IND vs AUS: ప్రాక్టీస్ మొదలైంది
పెర్త్: వరుసగా మూడోసారి ఆ్రస్టేలియా గడ్డపై ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని సొంతం చేసుకునే లక్ష్యంతో భారత క్రికెటర్లు తమ సన్నాహాలు మొదలు పెట్టారు. బుధవారం మధ్యాహ్నం వెస్టర్న్ ఆ్రస్టేలియా క్రికెట్ అసోసియేషన్ (వాకా) మైదానంలో భారత జట్టు సభ్యులంతా ముమ్మర ప్రాక్టీస్ చేశారు. ఆ్రస్టేలియాలో అనధికారిక టెస్టులు ఆడేందుకు వచ్చిన పలువురు భారత్ ‘ఎ’ జట్టు ఆటగాళ్లు సీనియర్ జట్టు సభ్యులను కలిశారు. ‘కింగ్ కోహ్లి’ బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో తలమునకలై చెమటోడ్చాడు. అతనికి, రిషభ్ పంత్‌కు సిరాజ్, ఆకాశ్‌దీప్‌లు బౌలింగ్ చేశారు. మిగతా బ్యాటర్లు సైతం నెట్స్‌లో శ్రమించారు. అయితే భారత కెపె్టన్ రోహిత్ శర్మ టీమిండియాతో ఇంకా కలవలేదు. అతని భార్య ప్రసవ తేది సమీపిస్తుండటంతో శ్రీమతికి తోడుగా ముంబైలో ఉన్నాడు. కాగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్... తొలిటెస్టు కల్లా తమ కెపె్టన్ అందుబాటులోకి వస్తాడని చెప్పాడు. ఆసీస్ మీడియా అసత్య ప్రచారం అభిమానులు, ప్రేక్షకులకు దూరంగా స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తామని టీమిండియాగానీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)గానీ చెప్పలేదు. క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ)ను కోరలేదు. అయినా సరే ఆసీస్ మీడియా పనిగట్టుకొని అసత్య కథనాలు ప్రచురిస్తోంది. ‘వాకా’ గ్రౌండ్లో గేట్లు మూసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకే భారత ఆటగాళ్లు మొగ్గుచూపారని, అక్కడి భారతీయులకు దూరంగా, వేరెవరిని అనుమతించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారని ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక రాసింది. నిజానికి ‘వాకా’లో నవీకరణ పనులు జరుగుతున్నాయి. ఏడీసీఓ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఈ పనులు చేస్తోంది. ఇది పక్కనబెట్టి సదరు పత్రిక భారత క్రికెటర్లు ‘నో డ్రోన్ ఫ్లయ్ జోన్’ ఏర్పాటు చేసుకున్నారని, సాధారణ ప్రజానీకం, క్రికెట్ అభిమానులెవర్ని అనుమతించడం లేదని, ఫొటోలు, వీడియోలు తీసేందుకు కఠినమైన ఆంక్షలు విధించారని ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.మంగళవారం నుంచి ఆదివారం వరకు భారత జట్టుతో పాటు, అక్కడే ఉన్న భారత్ ‘ఎ’ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాలుపంచుకుంటున్నారు. శుక్రవారం నుంచి సీనియర్ భారత్, ‘ఎ’ జట్ల మధ్య ‘సెంటర్ వికెట్ ట్రెయినింగ్’లో భాగంగా వార్మప్ మ్యాచ్ జరుగనుంది. దీనికి ప్రేక్షకులను అనుమతించాల్సిందిగా భారత జట్టు మేనేజ్మెంట్ కోరింది.