Awaaz-e-Punjab
-
సిద్ధూ సంచలన నిర్ణయం
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆవాజ్-ఏ-పంజాబ్ వ్యవస్థాపకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు. తమది రాజకీయ పార్టీ కాదని, ఓపెన్ ఫ్రంట్ మాత్రమే అని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పంజాబ్ ను మెరుగు పరిచేందుకు తమ ఫ్రంట్ లో చేరాలని పార్టీలను ఆయన ఆహ్వానించారు. ఆవాజ్-ఏ-పంజాబ్ తో ఆమ్ ఆద్మీ పార్టీ సంప్రదింపులు జరుపుతోందని ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో సిద్ధూ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడన్న ఉద్దేశంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సిద్ధూ వెల్లడించారు. తాము పోటీకి దిగితే అధికార అకాలీదళ్ ప్రభుత్వం లాభపడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే కనీసం రెండేళ్లు పడుతుందని, మూడు నెలలు చాలా తక్కువ సమయమని పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికల్లో తనను పోటీ చేయొద్దని ఢిల్లీ సీఎం కోరారని చెప్పారు. ఆప్ అధికారంలోకి వస్తే తన భార్య నవజ్యోత్ కౌర్ కు మంత్రి పదవి ఇస్తామని ఆశ పెట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని వచ్చిన ఆహ్వానాన్ని కూడా తిరస్కరించినట్టు చెప్పారు. -
బీజేపీ సభ్యత్వానికి సిద్ధూ రాజీనామా..!
-
బీజేపీ సభ్యత్వానికి సిద్ధూ రాజీనామా..!
న్యూఢిల్లీః గత రెండు నెలలుగా నలుగుతున్నవివాదానికి నేటితో తెర పడింది. బీజేపీ తరపున రాజ్యసభకు నామినేట్ అయిన నవజోత్ సింగ్ సిద్ధు ఎట్టకేలకు బీజేపీ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. జూలైలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారంటూ వచ్చిన వార్తలకు స్వస్తి పలుకుతూ.. వారం క్రితం సొంతగా ఆవాజ్-ఇ-పంజాబ్ పార్టీ స్థాపించనున్నట్లు వెల్లడించిన విషయం విదితమే. రాజకీయ నాయకుడుగా మారిన క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు బుధవారం ఢిల్లీలో తన బీజేపీ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేసినట్లు ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధు ఛత్తీస్ గఢ్ లో వెల్లడించారు. పంజాబ్ అసెంబ్లీ సభ్యురాలుగా కొనసాగుతున్న ఆమె.. సిద్ధు పార్టీ స్థాపన అనంతరం తానూ బీజేపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. 52 ఏళ్ళ నవజోత్ సింగ్ సిద్ధు గతవారం తాను కొత్త పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించిన సందర్భంలో.. ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు చేశారు. అన్నదానికల్లా తల ఊపేవారికే కేజ్రీవాల్ తన పార్టీలో చోటిస్తారన్నారు. అంతేకాక తనను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లో పోటీ చేయద్దని ఆయన కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం స్థాపించనున్న తన కొత్త పార్టీకి పంజాబ్ లో సిద్ధూనే ముఖ్యమంత్రి అభ్యర్థి కానుండటంతోపాటు.. తనతో కలసి నడిచేవారికి ఆహ్వానం కూడా పలుకుతున్నారు. ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీనే కాక, కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ అమరిందర్ సింగ్ కూడా తమ పార్టీలోకి రమ్మంటూ అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. 12 ఏళ్ళపాటు బీజేపీలో కొనసాగిన సిద్ధూ.. జూలై నెల్లో రాజ్యసభ నామినేటెడ్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతోపాటు బీజేపీకి నోటీసులు అందించారు. 2014 పార్లమెంటరీ ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అభ్యంతరం తెలిపిన అనంతరం.. సిద్ధూ పార్టీలో అన్యమనస్కంగానే కొనసాగుతున్నారు. అయితే బీజేపీ సభ్యులు మాత్రం సిద్ధూ నిర్ణయం పార్టీకి వెన్నుపోటు చర్యగా అభివర్ణిస్తున్నారు. -
పంజాబ్ అభ్యున్నతి కోసం పార్టీ
-
పంజాబ్ అభ్యున్నతి కోసం పార్టీ
♦ ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీని లాంఛనంగా ♦ ప్రకటించిన మాజీ క్రికెటర్ సిద్ధూ ♦ కేజ్రీవాల్ అర్ధ సత్యాలు చెపుతున్నారు ♦ కొద్ది రోజుల్లో భవిష్యత్ ప్రణాళిక వెల్లడిస్తామని వెల్లడి చండీగఢ్: పంజాబ్ అభ్యున్నతి కోసమే ఆవాజ్-ఏ-పంజాబ్ రాజకీయేతర పార్టీని స్థాపించినట్టు ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ప్రకటించారు. గురువారం చండీగఢ్‌లో కొత్త పార్టీని సిద్ధూ లాంఛనంగా ప్రకటించారు. ప్రజాస్వామ్య అధికారాన్ని ప్రజల చేతికి అందించడం కోసమే కొత్త పార్టీ స్థాపించినట్టు సిద్ధూ చెప్పారు. రానున్న 15-20 రోజుల్లో తన పార్టీ భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు సందర్భంగా అకాలీదళ్-బీజేపీ కూటమి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు సిద్ధూ. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రజాస్వామ్యం పేరుతో అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ అర్ధ సత్యాలు చెపుతున్నారని ఆరోపించారు. తాను ఒక్కడే నిజాయతీపరుడని, మిగతా వారంతా అవినీతిపరులని కేజ్రీవాల్ భావిస్తారని, అది తన కాపీరైట్‌గా అనుకుంటారని చెప్పారు. పంజాబ్‌పై కారు మేఘాలు.. అధికారంలో ఉన్న బాదల్ కుటుంబం.. పంజాబ్, ప్రజలపై కారు మేఘాలు(కాలా బాదల్) కమ్మేలా చేసిందన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేది తమ కోసమని, బాదల్ కుటుంబం కోసం కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్, అకాలీదళ్ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని, ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతూ పంజాబ్‌ను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు దేశానికి ధాన్యాగారంగా ఉన్న పంజాబ్, ఇప్పుడు బిక్షపాత్రగా మారిందంటే దానికి పంజాబ్‌లోని రాజకీయ వ్యవస్థే కారణమన్నారు.