ayyappa darshanam
-
శబరిమల భక్తులకు ‘స్వామి చాట్‌బాట్’
శబరిమల దర్శనం కోసం వెళ్లే అయ్యప్ప భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భక్తులకు సమగ్ర సమాచారం అందించేలా టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అందులో భాగంగా శబరిమల దర్శనార్థం వెళ్లేవారికి ‘స్వామి చాట్‌బాట్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేరళలోని పథనంథిట్ట జిల్లా అధికారులు తెలిపారు.ముత్తూట్ గ్రూప్‌తో కలిసి జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఏఐ డిజిటల్ అసిస్టెంట్ ‘స్వామి’ అనే చాట్‌బాట్‌ను ప్రారంభించారు. శబరిమలకు రాకపోకలు సాగించే భక్తులు తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. వారికి పూర్తి భద్రత అందించేందుకు దీన్ని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?రోజులవారీగా ఆలయ దర్శన సమయం, ప్రసాదం, పూజ సమయాలు వంటి సమాచారాన్ని ఇందులో తెలుసుకోవచ్చు. ఈ చాట్‌బాట్‌ను ఇంగ్లిష్, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సిద్ధం చేశారు. శబరిమల దగ్గర్లోని చూడదగిన దేవాలయాల వివరాలు కూడా అందులో ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. -
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. మకరజ్యోతి దర్శనంపై కీలక నిర్ణయం
తిరువనంతపురం: కేరళలోని శబరిమల దర్శనానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. వివరాల ప్రకారం.. శబరిమలలో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. పంబా నుంచి శబరి పీఠం వరకు భక్తులు కిక్కిరిసిపోయారు. దీంతో, గంటల తరబడి భక్తులు క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు.. భక్తుల రద్దీ విషయంలో దేవస్థానం ట్రస్ట్(ట్రావెన్కోర్ దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతి సందర్శనం రోజున దర్శనాలపై కొత్త నిబంధనలను విధించింది. మకరజ్యోతి వీక్షణం కోసం 50వేల మందికే అనుమతి ఇస్తామని ట్రస్ట్ పేర్కొంది. మకరజ్యోతి దర్శనానికి మహిళలు, పిల్లలు రావొద్దని అలర్ట్ చేసింది. అలాగే, ఈనెల 14వ తేదీన 40వేల మందికి, 15వ తేదీన 50వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్టు ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రెండు రోజుల్లో ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికే దర్శనం అని స్పష్టం చేసింది. சபரிமலை செல்வோர் கவனத்திற்கு.. திடீரென வந்த அறிவிப்பு - ''இதை மீறினால்..' எச்சரிக்கை.. #NewsTamil24x7 | #sabarimala | #kerala | #sabarimalai | #viralvideo | #sabarimalatemple pic.twitter.com/AFxlvutGRr — News Tamil 24x7 | நியூஸ் தமிழ் 24x7 (@NewsTamilTV24x7) January 4, 2024 ఇక ఈసారి శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. నవంబర్ 17 వ తేదీ నుంచి డిసెంబరు 27 వ తేదీ వరకూ 40 రోజుల్లోనే దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. దీంతో ఏకంగా రూ.241 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే గతేడాది కంటే రూ.18.72 కోట్లు అధికంగా వచ్చినట్లు పేర్కొన్నాయి. @CMOKerala @TheKeralaPolice @BJP4Keralam In Sabarimala Devasthanam this time the crowd has gathered in large numbers and no proper action has been taken for that most of the devotees have faced great hardship as there is no toilet. Action should be taken #Kerala #sabarimalai pic.twitter.com/hBUYcK7DL3 — தயா (Social Worker) (@PresidencyDhaya) January 3, 2024 -
కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారిగా శబరిమల..
సూర్యపేట: కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్‌జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జండర్లు చాలా మంది అయప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది. తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమని.. తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని పేర్కొంది. ఇవి చదవండి: New year 2024: సరి ‘కొత్తగా’ సాగుదాం! -
Sabarimala: 90వేల మందికి మాత్రమే దర్శనం!
తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం లక్ష మందికిపైగానే తరలివస్తున్నారు. అయ్యప్ప దర్శనానికి దాదాపు 12 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది. దర్శనం కోసం సోమవారం ఒక్కరోజే 1,19,480 మంది ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులతో కలిసి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శబరిమలలో భక్తుల రాక, దర్శనం ఏర్పాట్లపై చర్చించారు. పార్కింగ్ సదుపాయాలు పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీగా తరలివస్తున్న భక్తులను నియంత్రించడం కష్టతరంగా మారడంతో వారి సంఖ్యపై పరిమితి విధించాలని, ప్రతిరోజూ గరిష్టంగా 90,000 మందిని మాత్రమే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే దర్శన సమయాన్ని మరో గంటపాటు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో.. భక్తుల రద్దీ నియంత్రణకు సంబంధించి కేరళ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై న్యాయస్థానం ఆదివారం సమావేశమై, విచారణ చేపట్టింది. రద్దీని నియంత్రించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని పత్తనంతిట్ట జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించింది. నిత్యం 75,000 మందికిపైగా భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో భక్తుల సంఖ్యను 90,000కు పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుఝాము నుంచే.. అయ్యప్ప స్వామిని నిత్యం 90,000 మంది సులువుగా దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు ట్రావెన్కోర్ దేవాస్వోమ్ బోర్డ్(టీడీబీ) చైర్మన్ కె.అనంతగోపన్ చెప్పారు. దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు స్వామిని భక్తులు దర్శించుకోవచ్చని చెప్పారు. ఇదిలా ఉండగా, శబరి దేవస్థానంలో నవంబర్ 17న ప్రారంభమైన 41 రోజుల మండల పూజ ఈ నెల 27న ముగియనుంది. అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిళక్కు యాత్ర కోసం ఈ నెల 30న ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు. 2023 జనవరి 14న మకర జ్యోతి దర్శనంతో మకరవిళక్కు యాత్ర ముగుస్తుంది. పూజలు పూర్తయ్యాక జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు. -
ఆత్మ సంతృప్తి కలిగించింది
‘‘నెల రోజుల వ్యవధిలో మా సంస్థ నుంచి రెండు సినిమాలు విడుదలయ్యాయి. గత నెల ‘ఒక రోజు ఏం జరిగింది’, ఇటీవల ‘అయ్యప్ప దర్శనం’ విడుదల చేశాం. రెండూ చిన్న చిత్రాలే అయినప్పటికీ మంచి ఆదరణ లభించింది’’ అని నిర్మాత తడకల రాజేశ్ చెప్పారు. వీటిలో ‘ఒక రోజు ఏం జరిగింది’కి ఆయనే దర్శకుడు. చిత్రపరిశ్రమకు వచ్చి పదేళ్లయ్యిందనీ, వేట, ఉడుతా ఉడుతా ఊచ్.. ఇలా పలు చిత్రాలు నిర్మించాననీ రాజేశ్ అన్నారు. ముఖ్యంగా ‘అయ్యప్ప దర్శనం’ నిర్మించడం ఆత్మసంతృప్తి కలిగించిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు చిన్న చిత్రాల ద్వారా సాధించిన అనుభవంతో, ఇప్పుడు మీడియం బడ్జెట్ చిత్రం నిర్మించబోతున్నానని చెప్పారు. ఈ చిత్రానికి కథ సిద్ధమైందనీ, ఓ ప్రముఖ హీరో ఇందులో నటిస్తారని రాజేశ్ అన్నారు. వచ్చే నెల ఈ చిత్రాన్ని ప్రారంభిస్తానని రాజేశ్ తెలిపారు.