌కు చక్కని సహకారం అందించాడు. ఇంగ్లండ్ పేస్ అటాకింగ్‌కు ఏమాత్రం తడబడకుండా వాట్సన్ వేగంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 61 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో ఎండ్‌లో రోజర్స్ మెల్లగా ఆడుతూ వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చాడు. రెండో వికెట్‌కు వీరిద్దరి మధ్య 107 పరుగుల భాగస్వామ్యం నెలకొన్న తర్వాత స్పిన్నర్ స్వాన్... రోజర్స్‌ను అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ క్లార్క్ (7) కుదురుకోవడానికి సమయం తీసుకున్నా విఫలమయ్యాడు. అండర్సన్ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని ఆడబోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆసీస్ 144 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ ఆకట్టుకున్నాడు. వాట్సన్‌తో కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో వాట్సన్ 114 బంతుల్లో కెరీర్లో మూడో సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 145 పరుగులు జోడించి ఆసీస్ భారీ స్కోరుకు పునాది వేశారు. అయితే మరో మూడు ఓవర్లలో రోజు ముగుస్తుందనగా బ్రాడ్ బౌలింగ్‌లో పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వాట్సన్ వెనుదిరిగాడు. అండర్సన్ 2, బ్రాడ్, స్వాన్ చెరో వికెట్ పడగొట్టారు.