ఇండియా'ఎ' జట్టు కోచ్ గా ద్రవిడ్ | Rahul Dravid appointed India A and Under-19 cricket coach, BCCI | Sakshi
Sakshi News home page

ఇండియా'ఎ' జట్టు కోచ్ గా ద్రవిడ్

Published Sat, Jun 6 2015 5:55 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

ఇండియా'ఎ' జట్టు కోచ్ గా ద్రవిడ్

ఇండియా'ఎ' జట్టు కోచ్ గా ద్రవిడ్

ముంబై: టీమిండియా కోచ్ గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ను బీసీసీఐ నియమించే అవకాశం ఉందనే వార్తలకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. తాజాగా రాహుల్ కు ఇండియా-ఎ టీమ్ కోచ్ తో పాటు అండర్ -19 జట్టుకు బాధ్యతలు అప్పజెప్పుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.

 

ఇటీవల భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ బీసీసీఐలో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురితో బోర్డు కొత్తగా క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది.  అయితే ఈ కమిటీలో ద్రవిడ్ లేకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. కాగా, ఆ కమిటీలో చేయడానికి ద్రవిడ్ విముఖంగా ఉన్న కారణంగానే  భారత క్రికెట్ లో మరో రెండు కీలక బాధ్యతలను అతనికి అప్పజెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement