ఆస్ట్రేలియాకు వచ్చినపుడు... అశ్విన్ తలకు గురి పెడతా: స్టార్క్
ఆసీస్ గడ్డపై భారత స్పిన్నర్ అశ్విన్‌కు బౌలింగ్ చేసి అతని నుదుటిపై బంతిని సంధించాలని తాను కోరుకుంటున్నట్లు పేస్ బౌలర్ మిషెల్ స్టార్క్ అన్నాడు. గాయంతో సిరీస్ నుంచి నిష్క్రమించక ముందు బెంగళూరు టెస్టులో తనను అవుట్ చేసిన తర్వాత నుదుటిపై వేలు పెట్టి అశ్విన్ చేసిన సంజ్ఞ స్టార్క్ ఆగ్రహానికి కారణం.
అదే టెస్టులో స్టార్క్ బౌలింగ్‌లో ముకుంద్ బ్యాట్‌కు తగిలిన బంతి అనూహ్యంగా సిక్సర్‌గా మారగా... తలరాత అన్నట్లుగా స్టార్క్ అదే తరహాలో సైగ చేశాడు. సిరీస్‌లో మాటల యుద్ధానికి భారత జట్టే కారణమని కూడా స్టార్క్ ఆరోపించాడు.