ద్రవిడ్ ఎందుకు లేడు?
బీసీసీఐ కొత్తగా నియమించిన సలహా కమిటీలో రాహుల్ ద్రవిడ్ లేకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తొలుత బోర్డు సచిన్, గంగూలీతో పాటు ద్రవిడ్‌ను సంప్రదించింది. అయితే ప్రస్తుతం తాను ఇందులో పని చేయలేనని ద్రవిడ్ చెప్పాడని సమాచారం. మరోవైపు భారత జట్టు కోచ్‌గా అతణ్ని నియమిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయంలో ప్రస్తుతానికైతే ఎలాంటి స్పష్టతా లేదు.