ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి లో గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బతో ఇప్పటికే తెలంగాణలో వందలమంది చనిపోయారు. ఇంతమంది చనిపోయినప్పటికీ వడదెబ్బను విపత్తుగా పరిగణించలేమని 14వ ఆర్థిక సంఘం పేర్కొనడం సమంజసం కాదు. గత కొన్నేళ్లుగా వడదెబ్బను విపత్తుగా గుర్తించా లని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆర్థిక సంఘం పట్టించుకోవటం లేదు. కేంద్ర ప్రభుత్వాలు ఉత్తరాది రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలపై మాత్రం పలు సంవత్సరాలుగా పక్షపాత ధోరణితోనే వ్యవ హరిస్తున్నాయి. వాస్తవంగా ఉత్తరభారతదేశంలో చలికాలంలో చలిగాలులు ఎక్కువగా వస్తూ వాటి బారినపడి అనేకమంది చనిపోతుంటారు.
ఈ సమస్యను గుర్తించి గత కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. దీంతో 13వ ఆర్థిక సంఘం చలిగాలులను విపత్తుగా పరిగణించడంతో బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల రూపాయల సాయం అందుతుంది. చలిగాలులను విపత్తుగా పరిగణించడంలో రాని సమస్య వడదెబ్బను విపత్తుగా పరిగణిస్తే వస్తుందా? ఇది ముమ్మాటికీ దక్షి ణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయనడానికి ఉదాహ రణ. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం మంత్రుల కమిటీ వేసి వడదెబ్బను విపత్తుగా గుర్తించి, వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలి. వడదెబ్బ నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిచోటా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, చల్లటి నీటి పంపిణీ చేసే విధంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి.
- బి. ప్రేమ్‌లాల్, వినాయక్ నగర్, నిజామాబాద్
వడదెబ్బ విపత్తు కాదా?
Published Fri, May 22 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement
Advertisement