అప్పుడు దగ్గరున్నవి రూ.10 వేలే!
న్యూఢిల్లీ: దేశవిదేశాల్లో శుక్రవారమే విడుదలైన బేవకూఫియాలో దివాళా తీసిన యువకుడిగా నటించిన ఆయుష్మాన్ ఖురానా ఒకప్పుడు నిజజీవితంలోనూ చాలా పాట్లు పడ్డాడ ట. పెళ్లి సమయంలో తన దగ్గర ఉన్నవి రూ.10 వేలు మాత్రమేనంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. టీవీలు, సినిమాల్లో కాసిన్ని అవకాశాలు సంపాదించుకోవడంతో పరిస్థితి బాగుపడిందని చెప్పాడు.
‘బేవకూఫియా హీరో మోహిత్ చద్దాలా నేను కెరీర్‌లో పెద్దగా ఇబ్బందులు ఎదర్కోలేదు. ఆర్థిక సమస్యలు మాత్రం ఉం డేవి. మోహిత్‌కు అన్ని పరాజయాలే ఎదురైనా ఎంతమాత్రమూ నిరాశ చెం దడు. నాకు పెళ్లవుతున్నప్పుడు నా బ్యాంకు ఖాతాలో ఉన్నవి రూ.10 వేలు మాత్రమే. ఉద్యోగం మాత్రం ఉండేది’ అని ఆయుష్మాన్ వివరించాడు. బాల్య స్నేహితురాలు తహీరానే ఈ 29 ఏళ్ల నటుడు పెళ్లాడాడు. సోనమ్ కపూర్, రిషీ కపూర్ బేవకూఫియాలో ముఖ్యపాత్రధారులు.
ఆర్థికమాంద్యం నేపథ్యంగా సాగే ప్రేమకథ ఇది. విభిన్నమైన హాస్యచిత్రం కాబట్టి సినిమాకు మంచి స్పందన వచ్చిందని, మాంద్యం వల్ల ఇప్పటికీ ఉద్యోగులు ఇబ్బందు లు పడుతున్నారని ఇతడు అన్నాడు. తహీరాకు ఈ సినిమా చూపించావా.. అంటే శుక్రవారం సాయంత్రం చండీగఢ్ వెళ్లా క ఇద్దరం కలిసి చూస్తామని చెప్పాడు. సోనమ్‌తో జోడీ గురించి మాట్లాడుతూ ‘ఎప్పుడూ ఫ్యాషన్‌ను అనుసరించే సోనమ్‌తో జోడీ కట్టడంపై మొదట్లో కాస్త సంకోచించాను. ఎందుకంటే నేను పక్కింటి అబ్బాయిలా ఉంటాను. అయితే మేమిద్దరం కలుసుకున్న తరువాత ఆమె ఎంత మంచిదో తెలి సింది.
అందుకే తెరపై ఇద్దరి జోడీ బాగా కుదిరింది’ అని ఆయుష్మాన్ అన్నాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ తీస్తున్న దమ్ లగా కే హైషాలోనూ ఇతనికి చాన్స్ దక్కింది. బంబాయ్ ఫెయిరీటేల్ అనే సినిమాలోనూ శివ్‌కర్ బాపూజీ తల్పడేగా కనిపిస్తాడు. ఈ పాత్ర కోసం మరాఠీ నేర్చుకుంటున్నానని ఆయుష్మాన్ ఖురానా చెప్పాడు. అన్నట్టు.. మనోడి మొదటి సినిమా వికీ డోన్ బాక్సాఫీసు సొమ్ములు బాగానే వసూలు చేసింది.