ఒకేతాటి మీదకు రావడానికి ప్రయత్నిస్తున్నాం: రాఘవులు | We are trying to unite, says CPM Leader Raghavulu | Sakshi
Sakshi News home page

ఒకేతాటి మీదకు రావడానికి ప్రయత్నిస్తున్నాం: రాఘవులు

Published Fri, Mar 28 2014 9:23 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

ఒకేతాటి మీదకు రావడానికి ప్రయత్నిస్తున్నాం: రాఘవులు - Sakshi

ఒకేతాటి మీదకు రావడానికి ప్రయత్నిస్తున్నాం: రాఘవులు

గుంటూరు: కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమేనని సీపీఎం నేత రాఘవులు అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలతో పొత్తు కుదుర్చుకునే వారితో రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు చేసుకోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చెరోదారి అనుసరించడంపై ఆయన స్పందించారు. 
 
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒకేతాటి మీదకు వచ్చేందుకు చర్చిస్తున్నామని రాఘవులు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఒంటరి పోరు తప్పనిసరైతే మంగళగిరి నుంచి కచ్చితంగా పోటీపెడతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు ఖరారైన దాదాపు పూర్తి కావోస్తోంది. సమైక్యవాదాన్ని వినిపించిన సీపీఎంతో పొత్తు పెట్టుకోవద్దని సీపీఐ భావిస్తున్న సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement