RTC travel
-
ఆర్టీసీ ప్రయాణం ప్రాణాంతకం?
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థల తీరు ఒకప్ప టిలాగే అధ్వానంగా సాగుతోంది. ఇటీవల అనంతపూర్ జిల్లాలో జరి గిన ఘోర దుర్ఘటనలో ‘పల్లె వెలుగు’ పలు కుటుంబాల్లో ఎన్నటికీ తొల గని చీకట్లను మిగిల్చింది. కారణాలు పైకి ఏమి చెబుతున్నా ప్రయా ణికుల భద్రతపట్ల అలసత్వం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. రోజు రోజుకూ ప్రమాదాల బారిన పడుతున్న ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరిగి పోతోంది. ఒకప్పుడు సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా ఉండిన ఆర్టీసీ బస్సులు నేడు ప్రాణాంతకాలుగా పరిణమిస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులను, చాలీచాలని సిబ్బందితో నిర్వహిస్తుండటమే ప్రమా దాలకు ప్రధాన కారణం. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల స్థితి మరింత అధ్వానంగా ఉంటోంది. ఆర్టీసీ బస్సులు లోపలా, బయటా కూడా దుమ్ము కొట్టుకుపోయి ఉంటున్నాయి. బస్సు ల్లోని దుమ్ము, మురికి ప్రయాణికులకు పలు అనారోగ్య సమస్యలను కలుగజేస్తున్నాయి. ప్రత్యేకించి అద్దెకు తీసుకుని నడుపుతున్న బస్సుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఇప్పటికైనా పాలకులు వెంటనే కాలంచెల్లిన బస్సులను తొలగించి, ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే డిపో నుంచి బయటకు వెళ్లడా నికి అనుమతించాలి. -బి. ప్రేమ్‌లాల్ వినాయక్‌నగర్, నిజామాబాద్ -
ఒంగోలు కల నెరవేర్చండి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరానికి సిటీ బస్సుల వ్యవస్థను పరిపుష్టం చేయాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీ జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద తీసుకువస్తున్న బస్సులపై మాట్లాడుతూ ఈ పథకం కింద 162 కోట్లతో బస్సులు తీసుకువస్తే జిల్లాకు ఒక్క బస్సు కూడా కేటాయించకపోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఈ పథకం ఇప్పటికే పూర్తయిందని, ఈ దశలో జిల్లాకు తీసుకువస్తామని చెబుతున్న 40 బస్సులు ఎలా వస్తాయని మంత్రిని నిలదీశారు. ఒంగోలు నగరానికి చిరకాల వాంఛయిన సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించినా మొక్కుబడిగా ఐదు బస్సులను మాత్రమే కేటాయించడంతో అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోనే మద్దిపాడు, నాగులుప్పలపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, టంగుటూరు, కొత్తపట్నం, కొండపి, సింగరాయకొండ వంటి 12 మండల కేంద్రాలున్నాయన్నారు. వీటికి సిటీ బస్సులను ఏర్పాటు చేయాలని సురేష్ డిమాండ్ చేశారు. పల్లెవెలుగులో ఐదు కిలోమీటర్లకు మినిమం ఛార్జి ఉంటే సిటీ సర్వీసుల్లో రెండు కిలోమీటర్లకే మినిమం ఛార్జి వసూలు చేస్తున్నారని, అందువల్ల ఆక్యుపెన్సీ రేషియో కూడా తగ్గుతోందని వివరించారు. ఒంగోలులో మూడు వేల ఆటోలుంటే, బయట నుంచి మరో మూడు వేలు వస్తున్నాయని, ఇందులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. భద్రతపై దృష్టి పెట్టండి : గొట్టిపాటి రవికుమార్ ఆర్టీసీలో భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. 400 కిలోమీటర్ల ప్రయాణం చేసే బస్సుల్లో కూడా డబుల్ డ్రైవర్‌ను ఏర్పాటు చేయని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. డ్రైవర్లకే టిమ్స్ ఇవ్వడం వల్ల వారిపై ఒత్తిడి పెరిగిపోతోందన్నారు. ఒంగోలు డిపోకు చెందిన శ్రీను అనే డ్రైవర్‌కు విశ్రాంతి ఇవ్వకుండా బలవంతంగా మరో డ్యూటీకి పంపించడం వల్ల ఒత్తిడితో హార్ట్ ఎటాక్‌కు గురై అతను చనిపోయాడని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టీసీ ప్రయాణం శుభప్రదం అని చెబుతున్నా కనీసం ఎగ్జిట్ డోర్స్ కూడా పెట్టకుండా అక్కడ సీట్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. మా జిల్లా నుంచి వచ్చిన మంత్రిగారు మాకు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం బస్సులు తీసుకువస్తారని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, అనంతపురంకు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం బస్సులు వచ్చాయని, ప్రకాశం జిల్లాకు మాత్రం రాలేదన్నారు. దీనిపై మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ సిటీ బస్సులను పెంచుతామని, త్వరలో మినీ బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు రావాల్సిన అన్ని బస్సులను త్వరలోనే వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని సభ ద్వారా హామీ ఇచ్చారు. -
ఇక స్మార్ట్‌గా బస్ టికెట్
-
ఇక స్మార్ట్‌గా బస్ టికెట్
స్మార్ట్‌ఫోన్ ద్వారా బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ ప్రారంభించిన ఎండీ పూర్ణచందర్రావు రిజర్వేషన్ కేంద్రాలపై తగ్గనున్న ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: ఇకపై ఆర్టీసీ ప్రయాణం మరింత సులభతరమైంది. జేబులో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు... ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ క్షణాల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు అవసరం లేదు. 30 రోజు ల అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలుకొని, అప్పటికప్పుడు బయలుదేరే బస్సులకూ రిజర్వేషన్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని స్మార్ట్‌ఫోన్‌లోకి తెచ్చే పథకాన్ని ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్రావు సోమవారం బస్‌భవన్‌లో ప్రారంభించారు. దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రయాణికులందరికీ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు ఎండీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ టీఎస్ఆర్టీసీ బస్ డాట్ ఇన్’’ ద్వారా, ఏపీ ప్రయాణికులు ‘‘డ బ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్ డాట్ ఇన్’’ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం తో రిజర్వేషన్, ఏటీబీ కేంద్రాల వద్ద రద్దీ తగ్గే అవకాశముంటుందని అంచనా. ప్రయా ణానికి గంట ముందు కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రతి రోజూ లక్షా 41 వేల టికెట్లు ఆర్టీసీలో ప్రతి రోజూ లక్షా 41 వేల సీట్లు అడ్వాన్స్, కరెంట్ బుకింగ్‌ల ద్వారా నమోదవుతున్నాయి. వీటిలో 45 వేల టికెట్లు ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(ఓపీఆర్ఎస్) ద్వారా భర్తీ అవుతున్నాయి. వీటిలో 13,743 టికెట్లు ఆర్టీసీ బస్స్టేషన్లలోని రిజర్వేషన్ కేంద్రాల ద్వారా, 16,578 టికెట్లు ఏటీబీ ఏజెంట్ల ద్వారా బుక్ అవుతుండగా, ఇంటర్నెట్ ఈ-బుకింగ్ ద్వారా 13,235, ఇతర ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్స్ ద్వారా 1,444 బుక్ అవుతున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను మరింత సులభతరం చేస్తూ స్మార్ట్‌ఫోన్‌లో సైతం అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ బస్సులు నడిచే అన్ని ప్రాంతాలకు ఈ స్మార్ట్‌ఫోన్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.