కోటి రూపాయల స్కాలర్షిప్
కాన్పూర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో కాన్పూర్ ఐఐటి విద్యార్థికి చోటు లభించింది. ఎంఐటీలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించేందుకు కాన్పూర్‌కి చెందిన ఓ 17 ఏళ్ల విద్యార్థి టోఫెల్ ప్రవేశపరీక్ష లోఅగ్రగణ్యుడిగా నిలిచి కోటి రూపాయల ఉపకారవేతనాన్ని గెలుచుకున్నాడు. కాన్పూర్ కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్నఆయూష్ శర్మ ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఎంఐటీ లో సీటు సంపాదించడం తన కల అనీ, దేశనుంచి సెలక్టైన ముగ్గురిలో ఒకడిగా ఉండటం సంతోషంగా ఉందంటున్నాడు ఆయుష్.
కాగా ఆయుష్ శర్మ తండ్రి ప్రజా పనుల విభాగంలో ఓ మెకానిక్ గా పనిచేస్తుండగా తల్లి సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పదవీ విరమణ చేశారు.