Ayush medical
-
అనంతగిరిలో ఆయూష్ కేంద్రం
సాక్షి, వికారాబాద్: తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి కొండపై ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఆయూష్ రాష్ట్ర కమిషనర్ అలుగు వర్షిణిలు తెలిపారు. బుధవారం వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతగిరిలో ఉన్న టీబీ ఆస్పత్రిని, వార్డులను తదితర భవనాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతగిరిలో టీబీ ఆస్పత్రితో పాటు ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో టీబీ ఆస్పత్రి మరమ్మతులకు విడుదలైన నిధులను సక్రమంగా ఉపయోగించలేదన్నారు. ఆయూష్ ఆరోగ్య కేంద్రానికి అవసరమైన భవన నిర్మాణాలకు, మరమ్మతులకు విడుదలైన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామన్నారు. ఇపుడు ఆయూష్ హాస్పిటల్ ప్రారంభించేందుకు రూ.6కోట్ల ని«ధులు మంజూరయ్యాయని విడతల వారీగా ఆయూష్ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆయూష్ రాష్ట్ర కమిషనర్ అలుగు వర్షిణి మాట్లాడుతూ... దశాబ్దాలకు ముందే ఇక్కడ టీబీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారని, ప్రస్తుతం టీబీ రోగులు బాగా తగ్గారని వారి కోసం ప్రత్యేకంగా ఆస్పత్రి కొనసాగుతుందని కొత్తగా ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఇక్కడ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక్కడ అవసరమైన భవనాలు, సిబ్బంది, మౌలిక వసతులు అన్నింటిని త్వరలోనే సమకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ ఆస్పత్రి సూపరిటెండెంట్ సుధాకర్‌షించే, టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి పరిసరాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, ఆయూష్ కమిషనర్ అలుగు వర్షిణి -
‘ఆయుష్’ పోయరూ..!
► జిల్లా ప్రజలకు అందని వైద్యసేవలు ► మూడేళ్లుగా కొత్త భవనానికి అడ్డంకులు ► 12 ఎకరాలు అవసరం స్పందించని అధికారులు కరీంనగర్‌హెల్త్ : ఆయుష్ వైద్యసేవలకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్న ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. ఆయుష్ ఆస్పత్రులను బలోపేతం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కరీంనగర్‌లోని ఆయుష్కు సొంతభవనం ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయుష్ అధికారులు, ఆ శాఖ కమిషనర్ కొత్త భవనం నిర్మించాలనే సంకల్పంతో ఉన్నా జిల్లా అధికారులు స్పందించడం లేదు. అన్నీ అడ్డంకులే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధనాస్పత్రి ఆవరణలో 2012, జూన్ 18న (ఆయుర్వేద, హోమియో సంయుక్తంగా) ఆయుష్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆయుర్వేద, హోమియో, యునానీ కేంద్రాలు వేర్వేరుగా సేవలందిచేవి. వీటితో నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఒక్కో కేంద్రానికి 10 పడకలతో ఆయుష్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఒక్కో కేంద్రానికి రూ.10లక్షలతోపాటు ఫర్నీచర్ మంజూరు చేసింది. భవన నిర్మాణానికి నిధులు సరిపోవని ప్రస్తుతం నిర్వహిస్తున్న వాటిలో ఏర్పాటు చేయడం కుదరదని అధికారులు చెప్పడంతో నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని అప్పటి కలెక్టర్ స్మితాసబర్వాల్ ప్రత్యేక చొరవ చూపి ఆయుష్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆస్పత్రి ఆవరణలోని స్టాఫ్ క్వార్టర్స్‌ను ఆధునికీకరించి కేటారుుంచారు. ఆయుష్ సేవలు ప్రారంభమైన పది నెలలకే దాన్ని కూల్చి వేశారు. అక్కడ 150 పడ కల మెటర్నిటీ అండ్ చైల్డ్ ఆస్పత్రి నిర్మిస్తున్నారు. మూడేళ్లుగా ఆయుర్వేద ఆస్పత్రి పక్కన గల రెండు గదుల్లో ఆయుష్ సేవలు అందిస్తున్నారు. పన్నెండెకరాలు అవసరం ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు 12 ఎకరాల స్థలాన్ని కేటారుుంచాలని 2015, నవంబర్ 30న ఎంపీ వినోద్‌కుమార్ జిల్లా అధికారులకు లేఖ రాశారు. అరుుతే.. అధికారులు ఇంకా భూమి గుర్తించడంలోనే ఉన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి నగరంలో స్థలం లేకపోతే చింతకుంట వంటి ప్రాంతాల్లో కేటాయించడం మంచిదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రి నిర్మాణంతోపాటు ఆ స్థలంలో వైద్య సేవలకు అవసరమైన మందులు తయారు చేసుకునేందుకు బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్నీ వసతులు ఉంటే మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేసుకోవచ్చనే అభిప్రాయం వస్తుంది. స్థలంపై కసరత్తు కరీంనగర్ మండలం చింతకుంటలోని మూడెకరాలు ఆయుష్ ఆస్పత్రికి కేటారుుంచాలని గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆదేశాల జారీ చేశారు. ఆ పని పూర్తికావస్తున్న సమయంలో ఆయన బదిలీ అయ్యూరు. దీంతో పనులు అక్కడికక్కడే నిలిచిపోయూరుు. ఇటీవల ఆయుష్కు స్థలం కేటాయించాలని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ కలెక్టర్‌కు పలుసార్లు ఉత్తరం రాసినా పట్టించుకోలేరు. సప్తగిరికాలనీలోని కస్తూరిబా పాఠశాల సమీపంలోని మూడు గుంటల స్థలం ఇస్తామన్నారు. అది నగరపాలక సంస్థలో తీర్మానానికి నోచుకోలేదు. తర్వాత రాంనగర్‌లోని రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన ఎకరంలో 3 గదులు ఇస్తామని ముందుకొచ్చారు. కానీ అవసరమున్నప్పుడు ఖాళీ చేయూలని నిబంధన పెట్టడంతో ముందుకుసాగడం లేదు.