ఒకేతాటి మీదకు రావడానికి ప్రయత్నిస్తున్నాం: రాఘవులు
గుంటూరు: కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమేనని సీపీఎం నేత రాఘవులు అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలతో పొత్తు కుదుర్చుకునే వారితో రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు చేసుకోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చెరోదారి అనుసరించడంపై ఆయన స్పందించారు.
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒకేతాటి మీదకు వచ్చేందుకు చర్చిస్తున్నామని రాఘవులు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఒంటరి పోరు తప్పనిసరైతే మంగళగిరి నుంచి కచ్చితంగా పోటీపెడతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు ఖరారైన దాదాపు పూర్తి కావోస్తోంది. సమైక్యవాదాన్ని వినిపించిన సీపీఎంతో పొత్తు పెట్టుకోవద్దని సీపీఐ భావిస్తున్న సంగతి తెలిసిందే.