auto permit scam
-
నిలువు దోపిడీ! కారు ధరలకు చేరువగా ఆటో రిక్షాలు
సాక్షి, హైదరాబాద్: ఆటోరిక్షా ప్రస్తుత షోరూమ్ ధర రూ.2.20 లక్షలు. కానీ అది ఆటోడ్రైవర్ చేతికొచ్చేసరికి రూ.4.25 లక్షలకు చేరుతుంది. అంటే సాధారణ ధరపైన రూ.2 లక్షలు అదనంగా చెల్లించవలసి వస్తుంది. వేల కొద్దీ ఆటో పర్మిట్లను తమ గుప్పెట్లో పెట్టుకొన్న ఫైనాన్షియర్లు నిరుపేద ఆటోడ్రైవర్లపై సాగిస్తున్న నిలువుదోపిడీ ఇది. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త ఆటో పరి్మట్లపైన ఆర్టీఏ ఆంక్షలు విధించింది. దీంతో పాత ఆటో రిక్షాల స్థానంలో మాత్రమే కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాలం చెల్లిన పాత ఆటోలను తుక్కుగా మార్చి ఆ పర్మిట్పైన కొత్త ఆటో కొనుగోలు చేయవచ్చు. సుమారు 80 వేలకు పైగా పరి్మట్లు ఫైనాన్షియర్ల చేతుల్లోనే ఉన్నాయి. ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకొని ఆటోలు కొనుగోలు చేసిన డ్రైవర్లు చివరకు ఆ అప్పులు చెల్లించలేకపోతున్నారు. దీంతో వారి నుంచి సదరు ఫైనాన్స్ సంస్థలు ఆటోలను జఫ్తు చేసుకొని ఆ పరి్మట్లను మరో డ్రైవర్‌కు కట్టబెడుతున్నాయి. ఇలా సుమారు 500 మంది చిన్న, పెద్ద ఫైనాన్షియర్లు, ఫైనాన్స్ సంస్థలు నగరంలోని లక్ష మందికిపైగా ఆటోడ్రైవర్లను తమకు శాశ్వత రుణగ్రస్తులుగా మార్చుకొని రూ.వందల కోట్ల మేర వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా నిలిచిపోయిన కార్యకలాపాలు తాజాగా తిరిగి మొదలయ్యాయి. భారీగా పెరిగిన పర్మిట్ ధరలు... కోవిడ్ ఆంక్షలన్నీ తొలగిపోయి ఇంచుమించు సాధారణ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నగరానికి తిరిగి వలసలు మొదలయ్యాయి. అప్పట్లో కోవిడ్ కారణంగా అప్పులు చెల్లించలేక ఆటోరిక్షాలు, క్యాబ్‌లను ఫైనాన్స్ సంస్థలకు అప్పగించి సొంత ఊళ్లకు వెళ్లిన వేలాది మంది డ్రైవర్లు ఇప్పుడు తిరిగి ఉపాధి కోసం నగరానికి చేరుకుంటున్నారు. ఆటోల కోసం ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు పాత ఆటో పరి్మట్ల ధరలను అమాంతంగా పెంచేసి డ్రైవర్లకు కట్టబెడుతున్నారు. కోవిడ్‌కు ముందు కేవలం రూ.75 వేలు ఉన్న పాత ఆటో పరి్మట్‌ను ఇప్పుడు ఏకంగా రూ.1.75 లక్షలకు పెంచారు. నిజానికి పర్మిట్లకు ఎలాంటి ధర ఉండదు. నగరంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు అవకాశం లేకపోవడం వల్ల పాతవాటి స్థానంలో కొత్తవి తీసుకొనేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇలాంటి పాత పర్మిట్లపైన కొత్త ఆటో కోసం మరో 2.20 లక్షలు చెల్లించవలసి వస్తుంది. అంటే ఒక ఆటో ధర ఏకంగా రూ.4 లక్షలకు చేరుతుంది. దీనికి మరి కొంత సర్వీసు చార్జీలను కలిపి ఫైనాన్స్ సంస్థలు రూ.4.25 లక్షలకు విక్రయిస్తున్నారు. ‘అప్పు చేసి ఆటోలు కొనుగోలు చేస్తున్న డ్రైవర్లు మరోసారి రుణగ్రస్తులుగా మారాల్సి వస్తుందని.’ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దోపిడీని ఆపేదెవరు... కొత్త పర్మిట్లపైన ఆంక్షలు విధించిన రవాణా శాఖ పాత పర్మిట్ ధరలను మాత్రం నియంత్రించడం లేదు. పర్మిట్ అంటే ఒక డ్రైవర్ ఆటో నడిపేందుకు ఇచ్చే అనుమతి పత్రం (ప్రొసీడింగ్స్). కానీ ఈ పత్రాలే ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఫైనాన్స్ సంస్థల ఈ నిలువు దోపిడీ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు, అన్ని ప్రభుత్వ విభాగాలకు తెలిసిందే. కానీ అది తమ పరిధిలోని అంశం కాదంటూ అందరూ చేతులెత్తేయడం గమనార్హం. అంతిమంగా నిరుపేద ఆటోడ్రైవర్ సమిధగా మారుతున్నాడు. (చదవండి: ఉచిత బియ్యం ఉఫ్! సాక్షాత్తు లబ్ధి దారులే అమ్ముకుంటున్నారు) -
అంతా వాళ్లిష్టం..
సాక్షి సిటీబ్యూరో: ఆటో పర్మిట్లు ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. సాధారణంగా కొత్త ఆటో ధర రూ.1.60 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు ఉంటుంది. అయితే ఫైనాన్షియర్లు విక్రయించే ధర ఏకంగా రూ.2.7 లక్షలు కావడం గమనార్హం. అంటే ఒక్క ఆటోపై రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ‘ఆటోడ్రైవర్ల సంక్షేమం’ పేరుతో అనేక రకాల చట్టాలను రూపొందించే రవాణాశాఖ ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతోంది. వేల సంఖ్యలో ఆటో పర్మిట్లు ఫైనాన్షియర్ల గుప్పిట్లో ఉండడమే ఇందుకు కారణం. వాహన కాలుష్యం దృష్ట్యా ప్రభుత్వం నగరంలో కొత్త ఆటోపర్మిట్లపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలే ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఆంక్షల నేపథ్యంలో ఆటోడ్రైవర్లు నేరుగా షోరూమ్‌కు వెళ్లి ఆటో కొనుగోలు చేసే వీలు లేదు. కాలం చెల్లిన, పాత ఆటో రిక్షాల స్థానంలో మాత్రమే కొత్త వాటిని కొనుగోలు చేయవచ్చు. రవాణా అధికారుల సమక్షంలో పాత ఆటోలను తుక్కు కింద మార్చివేస్తే వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు అనుమతిస్తారు. ఫైనాన్షియర్ల చక్రవడ్డీ వ్యాపారం కారణంగా సకాలంలో డబ్బులు చెల్లించలేక ఆటోరిక్షాలను వదులుకున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. అలాంటి పాత వాహనాల పర్మిట్లను ఫైనాన్షియర్లు రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షలకు విక్రయిస్తున్నారు. అంటే ఒక ఆటోడ్రైవర్ కొత్తగా ఆటో కొనుగోలు చేయాలంటే పాత పర్మిట్‌కు రూ.లక్ష చొప్పున, కొత్త ఆటోకు రూ.1.6 లక్షల చొప్పున రూ.2.6 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. డిఫాల్టర్లుగా మారిన ఆటోడ్రైవర్ల నుంచి వచ్చే వాటితో పాటు సహజంగానే కాలం చెల్లిన ఆటోలను కూడా వాటి యజమానుల నుంచి కొనుగోలు చేసి రూ.లక్షల్లో విక్రయిస్తున్నారు. అక్రమార్జనకు మూలం ఇక్కడే.. ఒక ఆటోడ్రైవర్ ఆటోరిక్షా ద్వారా నగరంలో ఉపాధి పొందాలంటే కనీసం రూ.2.7 లక్షల వరకు వెచ్చించాలి. ఇది సాధ్యం కాకపోవడంతో తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులకు మరికొంత అప్పు చేయాల్సి వస్తుంది. వీరి అవసరం ఫైనాన్షియర్లకు అక్రమార్జనకు ఊతమిస్తోంది. వడ్డీలపై అప్పులు ఇస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. ఆంక్షల కారణంగా పర్మిట్లను తమ దగ్గర పెట్టుకొని అక్రమ దందాలకు పాల్పడుతున్న ఫైనాన్షియర్లు ఆటోల ధరలను భారీగా పెంచేస్తున్నారు. దీంతో ఆటోడ్రైవర్లు పర్మిట్ల కోసం చెల్లించే రూ.లక్షా 10 వేలతో పాటు, వడ్డీ రూపంలో కనీసం మరో రూ.50 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఒక వేళ సకాలంలో చెల్లించలేకపోతే తిరిగి డిఫాల్టర్లుగా మారి ఆటోలను కోల్పోవాల్సి వస్తోంది. అలా స్వాధీనం చేసుకున్న ఆటోలను మరొకరికి విక్రయిస్తున్నారు. ఒక చట్రంలా సాగుతున్న ఈ సుడిగుండంలో ఆటోడ్రైవర్లే సమిధలుగా మారుతున్నారు. ఆర్టీఏ ప్రేక్షక పాత్రకు పరిమితం.. ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం పన్నుల భారాన్ని తొలగించింది. పర్మిట్లపై ఆంక్షలను సడలిస్తూ కొత్తవి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. అయినా ఫైనాన్షియర్ల కబంధ హస్తాల నుంచి ఆటోడ్రైవర్లకు విముక్తి కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది. వందలాది మంది ఫైనాన్షియర్లు కేవలం నామమాత్రపు పత్రాలపైన చేసుకున్న ఒప్పందాలనే ప్రామాణికంగా భావించి ఆర్టీఏ అధికారులు వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతులిచ్చేస్తున్నారు. ఆటోడ్రైవర్‌కు, ఫైనాన్షియర్‌కు మధ్య రుణ ఒప్పందాన్ని (హైపతికేషన్) ధృవీకరిస్తున్నారు. అయితే ఫైనాన్షియర్ చట్టబద్దతను, ప్రామాణికతను ఆర్టీఏ అధికారులు ఎక్కడా పరిగణనలోకి తీసుకోకపోవడంతో కోట్లాది రూపాయాల అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. ఆటోడ్రైవర్లపై సాగుతున్న ఈ దారుణ దోపిడీలో ఆర్టీఏ ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. -
ఆటో పర్మిట్ స్కాం: మంత్రి రాజీనామా చేయాల్సిందే!
ఆటోల పర్మిట్ స్కాంకు బాధ్యత వహించి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ రాజీనామా చేయాల్సిందేనని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ స్కాంలో భాగస్వామేనని, దీనిపై తమ పార్టీ సోమవారం ఢిల్లీ సచివాలయం వద్ద ధర్నా చేస్తుందని చెప్పారు. మరోవైపు స్కాం ఆరోపణలతో.. ఢిల్లీలో ఇంతకు ముందు ఇచ్చిన 932 ఆటోల పర్మిట్లను రద్దు చేస్తున్నామని, మూడింటిని సస్పెండ్ చేస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం సాయంత్రం ప్రకటించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, తమకు ఇన్నాళ్లూ అతిపెద్ద మద్దతుదారులుగా ఉన్న ఆటో డ్రైవర్లను కూడా మోసం చేస్తున్నారని సతీష్ ఉపాధ్యాయ ఆరోపించారు. ఇంతకుముందు రవాణాశాఖలో మధ్యదళారుల కారణంగా అవినీతి జరిగేదని, కానీ ఇప్పుడు ఆప్ వలంటీర్లు, ఎమ్మెల్యేలే ఆ పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కేసును ఏసీబీకి అప్పగించాలని, రవాణాశాఖ నుంచి నివేదిక తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను బీజేపీ కోరింది. పదివేల ఆటోలకు కొత్తగా పర్మిట్లు ఇస్తామని సీఎం ప్రకటించడంతో 17వేల దరఖాస్తులు వచ్చాయని, అక్కడే అవినీతి మొదలైందని సతీష్ ఉపాధ్యాయ అన్నారు.