పెర్త్‌తోనే లాంగర్ | Justin Langer not has Indian team coach | Sakshi
Sakshi News home page

పెర్త్‌తోనే లాంగర్

Published Wed, May 20 2015 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

Justin Langer not has Indian team coach

న్యూఢిల్లీ : భారత జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ పేరు చర్చకు వచ్చినా... అతను మాత్రం ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో పెర్త్ జట్టుకు కోచ్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం తమ కోచ్‌గా మరో రెండేళ్ల పాటు లాంగర్ ఒప్పందాన్ని పొడిగించింది. మరోవైపు ఇంగ్లండ్ కోచ్ రేసులో లాంగర్ ఉన్నాడనే వార్తలు ఇప్పటిదాకా వినిపించాయి.

‘ఆటగాడిగా, కోచ్‌గా దాదాపు 20 ఏళ్లు కుటుంబానికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా వెళితే మళ్లీ కుటుంబానికి దూరంగా ఉండాలి. ప్రస్తుతానికి పెర్త్ జట్టుతోనే కొనసాగుతాను. భవిష్యత్‌లో ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాను’ అని లాంగర్ స్పష్టం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement