విదేశీ విద్య
బోధన, పరిశోధన రంగాల్లో మెరుగైన విద్యను అందించడంలో ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు ప్రపంచంలోనే ముందు వరుసలో నిలుస్తున్నాయి. తరగతి గది బోధనతోపాటు కావాల్సిన స్కిల్స్ పెంపొందించుకునేలా.. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేయు డం ఇక్కడి విద్యా విధానంలోని ప్రత్యేకత. స్టడీ అబ్రాడ్‌లో అమెరికా తర్వాత భారతీయుులకు బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తున్న ‘ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్’ పై ఫోకస్..
కోర్సులు: ముఖ్యంగా ఏవియేషన్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫిజియోథెరపీ, మెడిసిన్ అండ్ లైఫ్ సెన్సైస్‌లో ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఫోరెన్సిక్ అండ్ ఎనలిటికల్ సైన్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ కోర్సులు; ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్, స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్, మెడికల్ రేడియాలజీ కోర్సులు మంచి ఆదరణ పొందుతున్నాయి.
కోర్సులు... అర్హతలు:
స్కూల్స్: ఆస్ట్రేలియాలో స్కూల్ విద్యకు స్కూళ్లను బట్టి వేర్వేరు అర్హతలు ఉన్నాయి. అకడమిక్ ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అండర్గ్రాడ్యుయేట్ కోర్సులు: ఆస్ట్రేలియా సీనియర్ సెకండరీ సర్టిఫికెట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (మనదేశంలో 10+2/ఇంటర్మీడియెట్) ఉత్తీర్ణత. కొన్నిటికి ప్రత్యేక అర్హతలు తప్పనిసరి.
పీజీ కోర్సులు: ఈ కోర్సుల్లో చేరాలంటే.. సంబంధిత డిగ్రీ లేదా పని అనుభవం, పరిశోధన సామర్థ్యం ఉండాలి.
ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెక్టార్లో సర్టిఫికెట్, డిప్లొమా అండ్ అడ్వాన్స్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటారుు. ఈ కోర్సులకు నిర్దేశించిన అర్హతలతోపాటు పని అనుభవం ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా, అసోసియేట్ డిగ్రీ, అడ్వాన్స్డ్ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్, గ్రాడ్యుయేట్ డిప్లొమా, మాస్టర్స్ బై కోర్సు వర్క్ ఉంటారుు. పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్‌లో భాగంగా.. మాస్టర్స్ బై రీసెర్చ్ డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీ ఉంటాయి. వీటితోపాటు ఆయా కోర్సులకు అనుగుణంగా జీఆర్ఈ/టోఫెల్/ జీమ్యాట్/ఐఈఎల్టీఎస్ స్కోర్లు తప్పనిసరి.
ప్రవేశం: ఆస్ట్రేలియాలో ఏటా రెండుసార్లు ఫిబ్రవరి/మార్చి, సెప్టెంబర్/నవంబర్లలో అకడెమిక్ సెషన్ మొదలవుతుంది. ప్రవేశించదలచుకున్న సెషన్‌కు కనీసం ఏడాది ముందుగా అభ్యర్థులు సన్నాహాలు ప్రారంభించాలి. అడ్మిషన్ ఖరారైన వెంటనే వీసా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి. ఇందుకోసం సంబంధిత ఇన్స్టిట్యూట్ జారీచేసే లెటర్ ఆఫ్ ఆఫర్ లేదా ఎలక్ట్రానిక్ ఎన్రోల్మెంట్ లెటర్ ఆధారంగా ఆస్ట్రేలియా ఎంబసీను సంప్రదించాలి.
దరఖాస్తు: విద్యార్థులు నేరుగా ఇన్స్టిట్యూట్ల వెబ్సైట్ల నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి సంబంధిత చిరునామాకు పంపాలి. సాధారణంగా హైస్కూల్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు సర్టిఫికెట్లు... రిఫరెన్స్ లెటర్, పర్సనల్ లెటర్‌ను జత చేయాలి. ఇప్పటికే ఉద్యోగం చేస్తూ స్టడీ లీవ్‌ను వినియోగించుకునేవారు తప్పనిసరిగా తమ యజమానిచ్చే రిఫరెన్స్ లెటర్‌ను చూపించాలి. పీహెచ్డీ, లేదా మాస్టర్స్ డిగ్రీ బై రీసెర్చ్‌కి దరఖాస్తు చేసే అభ్యర్థులు.. తాము రీసెర్చ్ చేయదలచిన అంశానికి గల ప్రాముఖ్యత, తమకున్న ఆసక్తి తదితర వివరాలతో రీసెర్చ్ ప్రపోజల్‌ను మూడు నుంచి ఐదు పేజీలలో రాసి దరఖాస్తుకు జత చేయాలి.
వీసా: ఆస్ట్రేలియాలో మూణ్నెల్ల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న కోర్సులనభ్యసించాలనుకునేవారు విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఆ దేశ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అండ్ సిటిజన్‌షిప్(డీఐఏసీ) మంజూరు చేస్తుంది. విద్యార్థి చేరిన కోర్సు... కామన్వెల్త్ రిజిస్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కోర్సెస్ ఫర్ ఓవర్సీస్ స్టూడెంట్స్(సీఆర్ఐసీఓఎస్)లో నమోదై ఉంటేనే వీసా దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారు. వీసా కోసం ఐఈఎల్‌టీఎస్‌కు ప్రత్యామ్నాయాలుగా టోఫెల్, పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ స్కోర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ప్రముఖ యూనివర్సిటీలు:
ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ
యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్
యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్
ఉపయోగకరమైన వెబ్సైట్లు
www.studyinaustralia.gov.au
www.aei.gov.au
www.immi.gov.au
www.studiesinaustralia.com
www.india.embassy.gov.au