Australian women
-
నాడు చెత్తకుండీలో... నేడు క్రికెట్ దిగ్గజం!
‘జీవిత వాస్తవాలు ఫిక్షన్ కంటే వింతగా ఉంటాయి’అంటారు. దీనికి బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పుణెలోని ఒక చెత్తకుండీలో దయనీయమైన స్థితిలో కనిపించిన ఆ పాపను విధి ఆస్ట్రేలియాకు చేర్చింది. ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా లిసా సత్తా చాటింది. వరల్డ్ కప్ గెలుచుకుంది.మహారాష్ట్రలోని పూణేలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపను అనాథాశ్రమం ముందు ఉన్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు. ఆ ఆశ్రమ నిర్వాహకుడు పాపను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడు ‘లైలా’ అనే పేరు పెట్టాడు. ఆ రోజుల్లో స్యూ, హరేన్ అనే అమెరికన్ దంపతులు మన దేశానికి వచ్చారు. వారికి ఒక బిడ్డ ఉన్నప్పటికీ అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ఇండియాకి వచ్చారు.‘మాకు అందమైన అబ్బాయి కావాలి’ అంటూ ఆ దంపతులు ఆశ్రమానికి వచ్చారు. కోరుకున్న అబ్బాయి వారికి కనిపించలేదు. అయితే స్యూ కళ్లు లైలా మీద పడ్డాయి. లైలా ప్రకాశవంతమైన గోధుమ రంగు కళ్లు, అమాయకమైన ముఖం చూసి వావ్ అనుకుంది స్యూ. ఆ తరువాత లైలాను దత్తత తీసుకున్నారు. (Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట)దత్తత తరువాత ‘లైలా’ పేరు ‘లిసా’గా మారింది. మొదట్లో యూఎస్‌లో ఉన్న ఆ దంపతులు ఆ తరువాత సిడ్నీలో శాశ్వతంగా స్థిరపడ్డారు. కుమార్తెకు క్రికెట్ ఆడడం నేర్పించారు. ఆ ఆటే లిసా జీవితాన్ని మార్చేసింది. మొదట లిసా మాట్లాడింది. ఆ తరువాత ఆమె బ్యాట్ మాట్లాడింది. ఆ తరువాత ఆమె రికార్డ్‌లు మాట్లాడడం మొదలైంది! (నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్)ఐసీసీ ర్యాంకింగ్ విధానం మొదలైనప్పుడు ఆమె ప్రపంచంలోనే నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ఉంది. నాలుగు ప్రపంచ కప్‌లలో పాల్గొంది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సత్తా చాటిన లిసా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. -
ఆసీస్ యువతులకు ఐఎస్ వల
-
ఆసీస్ యువతులకు ఐఎస్ వల
మెల్ బోర్న్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ(ఐఎస్) చాప కింద నీరులా ప్రపంచమంతా పాకుతోంది. తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు పెద్ద ఎత్తున యువతను ఆకర్షిస్తోంది. ఆస్ట్రేలియా యువతులకు ఐఎస్ వల వేస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. విలాసవంతమైన జీవితం కల్పిస్తామని ఆశచూపి 18 నుంచి 20 ఏళ్ల వయసున్న యువతులను సోషల్ మీడియా ద్వారా ఆకర్షిస్తోందని విక్టోరియా తీవ్రవాద నిరోధక దళం వెల్లడించింది. గత రెండు నెలల్లో ఐఎస్ వలలో పడిన డజనుపైగా ఆస్ట్రేలియా యువతులు అందులో చేరేందుకు ప్రయత్నించారని తెలిపింది. ఐదుగురు యువతులు సిరియాకు వెళ్లారని, మరో నలుగురిని టర్కీలో అధికారులు నిలువరించారని వివరించింది. యువకులతో పోలిస్తే యువతులను సులభంగా బుట్టలో పడేయొచ్చన్న ఉద్దేశంతో వారికి ఐఎస్ ఎర వేస్తోందని తెలిపింది. ఐఎస్ మాయలో పడిన యువతులు కల్లోలిత సిరియా, ఇరాక్ లకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. -
పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ హత్య
పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ టోనీ అన్నెల్ గేట్(75) దారుణ హత్యకు గురైంది. పోలీసుల సమాచారం మేరకు... సత్యసాయి భక్తురాలైన టోనీ అన్నెల్ గేట్ ఈ ఏడాది జూలై 23న పుట్టపర్తికి వచ్చింది. అప్పటి నుంచి ఆగస్ట్ 14 వరకు ప్రశాంతి నిలయంలోని మిత్రురాలి ఇంటిలో గడిపింది. ఆగస్ట్ 15 నుండి వివేకానందనగర్‌లో సాయిగౌరీ అపార్ట్మెంట్లోని 304 నంబర్ గదిలో నివసిస్తోంది. ఆమెకు ఇక్కడే ఉంటున్న గ్రైట్ డీ సుట్టర్ అనే మరో విదేశీ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆగస్టు 28న వస్తువుల కొనుగోలు విషయమై బెంగళూరు వెళ్తున్నానని తన మిత్రురాలు సుట్టర్కు సమాచారం ఇచ్చింది. ఆ మరుసటి రోజు నుండి టోనీ కనిపించలేదు. అనుమానం వచ్చిన సుట్టర్ అక్టోబర్ 12వ తేదీన పుట్టపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న టోనీ కుమార్తె, కుమారులకు సమాచారం అందించింది. టోనీ కుమార్తె వెంటనే ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేసింది. సాయిగౌరీ ఆపార్ట్మెంట్ వాచ్మెన్ భగవంతుడిని పోలీసులు విచారించారు. డబ్బు కోసం ఆగస్టు 29న ఉదయం 11.30 గంటలకు ఎదుటి అపార్ట్మెంట్ వాచ్‌మన్ పోతులయ్య సహకారంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోతులయ్య, తన బావమరిది నాగరాజు సహకారంతో టోనీ మృతదేహాన్నిసుమో వాహనంలో కొత్తచెరువు మండలంలోని తన స్వగ్రామమైన తలమర్ల సమీపంలోని ఈతచెట్ల వనం వద్దకు తరలించి పూడ్చిపెట్టారు. శుక్రవారం రాత్రి పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు.