Australia-India
-
టెస్ట్ సిరీస్‌కు పూర్తి స్థాయిలో సన్నద్దం : కోహ్లీ
సిడ్నీ : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు పూర్తి స్థాయిలో సన్నదమవుతున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. మంగళవారం సిడ్ని వేదికగా జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో భారత్ ఓడినా 2-1తో తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. లక్ష్యాన్ని చేధించే క్రమంలో టాప్ ఆర్డర్ రాణించినప్పటికి మిడిల్ ఆర్డర్ విఫలమైందని తెలిపాడు. చివర్లో హర్థిక్ భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నాడు. టీ-20 సిరిస్ విజయంతో మరింత ఆత్మవిశ్యాసం పెంపొందించాకున్నామని.. సరైన ప్రణాళికలను రూపొందించి టెస్ట్ సిరిస్‌కు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతామని తెలిపాడు. కాగా గతంలో పర్యటించిన జట్టు కంటే ప్రస్తుత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందన్నాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా భారత్ నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది. -
తొలి మ్యాచ్‌కు స్మిత్ అనుమానమే..!
సాక్షి, రాంచీ: భారత్‌పై 4-1తో వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న ఆస్ట్రేలియాకు టీ20 మ్యాచ్‌లకు ముందు మరో భయం పట్టుకుంది. కనీసం టీ20 సిరీస్‌ను అయినా గెలుచుకొని సగర్వంగా సొంత దేశంలో కాలుమోపాలునుకున్న ఆసీస్‌కు గాయల బెడద కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాంచీ వేదికగా శనివారం జరిగే తొలి టీ20 మ్యాచ్‌కు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆడుతాడా లేదా అనే భయం కంగారులలో నెలకొంది. ఈ మ్యాచ్‌కు స్మిత్ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం రాంచీలో ప్రాక్టీస్ చేస్తూ స్మిత్ గాయపడ్డాడు. వెంటనే అతనిని లోకల్ ఆసుపత్రికి తరలించారు. భుజానికి చిన్న గాయం అయినట్లు, ఎంఆర్ఐ స్కాన్ తీసినట్లు తెలుస్తోంది. డాక్టర్ల సూచనల మేరకు స్మిత్‌కు ఆసీస్ టీం మేనేజ్మెంట్ తొలి మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. -
పాండ్యా నా కంటే బెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా నయా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. దూకుడైన ఆటతో సిక్సర్లతో విరుచుకుపడే పాండ్యా ఫ్యాన్ క్లబ్లో భారత మాజీ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ కూడా చేరిపోయారు. ఇండోర్ వన్డేలో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ నయా ఆలౌరౌండర్పై మాజీ ఆల్‌రౌండర్ ప్రశంసల జల్లు కురిపించారు.‘ హార్దిక్ పాండ్యా తన కన్నా గొప్ప ఆటగాడు. అతను ఈ స్థాయికి రావడానికి చాల హార్డ్‌వర్క్ చేశాడు. ఎక్కువగా మాట్లాడి అతనిపై అనవసర ఒత్తిడి తీసుకురాదల్చుకోలేదు. గొప్ప ఆటగాడిగా సత్తా చాటే నైపుణ్యం పాండ్యాకు ఉంది.’ అని మంగళవారం కపిల్ మీడియాతో వ్యాఖ్యానించారు. పాండ్యాను మరో కపిల్ దేవ్‌గా గుర్తిస్తున్న సందర్భంలో కపిల్‌దేవే నా కన్నా గొప్ప ఆటగాడని కితాబివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అరంగేట్ర మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అరుదైన ఆటగాళ్లలో పాండ్యా ఒకడు. గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్ మ్యాచ్‌తో వన్డేలో అరంగేట్రం చేసిన పాండ్యా ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో చెన్నైలో తొలి వన్డే విజయంలో కీలకపాత్ర పోశించి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచారు. -
క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలపై దాడులు
ముగ్గురు బుకీల అరెస్టు రూ.4.10 లక్షలు స్వాధీనం సిటీబ్యూరో: సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నగర శివార్లలోని క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలపై గురువారం వరుస దాడులు చేశారు. తివారీ, మోహన్‌లాల్, వెంకట్రాంరెడ్డి అనే బుకీలను అరెస్టు చేశారు. వీరితో పాటు బెట్టింగ్‌లో పాల్గొన్న పలువురిని అరెస్టు చేశారు. బుకీల వద్ద నుంచి రూ.4.10 లక్షల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచ క్రికెట్ పోటీల్లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌పై నగర శివార్లలో జోరుగా బెట్టింగ్‌లు జరిగాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) అదనపు డీసీపీ ఈ.రాంచంద్రారెడ్డి తన బృందాలను అప్రమత్తం చేశారు. ఈస్ట్‌జోన్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లు ఉమేందర్, పుష్పన్‌కుమార్, ఎస్ఐలు రాములు, ఆంజనేయులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న కేంద్రాలపై దాడులు చేశారు. ఎల్బీనగర్లో... నాగోలు రాఘవేంద్రకాలనీ నివాసి రాంరెడ్డి వెంకట్రాంరెడ్డి (47) షేర్ మార్కెట్లో పని చేస్తున్నాడు. ఇతను ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఫోన్ల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. రూ.21 వేలు, కంప్యూటర్, నాలుగు సెల్ఫోన్లు, ట్యాబ్‌ను స్వాధీనం చేసుకుని వెంకట్రాంరెడ్డిని రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్‌లో... రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని పాండురంగానగర్ నివాసి సాయి ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా ఎస్ఓటీ పోలీసులతో పాటు రాజేంద్రనగర్ ఎస్ఐ కనకయ్య దాడి చేశారు. బుకీ తివారీతో పాటు బెట్టింగ్‌రాయుడు హరీష్ తదితరులను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.18,400 స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్... మియాపూర్ ఠాణా పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా మోహన్‌లాల్ అనే బుకీతో పాటు బెట్టింగ్ రాయుళ్లను ఎస్ఓటీ పోలీసులు పట్టున్నారు. నిందితుల నుంచి రూ.3.70 లక్షలతో పాటు టీవీ, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడుగురి పట్టివేత... చాంద్రాయణగుట్ట: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్టు నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. డీసీపీ కథనం ప్రకారం... చార్మినార్, బహదూర్‌పురా, మలక్‌పేట పోలీస్స్టేషన్ల పరిధిలో చేలాపురాకు చెందిన పంకజ్ కుమార్ అగర్వాల్, కిషన్‌బాగ్‌కు చెందిన గులాం ఫరీద్, షేక్ హసన్, మహ్మద్ అస్లాం, మహ్మద్ హుస్సేన్, కొత్తపేటకు చెందిన జి.శ్రీకాంత్, వనస్థలిపురానికి చెందిన బి.రాజశేఖర్ , మిర్యాలగూడకు చెందిన రాజులు గ్రూప్‌లుగా ఏర్పడి లైవ్ క్రికెట్ సమయంలో ఫోన్లలో పంటర్లతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దక్షిణ, తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఠాకూర్ సుఖుదేవ్ సింగ్, సి.హెచ్.శ్రీధర్, ఎస్సైలు ఎ.సుధాకర్, శేఖర్ రెడ్డి, రవికుమార్, మల్లేష్, వెంకటేశ్వర్లు, గౌస్ దాడులు చేసి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు, 4 సెల్ఫోన్లు, కలర్ టీవీ మొదలైనవి స్వాధీనం చేసుకున్నారు.