
సాక్షి, రాంచీ: భారత్‌పై 4-1తో వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న ఆస్ట్రేలియాకు టీ20 మ్యాచ్‌లకు ముందు మరో భయం పట్టుకుంది. కనీసం టీ20 సిరీస్‌ను అయినా గెలుచుకొని సగర్వంగా సొంత దేశంలో కాలుమోపాలునుకున్న ఆసీస్‌కు గాయల బెడద కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాంచీ వేదికగా శనివారం జరిగే తొలి టీ20 మ్యాచ్‌కు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆడుతాడా లేదా అనే భయం కంగారులలో నెలకొంది.
ఈ మ్యాచ్‌కు స్మిత్ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం రాంచీలో ప్రాక్టీస్ చేస్తూ స్మిత్ గాయపడ్డాడు. వెంటనే అతనిని లోకల్ ఆసుపత్రికి తరలించారు. భుజానికి చిన్న గాయం అయినట్లు, ఎంఆర్‌ఐ స్కాన్ తీసినట్లు తెలుస్తోంది. డాక్టర్ల సూచనల మేరకు స్మిత్‌కు ఆసీస్ టీం మేనేజ్‌మెంట్ తొలి మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment