b. Premlal
-
వడదెబ్బ విపత్తు కాదా?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి లో గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బతో ఇప్పటికే తెలంగాణలో వందలమంది చనిపోయారు. ఇంతమంది చనిపోయినప్పటికీ వడదెబ్బను విపత్తుగా పరిగణించలేమని 14వ ఆర్థిక సంఘం పేర్కొనడం సమంజసం కాదు. గత కొన్నేళ్లుగా వడదెబ్బను విపత్తుగా గుర్తించా లని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆర్థిక సంఘం పట్టించుకోవటం లేదు. కేంద్ర ప్రభుత్వాలు ఉత్తరాది రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలపై మాత్రం పలు సంవత్సరాలుగా పక్షపాత ధోరణితోనే వ్యవ హరిస్తున్నాయి. వాస్తవంగా ఉత్తరభారతదేశంలో చలికాలంలో చలిగాలులు ఎక్కువగా వస్తూ వాటి బారినపడి అనేకమంది చనిపోతుంటారు. ఈ సమస్యను గుర్తించి గత కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. దీంతో 13వ ఆర్థిక సంఘం చలిగాలులను విపత్తుగా పరిగణించడంతో బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల రూపాయల సాయం అందుతుంది. చలిగాలులను విపత్తుగా పరిగణించడంలో రాని సమస్య వడదెబ్బను విపత్తుగా పరిగణిస్తే వస్తుందా? ఇది ముమ్మాటికీ దక్షి ణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయనడానికి ఉదాహ రణ. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం మంత్రుల కమిటీ వేసి వడదెబ్బను విపత్తుగా గుర్తించి, వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలి. వడదెబ్బ నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిచోటా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చల్లటి నీటి పంపిణీ చేసే విధంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. - బి. ప్రేమ్‌లాల్, వినాయక్ నగర్, నిజామాబాద్ -
ఆర్టీసీ అద్దె బస్సులు డేంజర్
పల్లె వెలుగు అద్దె బస్సులు ప్రయాణికుల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల అనేక ప్రాంతాలలో ఆర్టీసీ అద్దె బస్సుల టైర్లు ఊడిపోవడం, చక్రం రాడ్లు విరిగిపోవడం వంటి సంఘ టనలు జరిగాయి. కొన్నిచోట్ల డ్రైవర్ల అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, కొన్నిచోట్ల స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డారు. ముఖ్యంగా అనేక బస్సులు ఫిట్నెస్ లేకుండా, కాలం చెల్లినవి ఉన్నాయి. డిపో అధికారులు, మెకానికల్ సిబ్బంది సరైన తనిఖీ చేయకుండానే బస్సులను డిపోల నుండి వదులు తున్నారు. నిబంధనల ప్రకారం బస్సును డిపోలో క్షుణ్ణంగా ఆయా యంత్రాలను తనిఖీ చేయాలి. చెడిపోయిన భాగాలను మరమ్మతులు చేయాలి. అలాగే దుమ్ము, ధూళితో ఉన్న బస్సులను శుభ్రం చేయాలి. కానీ ఇవేవీ చేయడం లేదు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో భయంతో ప్రయాణిస్తున్నారు. అలాగే దుమ్ము, ధూళి బస్సులలో బాగా ఉండటంతో శ్వాస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం కాలం చెల్లిన బస్సులను నిషేధించాలి. బస్సు కండిషన్ తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతించాలి. అలాగే బస్సులలో పరిశుభ్రతపై దృష్టి సారించాలి. - బి. ప్రేమ్‌లాల్ వినాయక్ నగర్, నిజామాబాద్ -
ఆర్టీసీ ప్రయాణం ప్రాణాంతకం?
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థల తీరు ఒకప్ప టిలాగే అధ్వానంగా సాగుతోంది. ఇటీవల అనంతపూర్ జిల్లాలో జరి గిన ఘోర దుర్ఘటనలో ‘పల్లె వెలుగు’ పలు కుటుంబాల్లో ఎన్నటికీ తొల గని చీకట్లను మిగిల్చింది. కారణాలు పైకి ఏమి చెబుతున్నా ప్రయా ణికుల భద్రతపట్ల అలసత్వం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. రోజు రోజుకూ ప్రమాదాల బారిన పడుతున్న ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరిగి పోతోంది. ఒకప్పుడు సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా ఉండిన ఆర్టీసీ బస్సులు నేడు ప్రాణాంతకాలుగా పరిణమిస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులను, చాలీచాలని సిబ్బందితో నిర్వహిస్తుండటమే ప్రమా దాలకు ప్రధాన కారణం. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల స్థితి మరింత అధ్వానంగా ఉంటోంది. ఆర్టీసీ బస్సులు లోపలా, బయటా కూడా దుమ్ము కొట్టుకుపోయి ఉంటున్నాయి. బస్సు ల్లోని దుమ్ము, మురికి ప్రయాణికులకు పలు అనారోగ్య సమస్యలను కలుగజేస్తున్నాయి. ప్రత్యేకించి అద్దెకు తీసుకుని నడుపుతున్న బస్సుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఇప్పటికైనా పాలకులు వెంటనే కాలంచెల్లిన బస్సులను తొలగించి, ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే డిపో నుంచి బయటకు వెళ్లడా నికి అనుమతించాలి. -బి. ప్రేమ్‌లాల్ వినాయక్‌నగర్, నిజామాబాద్