డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఎల్లారెడ్డి (నిజామాబాద్) : కడుపు నొప్పి భరించలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామంలో శనివారం జరిగింది. ఆజామాబాద్ గ్రామానికి చెందిన షాబాజ్ ఖాన్(20) డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.
కాగా శనివారం కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.