
‘బాహుబలి’ ఐదు షోలకు సుముఖం
సచివాలయంలో మంత్రిని కలిసిన చిత్ర నిర్మాత
సాక్షి, హైదరాబాద్: బాహుబలి–2 చిత్రం ఐదు ఆటల ప్రదర్శన కు ప్రభుత్వం సుముఖంగా ఉందని, చారిత్రక నేపథ్యంగల చలన చిత్రాలను తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహి స్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సచివాలయంలో తలసానిని కలిసిన బాహుబలి చిత్ర నిర్మాత ప్రసాద్ దేవినేని...తమ చిత్రాన్ని ఐదు షోలుగా ప్రదర్శించేందుకు అనుమతించాలని కోరారు. మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గతంలో చారిత్రక నేపథ్యంతో నిర్మించిన రుద్రమదేవి, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాల కు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే ఆన్‌లైన్ టికెటింగ్ విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు. తమ విన్నపానికి సానుకూలంగా స్పందించడంపట్ల మంత్రికి నిర్మాత కృతజ్ఞతలు తెలిపారు.
వాహనంపై బుగ్గ తొలగించిన తలసాని
పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం సచివాలయంలో తన అధికారిక వాహనంపై ఉన్న బుగ్గను స్వచ్ఛందంగా తొలగిం చారు. స్వయంగా కారు వద్దకు వచ్చిన ఆయన దగ్గరుండి బుగ్గను తొలగించారు.