Ayushman
-
‘ఆయుష్మాన్ భారత్’ ప్రీమియం ఎంతంటే..?
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (ఎన్‌హెచ్‌పీఎస్) కింద బీమా కోసం ఒక్కో కుటుంబానికి ప్రీమియం రూ.900 నుంచి రూ.1,000 వరకు ఉండొచ్చని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాలు 6:4 నిష్పత్తిలో భరిస్తాయి. 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల విలువైన ఆరోగ్య బీమాను ఉచితంగా అందజేస్తామని కేంద్రం ఇటీవల తన బడ్జెట్లో పేర్కొనడం తెలిసిందే. దీనిపై మంగళవారం నిర్వహించిన సమావేశానికి త్రిపుర మినహా (ఎన్నికలు జరుగుతుండటంతో) అన్ని రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారని నీతి ఆయోగ్ అధికారి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినట్టప్పుడు ప్రకటించారు. దీని కోసం రూ. 12 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ పథకాన్ని ‘మోదీ కేర్’గా సమాచార మాధ్యమాలు పేర్కొంటున్నాయి. -
ఆ హీరో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాకు ఇప్పుడు మంచి మిత్రుడు దొరికాడన్న సంతోషంలో తేలిపోతోంది. 'మేరీ ప్యారీ బిందు' చిత్రంలో తన కో స్టార్ అయుష్మాన్ తనకు చాలా దగ్గరి మిత్రుడుగా మారిపోయాడని పరిణీతి తెలిపింది. ఈ 'దమ్ లగాకే హైసా' హీరో ఇటీవల.. పరిణీతి చాలా చక్కగా పాడుతుందని, ఆమె సింగింగ్ను ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చని పొగడ్తలతో ముంచెత్తాడు. దీనిపై పరిణీతి స్పందిస్తూ.. 'అతడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను పాడటం ఎప్పుడు విన్నా సరే అతడు సింగింగ్ను ప్రొఫెషనల్‌గా తీసుకోమంటూ చెబుతుంటాడు. అతడు కూడా గొప్ప గాయకుడు. నేను పాడుతుంటే తాను నాతో పాటు జాయిన్ అవుతాడు. నేను ఎంతలా పాడినా.. నా పాటలకు అడ్డు చెప్పకుండా వినే కో స్టార్ నాకు దొరికాడు' అంటూ ఆయుష్మాన్‌తో తన ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకొచ్చింది. -
అప్పుడు దగ్గరున్నవి రూ.10 వేలే!
న్యూఢిల్లీ: దేశవిదేశాల్లో శుక్రవారమే విడుదలైన బేవకూఫియాలో దివాళా తీసిన యువకుడిగా నటించిన ఆయుష్మాన్ ఖురానా ఒకప్పుడు నిజజీవితంలోనూ చాలా పాట్లు పడ్డాడ ట. పెళ్లి సమయంలో తన దగ్గర ఉన్నవి రూ.10 వేలు మాత్రమేనంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. టీవీలు, సినిమాల్లో కాసిన్ని అవకాశాలు సంపాదించుకోవడంతో పరిస్థితి బాగుపడిందని చెప్పాడు. ‘బేవకూఫియా హీరో మోహిత్ చద్దాలా నేను కెరీర్లో పెద్దగా ఇబ్బందులు ఎదర్కోలేదు. ఆర్థిక సమస్యలు మాత్రం ఉం డేవి. మోహిత్‌కు అన్ని పరాజయాలే ఎదురైనా ఎంతమాత్రమూ నిరాశ చెం దడు. నాకు పెళ్లవుతున్నప్పుడు నా బ్యాంకు ఖాతాలో ఉన్నవి రూ.10 వేలు మాత్రమే. ఉద్యోగం మాత్రం ఉండేది’ అని ఆయుష్మాన్ వివరించాడు. బాల్య స్నేహితురాలు తహీరానే ఈ 29 ఏళ్ల నటుడు పెళ్లాడాడు. సోనమ్ కపూర్, రిషీ కపూర్ బేవకూఫియాలో ముఖ్యపాత్రధారులు. ఆర్థికమాంద్యం నేపథ్యంగా సాగే ప్రేమకథ ఇది. విభిన్నమైన హాస్యచిత్రం కాబట్టి సినిమాకు మంచి స్పందన వచ్చిందని, మాంద్యం వల్ల ఇప్పటికీ ఉద్యోగులు ఇబ్బందు లు పడుతున్నారని ఇతడు అన్నాడు. తహీరాకు ఈ సినిమా చూపించావా.. అంటే శుక్రవారం సాయంత్రం చండీగఢ్ వెళ్లా క ఇద్దరం కలిసి చూస్తామని చెప్పాడు. సోనమ్‌తో జోడీ గురించి మాట్లాడుతూ ‘ఎప్పుడూ ఫ్యాషన్‌ను అనుసరించే సోనమ్‌తో జోడీ కట్టడంపై మొదట్లో కాస్త సంకోచించాను. ఎందుకంటే నేను పక్కింటి అబ్బాయిలా ఉంటాను. అయితే మేమిద్దరం కలుసుకున్న తరువాత ఆమె ఎంత మంచిదో తెలి సింది. అందుకే తెరపై ఇద్దరి జోడీ బాగా కుదిరింది’ అని ఆయుష్మాన్ అన్నాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ తీస్తున్న దమ్ లగా కే హైషాలోనూ ఇతనికి చాన్స్ దక్కింది. బంబాయ్ ఫెయిరీటేల్ అనే సినిమాలోనూ శివ్‌కర్ బాపూజీ తల్పడేగా కనిపిస్తాడు. ఈ పాత్ర కోసం మరాఠీ నేర్చుకుంటున్నానని ఆయుష్మాన్ ఖురానా చెప్పాడు. అన్నట్టు.. మనోడి మొదటి సినిమా వికీ డోన్ బాక్సాఫీసు సొమ్ములు బాగానే వసూలు చేసింది.