Auto Passengers
-
ఆటోలో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు గుడ్ న్యూస్
-
ఆటో ప్రయాణికులే ఆరుగురి టార్గెట్!
అడ్డగుట్ట: ఆటో ప్రయాణికులే ఆరుగురి దొంగల టార్గెట్. పథకం ప్రకారం ప్రయాణికులకు ఆటోలో ఎక్కించుకోవడం.. ప్రయాణికుల సెల్ఫోన్లు, పర్సులు కొట్టేయడంలో వీరు ఘనాపాఠీలు. వారాసిగూడ, పాతబస్తీలకు చెందిన ఈ ఆరుగురు యువకులు చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వారాసిగూడకు చెందిన ఖాజా పాషా(23) అనే ఆటో డ్రైవర్, అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మాన్(24), ఫర్వేజ్(22), మహ్మద్ ఖాధీర్(21), మహ్మద్ శవాజ్ (22)లతో కలసి ముఠాగా ఏర్పడ్డారు. ఖాజా పాషా ఆటోలో వీరు ప్రయాణిస్తూ ఆటోలో ఎక్కిన ప్రయాణికుల సెల్ఫోన్లను మాయం చేస్తుంటారు. దొంగిలించిన సెల్ఫోన్లను జగదీశ్ మార్కెట్లోని మరో స్నేహితుడు ఫయాజ్(23)కు అమ్ముతుంటారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్లోని సంతోష్ సొసైటీ వద్ద డబ్బులు పంచుకుంటున్నారు. విషయం తెలుసుకున్న తుకారాంగేట్ పోలీసులు ఆ ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. మహ్మద్ ఫర్వేజ్ పై హత్య కేస్, రెయిన్ బజార్ పోలీస్స్టేషన్లో రౌడీ షీట్ ఉందని, మిగిలిన వారు అంతా చిన్న దొంగలు. వారి వద్ద నుంచి 53 సెల్ఫోన్లు, 4 తల్వార్లు, రూ.15వేలు, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
షేర్ ఆటోనా.. అమ్మబాబోయ్!
మామూలుగా ఆటో అంటే ముగ్గురు ప్రయాణికులు, ఒక డ్రైవర్ మాత్రమే ఉంటారు. కానీ, శివార్లతో పాటు నగరం నడిబొడ్డున కూడా తిరుగుతున్న షేర్ ఆటోల వ్యవహారం చూస్తుంటే కళ్లు తిరుగుతాయి. వెనకాల సీట్లో ఆరుగురిని, డ్రైవర్ సీటుకు అటూ ఇటూ కూడా ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టుకుని, పెద్ద సౌండుతో పాటలు పెట్టి, పల్సర్ బైకులను కూడా ఓవర్ టేక్ చేసేంత స్పీడుతో వెళ్తుంటారు. దానికి తోడు ఆ ఆటోల నుంచి వచ్చే పొగ విషయం చెప్పనే అక్కర్లేదు. వాటి వెనకాల బైకుల మీద వెళ్లే వాళ్లు, పాదచారుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ప్రయాణికులకు రక్షణ ఉండదని తెలిసినా, చార్జీ తక్కువ కావడం, సమయానికి ఆర్టీసీ సిటీ బస్సులు ఖాళీగా ఉండకపోవడంతో చాలామంది వీటిని ఆశ్రయిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పుడో తమకు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే ఇలా ఎక్కువ మందిని ఎక్కించుకుని వెళ్లే ఆటోల మీద జరిమానాలు వడ్డించి, మిగిలినన్నాళ్లు తమకు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తారు. లోపల కూర్చున్నవాళ్ల ప్రాణాలకు, వెనకాల వెళ్లేవారి ఆరోగ్యాలకు ఏమాత్రం భరోసా లేకుండా చేస్తున్న ఈ షేర్ ఆటోల గురించి ఎన్నిసార్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్ల నుంచి కూడా తగిన స్పందన వచ్చిన దాఖలాల్లేవు. ఇప్పటికైనా నగర ప్రజలకు వీటి బారి నుంచి రక్షణ లభిస్తుందేమో చూడాలి. షేర్ ఆటోల గురించి మీరే మంటారు. మీ స్పందన తెలపండి.