రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థల తీరు ఒకప్ప టిలాగే అధ్వానంగా సాగుతోంది. ఇటీవల అనంతపూర్ జిల్లాలో జరి గిన ఘోర దుర్ఘటనలో ‘పల్లె వెలుగు’ పలు కుటుంబాల్లో ఎన్నటికీ తొల గని చీకట్లను మిగిల్చింది. కారణాలు పైకి ఏమి చెబుతున్నా ప్రయా ణికుల భద్రతపట్ల అలసత్వం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. రోజు రోజుకూ ప్రమాదాల బారిన పడుతున్న ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరిగి పోతోంది. ఒకప్పుడు సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా ఉండిన ఆర్టీసీ బస్సులు నేడు ప్రాణాంతకాలుగా పరిణమిస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులను, చాలీచాలని సిబ్బందితో నిర్వహిస్తుండటమే ప్రమా దాలకు ప్రధాన కారణం. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల స్థితి మరింత అధ్వానంగా ఉంటోంది. ఆర్టీసీ బస్సులు లోపలా, బయటా కూడా దుమ్ము కొట్టుకుపోయి ఉంటున్నాయి. బస్సు ల్లోని దుమ్ము, మురికి ప్రయాణికులకు పలు అనారోగ్య సమస్యలను కలుగజేస్తున్నాయి. ప్రత్యేకించి అద్దెకు తీసుకుని నడుపుతున్న బస్సుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఇప్పటికైనా పాలకులు వెంటనే కాలంచెల్లిన బస్సులను తొలగించి, ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే డిపో నుంచి బయటకు వెళ్లడా నికి అనుమతించాలి.
-బి. ప్రేమ్‌లాల్ వినాయక్‌నగర్, నిజామాబాద్
ఆర్టీసీ ప్రయాణం ప్రాణాంతకం?
Published Tue, Jan 13 2015 1:23 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement