Indian team coach
-
ద్రవిడ్‌కు కరోనా..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడ్డారు. దీంతో జట్టుతో పాటు ఆసియా కప్ టి20 టోర్నీ కోసం ద్రవిడ్ దుబాయ్ విమానం ఎక్కలేదు. ‘అక్కడికి బయల్దేరే ముందు రొటీన్‌గా చేసే కోవిడ్ పరీక్షల్లో ద్రవిడ్‌కు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆయనకు అతి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. దీంతో ఆయన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ పరీక్ష చేసి నెగెటివ్ రిపోర్టు రాగానే ద్రవిడ్ యూఏఈకి పయనమవుతారు’ అని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రస్తుతానికి సహాయక కోచ్ పారస్ మాంబ్రే ఇన్చార్జి కోచ్‌గా వ్యవహరిస్తారు. ఆసియా కప్‌కు ఎంపికైన రోహిత్ శర్మ బృందంలో ముగ్గురు మినహా మెజారిటీ సభ్యులంతా మంగళవారం ఉదయం దుబాయ్‌కి పయనమయ్యారు. జింబాబ్వేలో ఉన్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా, రిజర్వ్ ప్లేయర్ అక్షర్ పటేల్‌లు హరారే నుంచే అక్కడికి బయల్దేరతారు. ఆసియా కప్ ప్రధాన టోర్నీ యూఏఈలో ఈనెల 27 నుంచి జరుగుతుంది. 28న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. -
ఆమెను పురుషుల క్రికెట్ జట్టు కోచ్‌గా చూడాలని ఉంది!
న్యూఢిల్లీ : టీమిండియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌ను పురుషల క్రికెట్ జట్టు కోచ్‌గా చూడాలని ఉందని బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఓ టెలివిజన్ షోలో ఈ ఇద్దరు సరదాగా ముచ్చటించారు. మ్యాచ్ మధ్యలో పుస్తకాల చదవడంపై మిథాలీ స్పందిస్తూ.. ఒత్తిడిని అధిగమించడానికే పుస్తకాలు చదువుతానని పేర్కొన్నారు. దీంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా మంచి ప్రదర్శన కనబర్చడానికి ఉత్తేజాన్నిస్తోందని తెలిపారు. ఇక మిథాలీపై కింగ్ ఖాన్ ప్రశంసల జల్లు కురపించారు. ఇదే తరుణంలో .‘మిథాలీ నిన్ను పురుషుల క్రికెట్ జట్టు కోచ్‌గా చూడాలని ఉందని’ షారుక్ ఖాన్ తన మనసులోని కోరికను బయటపెట్టారు. దీనికి వెంటనే మిథాలీ స్పందిస్తూ.. ‘నేనేప్పుడు నా గొప్ప ప్రదర్శనే ఇవ్వాలనే కోరుకుంటా’ అని తెలిపింది. మిథాలీ నాయకత్వంలో భారత మహిళల క్రికెట్ జట్టు ఆదరణ పొందిందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె నాయకత్వంలోనే రెండు సార్లు భారత్ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. గేతేడాది జరిగిన ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓడినా అద్భుత ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల మనసులను గెలుచుకున్న విషయం తెలిసిందే. -
ఇండియా'ఎ' జట్టు కోచ్ గా ద్రవిడ్
ముంబై: టీమిండియా కోచ్ గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ను బీసీసీఐ నియమించే అవకాశం ఉందనే వార్తలకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. తాజాగా రాహుల్ కు ఇండియా-ఎ టీమ్ కోచ్ తో పాటు అండర్ -19 జట్టుకు బాధ్యతలు అప్పజెప్పుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ బీసీసీఐలో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురితో బోర్డు కొత్తగా క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీలో ద్రవిడ్ లేకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. కాగా, ఆ కమిటీలో చేయడానికి ద్రవిడ్ విముఖంగా ఉన్న కారణంగానే భారత క్రికెట్ లో మరో రెండు కీలక బాధ్యతలను అతనికి అప్పజెప్పింది. -
త్వరలోనే కోచ్‌ను నియమిస్తారు: గవాస్కర్
న్యూఢిల్లీ : కొత్తగా ఏర్పాటు చేసిన బీసీసీఐ సలహాదారుల కమిటీ తొందరలోనే భారత్ జట్టు కోసం కోచ్‌ను వెతికి పట్టుకుంటుందని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్‌ను సరైన దిశలో నడిపించేందుకు ఈ కమిటీ... బీసీసీఐతో కలిసి ఓపికగా పని చేయాలని సలహా ఇచ్చారు. సలహాదారుల కమిటీని ఏర్పాటు చేయాలన్న బోర్డు నిర్ణయం సరైందేనని చెప్పారు. సలహా కమిటీ ఏం చేస్తుందో చెప్పాలి : బేడి సచిన్, లక్ష్మణ్, గంగూలీలతో కూడిన సలహా కమిటీ ఏర్పాటుపై మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడి సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ కమిటీ విధి విధానాలను స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘సరైన రీతిలోనే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే సభ్యులకు ఎలాంటి అధికారం ఉందో వేచి చూడాలి. ఆ ముగ్గురి సేవలను వినియోగించుకోవాలనే ఆలోచన రావడం హర్షణీయం. అంతకన్నా ముందు ఈ కమిటీ గురించి క్షుణ్ణంగా వివరించాల్సిన బాధ్యత బోర్డుకు ఉంది. ఇది నామమాత్రంగా మిగలకూడదు’ అని బేడి అన్నారు. -
ద్రవిడ్ ఎందుకు లేడు?
బీసీసీఐ కొత్తగా నియమించిన సలహా కమిటీలో రాహుల్ ద్రవిడ్ లేకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తొలుత బోర్డు సచిన్, గంగూలీతో పాటు ద్రవిడ్‌ను సంప్రదించింది. అయితే ప్రస్తుతం తాను ఇందులో పని చేయలేనని ద్రవిడ్ చెప్పాడని సమాచారం. మరోవైపు భారత జట్టు కోచ్‌గా అతణ్ని నియమిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయంలో ప్రస్తుతానికైతే ఎలాంటి స్పష్టతా లేదు. -
పెర్త్‌తోనే లాంగర్
న్యూఢిల్లీ : భారత జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ పేరు చర్చకు వచ్చినా... అతను మాత్రం ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో పెర్త్ జట్టుకు కోచ్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం తమ కోచ్‌గా మరో రెండేళ్ల పాటు లాంగర్ ఒప్పందాన్ని పొడిగించింది. మరోవైపు ఇంగ్లండ్ కోచ్ రేసులో లాంగర్ ఉన్నాడనే వార్తలు ఇప్పటిదాకా వినిపించాయి. ‘ఆటగాడిగా, కోచ్‌గా దాదాపు 20 ఏళ్లు కుటుంబానికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా వెళితే మళ్లీ కుటుంబానికి దూరంగా ఉండాలి. ప్రస్తుతానికి పెర్త్ జట్టుతోనే కొనసాగుతాను. భవిష్యత్‌లో ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాను’ అని లాంగర్ స్పష్టం చేశాడు.