4.75 కిలోల బంగారం స్వాధీనం
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని టూటౌన్ పోలీసులు 4.75 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పొద్దుటూరుకు చెందిన బాబా ఫక్రుద్దీన్ స్థానిక మార్కెట్లో విక్రయించేందుకు బంగారాన్ని తీసుకురాగా... సోమవారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు స్వాధీనం చేసుకుని ఫక్రుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 4.46 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా, పన్నులు లేకుండా ఈ బంగారాన్ని విక్రయిస్తున్నట్టు సీఐ శ్రీధర్ తెలిపారు.