baahubali-2 movie
-
బాహుబలి చూసిన పెద్దాయన.. మాజీ సీఎం మిస్
రాజకీయాల్లో మునిగి తేలుతున్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.. మంగళవారం నాడు థియేటర్‌కు వెళ్లి బాహుబలి-2 సినిమా చూశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను కొంతమందిని తీసుకెళ్లి, లక్నోలోని ఓ థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన వేయించుకుని మరీ ఆ సినిమాను చూశారు. తన సన్నిహిత సహచరులను మాత్రమే ఆయన ఆ సినిమాకు తీసుకెళ్లారు. వారిలో శివపాల్ యాదవ్‌కు సన్నిహిత అనుచరుడైన అషు మాలిక్, మహ్మద్ షాహిద్ తదితరులున్నారు. మొత్తం థియేటర్ అంతటినీ కేవలం తమ కోసమే ములాయం బుక్ చేయించుకున్నారు. అయితే, ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ములాయం వెంట సినిమా చూసేందుకు యూపీ మాజీ ముఖ్యమంత్రి, ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ మాత్రం వెళ్లలేదు. అలాగే, అఖిలేష్ వర్గానికి చెందినవాళ్లుగా ముద్రపడిన వాళ్లు కూడా ఈ సినిమా చూసిన బృందంలో లేరు. ములాయం వెంట మాత్రం ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా థియేటర్లో ఉన్నారు. -
సెకనుకు 12 టికెట్లు బుక్!
బాహుబలి-2 సినిమా అన్ని రకాల రికార్డులను బద్దలుకొడుతోంది. తాజాగా ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షో కూడా ఈ విషయం ప్రకటించింది. ఇప్పటివరకు తాము దాదాపు 33 లక్షల టికెట్లు అమ్మినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రతి సెకనుకు 12 టికెట్లు బుక్ అవుతున్నాయని, దాంతో ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బాహుబలి మొదటి పార్ట్ కంటే రెండో భాగానికి 350 శాతం ఎక్కువగా అడ్వాన్స్ టికెట్ల అమ్మకాలు జరిగినట్లు ప్రకటించింది. కేవలం దక్షిణ భారతంలోనే కాక, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా టికెట్ల అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గలేదని, దాంతో ఇది భారతీయ సినీ పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తిందని బుక్ మై షోకు చెందిన ఆశిష్ సక్సేనా అన్నారు. విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటిరోజే వందకోట్ల క్లబ్బులో చేరిపోయిందన్నారు. భాషా భేదాల సంకెళ్లను కూడా ఈ సినిమా తెంచుకుందని, సినిమా బాగుంటే ఎక్కడైనా ఎవరైనా చూస్తారన్న విషయం మరోసారి రుజువైందని ఆయన చెప్పారు. -
‘బాహుబలి’ ఐదు షోలకు సుముఖం
సచివాలయంలో మంత్రిని కలిసిన చిత్ర నిర్మాత సాక్షి, హైదరాబాద్: బాహుబలి–2 చిత్రం ఐదు ఆటల ప్రదర్శన కు ప్రభుత్వం సుముఖంగా ఉందని, చారిత్రక నేపథ్యంగల చలన చిత్రాలను తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహి స్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సచివాలయంలో తలసానిని కలిసిన బాహుబలి చిత్ర నిర్మాత ప్రసాద్ దేవినేని...తమ చిత్రాన్ని ఐదు షోలుగా ప్రదర్శించేందుకు అనుమతించాలని కోరారు. మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గతంలో చారిత్రక నేపథ్యంతో నిర్మించిన రుద్రమదేవి, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాల కు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే ఆన్లైన్ టికెటింగ్ విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు. తమ విన్నపానికి సానుకూలంగా స్పందించడంపట్ల మంత్రికి నిర్మాత కృతజ్ఞతలు తెలిపారు. వాహనంపై బుగ్గ తొలగించిన తలసాని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం సచివాలయంలో తన అధికారిక వాహనంపై ఉన్న బుగ్గను స్వచ్ఛందంగా తొలగిం చారు. స్వయంగా కారు వద్దకు వచ్చిన ఆయన దగ్గరుండి బుగ్గను తొలగించారు. -
బాహుబలికి రోజుకు 5 షోలు?
-
బాహుబలి-2కు చంద్రబాబు భారీ బొనాంజా!
బాహుబలి-2 సినిమాకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ బొనాంజా ప్రకటించారు. ఆ సినిమాను ఆరు షోలు ప్రదర్శించుకోడానికి సర్కారు అనుమతించింది. ఉదయం 7 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఆరు షోలు ప్రదర్శించుకోడానికి ఓకే చేశారు. సినిమా విడుదల అయినప్పటి నుంచి పది రోజుల పాటు ఇలా ఆరు షోలు ప్రదర్శించేందుకు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బాహుబలి వీడియో సాంగ్ ప్రోమో విడుదల రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోడానికి అనుమతి ఇవ్వాలంటూ టాలీవుడ్ నిర్మాతలు దగ్గుబాటి సురేష్, కళ్యాణ్, దామోదర్, ప్రసాద్ తదితరులు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధను కలిసి విజ్ఞప్తి చేసిన మర్నాడే ఇలా బాహుబలి-2 సినిమాకు ఆరు షోలకు అనుమతి రావడం గమనార్హం. మొత్తం అన్ని సినిమాలు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేలా అనుమతి ఇవ్వాలని, దాంతోపాటు ప్రేక్షకులకు ఇబ్బంది కలగని రీతిలో టికెట్ల ధరలను పెంచుకోడానికి కూడా అనుమతించాలని వారు కోరారు. రోజుకు ఐదు షోలు.. టికెట్ల ధరల పెంపు!