ఆటోమేషన్ వినియోగంలో భారత్ నం-1
న్యూఢిల్లీ : ఆటోమేషన్ వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. భారత్‌లోని దాదాపు 83 శాతం కంపెనీలు ఆటోమేషన్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయని అడ్వైజరీ సంస్థ గ్రాంట్ తోర్న్టన్ తన ఇంటర్నేషనల్ బిజినెస్ నివేదికలో పేర్కొంది. తక్కువ నిర్వహణ వ్యయాలు, అధిక కచ్చితత్వం, ఉత్పత్తికి అనుగుణంగా ఉండటం తదితర కారణాల వల్ల భారతీయ కంపెనీలు ఆటోమేషన్ వైపు మొగ్గు చూపుతున్నాయని తెలిపింది. ఆటోమేషన్ వినియోగంలో భారత్ తర్వాతి స్థానాల్లో మెక్సికో, ఐర్లాండ్ ఉన్నాయి. చైనాలోని 59 శాతం కంపెనీలు ఆటోమేషన్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయి.
ఆటోమేషన్ దాదాపు 5 శాతం ఉద్యోగ సిబ్బందిని భర్తీ చేస్తుందని సర్వేలో పాల్గొన్న 43% తయారీ రంగ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన 9 శాతం కంపెనీలు 5 శాతానికి ఎక్కువగానే సిబ్బందిని భర్తీ చేస్తుందని పేర్కొన్నాయి.