Bachelor life
-
ప్రసాదు.. మీ పెళ్లెప్పుడు..?!
(వెబ్ స్పెషల్) మన సమాజంలో ఒకప్పుడు బాల్య వివాహాలు జరిగేవి. పదేళ్లలోపు పిల్లలకు వివాహం చేసేవారు. తర్వాత కాలానుగుణంగా పెళ్లికి వయసు మారిపోతూ వస్తోంది. ఇక ప్రస్తుతం అమ్మాయిలే 30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారు. సామాన్యులమే ఇలా ఉంటే ఇక సెలబ్రెటీల మాట. అవును 50 ఏళ్లు దాటిన పెళ్లి ఊసెత్తని హీరోలు ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల మీద ఓ లుక్కేయండి.. 1. సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీలో పెళ్లి టాపిక్ వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది కండల వీరుడు సల్మాన్ ఖాన్. 54 సంవత్సరాలు వచ్చిన ఈ హీరో ఇంకా పెళ్లి ఊసేత్తడం లేదు. అలా అని వివాహం మీద ఏమైనా వ్యతిరేకత ఉందా అంటే ఏం లేదు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపాడు. మొదట ఐశ్యర్య రాయ్‌ని ప్రేమించాడు. కానీ బ్రేకప్ అయ్యింది. తర్వాత ఐశ్యర్య, అభిషేక్‌ని వివాహం చేసుకుంది. కొద్ది రోజులు సంగీతను ప్రేమించట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కత్రినా కైఫ్‌తో మరోసారి ప్రేమలో పడ్డాడు. కానీ ఆమె, రణ్‌బీర్ కపూర్‌తో లవ్‌లో పడింది. దాంతో కొద్ది రోజుల పాటు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉన్నాడు భాయిజాన్. ప్రస్తుతం రొమేనియన్ మోడల్ లూలియా వంతూర్‌తో ప్రేమలో పడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ చాలా సందర్భాలలో కలిసి కనిపించారు.. త్వరలో పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారు. మరి ఈ సారైనా సల్మాన్ ప్రేమ సక్సెస్ అయ్యి.. పెళ్లి పీటలేక్కుతుందేమో చూడాలి. (చదవండి: ఆగేది లేదు!) 2. ప్రభాస్ బాహుబలితో అంతర్జాతీయ క్రేజ్ సంపాదించుకున్నాడు డార్లింగ్. ఇక ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. బాహుబలి అవ్వగానే ఓ ఇంటి వాడిని అవుతానని చెప్పిన డార్లింగ్ ఇప్పుడు మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. బాహుబలి తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారని.. ప్రస్తుతం స్వీటీ పెళ్లికి సిద్ధంగా లేదని.. అందుకే డార్లింగ్ పెళ్లి వాయిదా వేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనక నిజమయ్యి.. ప్రభాస్, అనుష్కలు వివాహం చేసుకుంటే అభిమానులకు పండగే! చూడాలి మరి ఏం జరుగుతుందో. 3. రణ్‌దీప్ హుడా బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా కూడా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో ఉంటాడు. 44 ఏళ్ల ఈ హీరో పెళ్లి ఊసెత్తడం లేదు. పైగా ఇంతవరకు తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాలేదు అంటాడు. ఇతను కూడా సుస్మితా సేన్, నీతూ చంద్ర వంటి హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. (చదవండి: వారం వారం ఆశ్చర్యం) 4. రామ్ హీరో రామ్ కూడా ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదు. లాక్డౌన్ కాలంలో రామ్ వివాహం గురించి చర్చలు మొదలయ్యాయని టాక్. రామ్ వయసు ఇప్పుడు 32 ఏళ్ళు. మూడు పదుల వయసులోకి వచ్చినప్పటి నుంచే ఈ హీరోను పెళ్లి చేసుకోమ్మని ఇంట్లో వాళ్ళు పోరుతున్నారట. కానీ రామ్ మూడేళ్ళుగా కెరీర్ కారణంగా పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నాడు. మరి ఈసారి తప్పించుకుంటాడో లేదో చూడాలి. 6. ఉదయ్ చోప్రా దర్శకుడు యశ్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా కూడా సింగిల్‌గానే ఉన్నారు. గతంలో ఈ హీరో నర్గిస్ ఫక్రిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని కూడా భావించాడు. కానీ ఎందుకో మరి అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఈ నటుడు సోలో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. 7. రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ కూడా ఇంకా పెళ్లి పీటలేక్కలేదు. కాకపోతే ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లతో ప్రేమాయాణం నడిపాడు. తొలుత దీపిక, తర్వాత కత్రినా. అయితే వీరిద్దరూ ఇతడికి బ్రేకప్ చెప్పారు. ప్రస్తుతం ఈ లవర్ బాయ్ అలియా భట్‌తో రిలేషన్లో ఉన్నాడు. బ్రహ్మాస్త్ర సినిమా తర్వాత పెళ్లి చేసుకోవాలని భావిస్తోన్నట్లు సమాచారం. ఇక వీరితో పాటు టాలీవుడ్లో వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్ వంటి హీరోలు సింగిల్‌గా ఉన్నారు. ఇక హీరోయిన్ టబు, అమిషా పటేల్, సుస్మితా సేన్, దివ్యా దత్తా సింగిల్‌గానే లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే వీరంతా ఓ ఇంటి వారు కావాలని కోరుకుందాం. (ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన) -
ఏంటి బావ పెళ్లంట.. వాళ్లు మోసం చేశారు!
ప్రస్తుతం టాలీవుడ్లో ప్రేమ, పెళ్లి విషయాలు హాట్‌టాపిక్‌గా మారాయి. బ్యాచ్‌లర్ లైఫ్‌కు ఒక్కొక్కరు ఫుల్ స్టాప్ పెడుతున్నారు. దగ్గుబాటి రానా నుంచి మొదలు నిఖిల్, నితిన్‌లతో పాటు మరికొందరు తమ బ్యాచ్‌లర్ జీవితానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్‌తేజ్‌ల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. యూట్యూబ్ థంబ్ నేల్‌కు సంబంధించి ఓ ఫోటోను సాయిధరమ్ తేజ్ షేర్ చేస్తూ ‘ఏంటి బావ నీకు పెళ్లంట’ అంటూ వరుణ్‌ను అడిగాడు. దీనికి సమాధానంగా ‘ఆ.. దానికి ఇంకా సమయం ఉంది కానీ.. మన బ్యాచ్‌లర్ గ్రూప్ నుంచి రానా, నితిన్‌లు తప్పుకున్నారు. పెళ్లి చేసుకోము మేము ఎప్పుడూ సింగిల్ అంటూనే మన గ్రూప్ నుంచి బయటకి వెళ్లిపోయారు’అంటూ వరుణ్ బదులిచ్చాడు. ఇక మధ్యలో కలగజేసుకున్న నితిన్ ‘బాధపడకండి బ్రదర్స్. మీ నంబర్ కూడా త్వరలోనే వస్తుంది. అవన్నీ కాదు కానీ అప్పుడెప్పుడో నా బర్త్‌డేకి గిఫ్ట్ ఇస్తా, లాక్డౌన్ వల్ల ఆగిపోయా అన్నావ్, గిఫ్ట్ ఎక్కడా, ఎప్పుడిస్తావ్, నేను వెయిటింగ్ సాయి తేజ్’ అంటూ నితిన్ పేర్కొన్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలోని పాటను విడుదల చేయాల్సింది నువ్వే(నితిన్) డార్లింగ్. సోమవారం ఆ పాట రిలీజ్ చేయ్. ఈ పాట మా సింగిల్స్‌కు అంకితం’ అంటూ సాయితేజ్ నితిన్‌కు బదులిచ్చాడు. ఇక ఈ హీరోల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక వరుణ్ తేజ్ కిరణ్ కొర్పపాటి దర్వకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’తో బిజీగా ఉన్నాడు. చదవండి: ‘సెలబ్రిటీ హోదా’ అనేది ఒక అదృష్టం మేకప్.. మేకోవర్! -
పెళ్లి చేసుకుంటేనే.. గుండె పదిలం
పారిస్ : డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటూ పాడుకునే బ్యాచిలర్లు ఇక ఆ ధోరణి నుంచి బయటపడాలంటున్నారు పరిశోధకులు. నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే పెళ్లి చేసుకొనే తీరాలంటున్నారు. ఇంతకీ విషయమేంటే... పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామితో కలిసి ఉన్నవారు ప్రమాదకరమైన హృద్రోగాల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన అంశాలను రాయల్ స్ట్రోక్ ఆస్పత్రి కార్డియాలజి విభాగం పరిశోధకులు చున్ వాయ్ వాంగ్ నేతృత్వంలోని బృందం.. మెడికల్ జర్నల్ హర్ట్ నివేదికలో పొందుపరిచారు. రెండు దశాబ్దాల పాటు వివిధ వ్యక్తులపై తాము జరిపిన పరిశోధనల్లో... పెళ్లైన వారితో పోలిస్తే పెళ్లికాని వారు హార్ట్ ఎటాక్‌తో మరణించే అవకాశం 42 నుంచి 55 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. అదేవిధంగా పెళ్లై జీవిత భాగస్వామితో విడిపోయిన వారు, ఒంటరిగా జీవించే వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 42 శాతం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అయితే పురుషుల్లో పోలిస్తే మహిళల్లో స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుందని తెలిపారు. యూరోప్, ఉత్తర అమెరికా, మధ్య ఆసియా దేశాల్లో వివిధ జాతులకు, సంస్కృతులకు చెందిన వ్యక్తులపై ఇప్పటి వరకు తాము జరిపిన పరిశోధనల్లో.. పెళ్లై జీవిత భాగస్వామితో కలిసి జీవించే వారు తమ జీవితానికి భద్రత ఉందన్న భరోసాతో ఎక్కువగా ఒత్తిడికి లోనుకామని తెలిపారన్నారు. ఇలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే తోడు ఉందనే భరోసా ఉన్నవారు మానసికంగా ఉల్లాసంగా ఉన్న కారణంగానే స్ట్రోక్ బారి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే సహజీవనం చేసే వారిలో పెళ్లి అనే బంధం లేని కారణంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. -
ఉంగరం కథ
‘‘మాయా సంసారం తమ్ముడూ నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు....’’ పాటలో ఇదే చరణం పాడుకుంటూ సదానందమూర్తి వంట గట్టు దగ్గర నిలబడి కూరలో పోపు పెట్టడానికి సన్నాహం చేస్తున్నాడు. సదానందమూర్తి సదా ఆనందంగా ఉండడానికే ప్రయత్నిస్తూంటాడుగాని, నిత్య సందేహాస్పదమైన దిక్కుమాలిన మనస్సు మొరాయిస్తూంటుంది. సదానందమూర్తి జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి- ఐచ్ఛికంగా బ్రహ్మచారి జీవితం ఎంచుకుని- దరిమిలా, స్త్రీ విముఖత కాస్తా ద్వేషంగా వృద్ధి అవుతున్న కాలంలో ఈ కథ జరిగింది. ‘సదా’ అని ముద్దుగా పిలవబడే ఆనందమూర్తికి బాల్యంలోనే ఆనందం చంపేసింది వాళ్ల అమ్మ జగదంబ. ఆవిడికి, తన భర్త తగినవాడు కాడని గాఢమైన నమ్మకం ఉండేది. అందువల్ల - మొదటగా ద్వేషం, తరవాత క్రమంగా రంగులు మారి లోకువగా, విసుగుగా, పీడగా పరిణమించింది. అయితే, స్త్రీ పురుష సంయోగం, సంసారమన్నాక తప్పదు కనక ఇద్దరు మొగపిల్లలు, ఒక ఆడపిల్ల కలగక తప్పలేదు. అప్పట్నించి పిల్లల్ని ప్రేమించుకుంటూ, భర్తని ద్వేషించుకుంటూ నలభై ఏళ్లు పైబడి గడిపేసింది. ఇది జగదంబ కథ కాదు గనుక - ఆవిడ భర్తను మానసికంగా భయపెట్టి, బెదిరించి, లోకువ చేసి, ఏమేమి సాధించిందో వివరాలలోకి వెళ్లే ఉద్దేశం ప్రస్తుతం అప్రస్తుతం. ఆవిడ ప్రవర్తన, తన తండ్రి సంసారపు ఇరకాటంలో పొందిన వేదన, సదానందమూర్తి మీద తీవ్ర ప్రభావం ప్రసరించాయి. దానితో సదా, సదా మాతృద్వేషిగా ఎదిగిపోయాడు. అక్కడ నుండి - కాలేజీ జీవితంలో మిత్రుల ప్రేమానుభవాలూ, తన వృత్తిలో ఎదురైన రకరకాల స్త్రీల వగలమారితనాలూ, అతన్ని ఒంటరివాడిగా ఉండిపొమ్మనే ప్రోత్సహించాయి. ఫలితంగా ‘హార్డుకోరు’ స్త్రీజన వ్యతిరేకిగా తయారయ్యాడు. తయారైన వాడు ఊరుకోకుండా కొన్ని సిద్ధాంతాలు, ప్రకటనలకు సిద్ధపడ్డాడు. మచ్చుకి మూడు: 1. యౌవనంలో మిసమిసలాడే ప్రతి స్త్రీ ప్రకృతిలో అందంగా కనిపించే తామరపూల చెరువులాంటిది. అయితే, లోపల ఒక మొసలి దాగి ఉంటుంది. ఏమరిపాటుగా ఉన్నా, సౌందర్యానికి ప్రలోభపడినా, లాగి పారేసి మగాణ్ణి సంసారం పేరిట మింగేస్తుంది. 2. స్త్రీలకు వంటింట్లోకి ప్రవేశం ఉండకూడదు. వట్టి కక్కుర్తి మేళం. కిట్టింపు వంటలు చేసి, తలతిక్క వాదనలు చేస్తారు. 3. స్త్రీకి ఉన్న శక్తిమంతమైన ఆయుధం ‘సెక్సు’. మొగ వెధవ, కోడిపుంజులాగ వెంటపడతాడని తెలుసు. దొరకబుచ్చుకొని మెడ విరిచేస్తుంది. స్త్రీకి బహుదూరులు మూడు రకాలుగా ఉంటారు. ఒకరు: భయస్థులు. రెండోవారు: అనుమానస్థులు, మూడోవారు: అహంకారస్థులు. ఇతడు ఏ బాపతో కొంచెంకొంచెం ‘స్టడీ’ చేయడం ప్రారంభించింది. సదానందమూర్తి ఆంజనేయస్వామి లాంటివాడు కూడా. పొగిడే కొద్దీ రెచ్చిపోయి ఎంతపనైనా చేసేస్తాడు. ఈ గుణం వల్లనే ముప్ఫై మూడేళ్ల వయస్సుకే జర్నలిస్టుగా బయటపడి, ప్రభుత్వం వారి ‘కల్చరల్ అఫైర్సు’ డిపార్టుమెంటులో డెరైక్టరై కూర్చున్నాడు. అన్నింటికీ మించి- ‘సదా’ ఆనందమంతా పూజలు చేయడంలో ఉంది. దైవభక్తి మెండు. ఇల్లూ ఒళ్లూ ఘాటెత్తిపోయే కూరపోపు తగిలించి- ‘సదా’ పరవశిస్తున్న వేళ, శేషుబాబు నేరుగా వంటింట్లోకి వచ్చి ఆఫీసు వార్త తెలియచెప్పాడు. శేషుబాబు, సదా దగ్గర సహాయక పదవిలో ఉన్న సంసారి. సాంస్కృతిక శాఖ సహాయంతో ఒక ప్రసిద్ధ కళాసంస్థ శాస్త్రీయ సంగీత పోటీలు గాత్రంలో నిర్వహించడం ఆ వార్త విషయం. ఏర్పాట్ల వివరాల చర్చ ప్రధానాంశం. ‘‘మీటింగు బుధవారం మధ్యాహ్నం రెండింటికి కదా! నా పూజ, భోజనం ఒంటిగంటకి గాని కావు. తెలుసుగా!- ‘ఎకార్డింగ్లీ’ ఏర్పాటు చెయ్యి-’’ అని ఆదేశించి- శేషుబాబుని, పిలవని పేరంటంగా ఇంటికి వచ్చినందుకు కొంచెం ముఖం ముడిచి- పంపేసి- స్నానానికి లేచాడు- సదా. దినపత్రికలో న్యూస్ ఎడిటర్‌గా సదానందమూర్తి పని చేసే కాలంలో - కళావతి మాస్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ చేసి- కొత్తగా సబ్-ఎడిటర్‌గా చేరింది. అందమైంది. చలాకీ అయింది. మాటకారి. అన్నింటికీ మించి, ఈ లక్షణాలన్నీ తనకి గలవు సుమా! అనే ‘స్పృహ’ పుష్కలంగా ఉన్న పరిపూర్ణ మహిళ. కళావతికి సదానంద మూర్తి చాలా నచ్చాడు. అతని అభిప్రాయాల గురించి ఆఫీసులో కథలు కథలుగా విన్నప్పటి నుంచి, అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలనే కుతూహలం కూడా పెరిగింది. ఆఫీసులో న్యూస్టేబుల్ దగ్గర సదానందమూర్తి సింహం. పని తప్ప ఎవరితో ఏ విషయాలూ చిల్లరగా ప్రస్తావనకు రానివ్వడు. పైగా స్త్రీకి బహుదూరుడు. కళావతి ఆలోచించింది. స్త్రీకి బహుదూరులు మూడు రకాలుగా ఉంటారు. ఒకరు: భయస్తులు. రెండోవారు: అనుమానస్తులు, మూడోవారు: అహంకారస్తులు. ఇతడు ఏ బాపతో కొంచెంకొంచెం ‘స్టడీ’ చేయడం ప్రారంభించింది. కొంతకాలానికి తేలిన విషయం ఏమంటే - ఈ ‘కేసు’ సైకలాజికల్‌గా బాల్య ప్రభావంలోంచి మొలిచినదనీ, తొందరగా నమ్మకం ఏర్పడదనీ, మొండిగా ముందుకు వెడితే, విషయం ఎదురు తిరుగుతుందనీ- ఒకటి రెండు వార్తా సందర్భాలలో అర్థమైంది. అపార్థం తొలగిస్తే సదానందమూర్తి తనకి తగిన భర్త కాగలడనే నిర్ణయానికి వచ్చింది. ఈ అన్వేషణలో ‘సదా’ భక్తీ, పూజా కైంకర్యాలూ ఆసరా అయ్యాయి. ప్రయత్నాలు ముమ్మరం చేద్దామనుకుంటున్న తరుణంలో, సదానందమూర్తి పత్రికా రంగం విడిచి, సాంస్కృతిక రంగంలో ప్రవేశించడం జరిగిపోయింది. అయితేనేం? మంచి గాయకురాలైన కళావతి తన ఉద్దేశాలు మానుకోలేదు. సాంస్కృతిక శాఖ సాయంతో, కళాసంస్థ నిర్వహించిన శాస్త్రీయ సంగీత పోటీల్లో తానూ పాల్గోదలిచానంటూ పూర్వ పరిచయం పురస్కరించుకుని - కళావతి ‘సదా’ని కలిసి కోరింది. సదా చాలా మర్యాదగానే, కళా సంస్థ వారిని కలవమని సూచించి- తనకి సంగీతం మీద ఉండే అభిరుచి వల్ల- తటస్థంగానే - పదినిమిషాలు రాగాల గురించీ, కీర్తనల గురించీ, సంగీత శాస్త్రంలో భక్తి ప్రాధాన్యం గురించీ, మాట్లాడాడు. చాలు - కళావతి సంగీత సరస్వతి గురించీ, లలితా త్రిపురసుందరీ దేవి మహిమ గురించీ, లలితా సహస్ర పారాయణ మహిమ గురించీ, సదాకి భక్తి పారవశ్యంతో వివరించింది. దాని మీదట హిందూ సంప్రదాయంలో పూజలు, యంత్రాలు, మంత్రాలు, వివిధ రకాల రాళ్ల ఉంగరాల ధారణ మహాత్మ్యం దాకా, సంభాషణ సాగింది. సదానంద మూర్తికి ఆ చర్చ ఎంతో ఆహ్లాదంగా, చల్లగా, శాంతిగా అనిపించింది. ‘‘తప్పక పోటీలో పాడండి’’ అన్నాడు సదా మెత్తబడి. ‘‘అంతా ఆ తల్లి దయ’’ అంది, కళావతి నిర్లిప్తంగా. ‘‘కళావతిగారు దీన్ని మీకిచ్చి, పూజలో పెట్టమన్నారు’’ - అన్నాడు శేషుబాబు. సదానందమూర్తి అనుమానంగా చూసి- ‘‘ఏమిటిది?’’ అన్నాడు. శేషుబాబు ఇచ్చాడు. ఉంగరం. బంగారు ఉంగరం. పచ్చరాయి ఉంగరం- సదాకి కోపం వచ్చింది- ‘‘పాడింది ఆమె. బహుమానం ఇచ్చినవాళ్లు కళాసంస్థ న్యాయనిర్ణేతలు. నాకెందుకీ ఉంగరం? దీన్ని లంచంగా ఇవ్వాలనుకుంటోందా? జడ్జిమెంటుకి, నాకు ఏమీ సంబంధం లేదు. నేను బహుమతి ఇప్పించాననుకుంటూందేమో! చెప్పు. తీసికెళ్లి ఇచ్చెయ్యి’’ శేషుబాబు భయపడి, వెనక్కి వెళ్లి కళావతికా ఉంగరం ఇచ్చేశాడు. మర్నాడు కళావతి ఉంగరం తీసుకుని సదానందమూర్తి ఇంటికి వచ్చి- ‘‘నేను దీనిని మీకిమ్మన్నది లంచంగా కాదు. మీ పూజలో పెట్టి, లలితాదేవికి కుంకంపూజ చేసి, ఆ పూజ కుంకంతో ఈ ఉంగరాన్ని మీరు నాకివ్వాలని కోరానంతే. తప్పయితే క్షమించండి’’ అంది. సదానందమూర్తి తన పొరపాటుకి నొచ్చుకున్నాడు. ఒక సాంస్కృతిక శాఖ డెరైక్టరుగా ఆ విధంగా కళావతి తన ఆశీస్సు కోరిందని గ్రహించాక- భక్తిగా ఆమె నుంచి ఉంగరం తీసుకుని- మర్నాడుదయం ఇనుమడించిన భక్తితో అమ్మవారి పూజ చేసి, కుంకం, ఉంగరం, పొట్లం కట్టి- శేషుబాబు చేత తిరిగి పంపించాడు. వారం రోజుల్లో అసలైన వార్త ఇలాగొచ్చింది: సదానందమూర్తి అనే సాంస్కృతిక శాఖ డెరైక్టరు, పంజాబులో ‘జలంధరు’ నుంచి ఒక వశీకరణ ఉంగరం తెప్పించి- పూజాకుంకంతో కూడా కళావతి అనే శాస్త్రీయ సంగీత కళాకారిణి గాత్రానికి మెచ్చుకోలుగా, కానుక పంపించి, ఆమెను వశపరుచుకున్నాడనీ- ఆ సదరు కళావతి సదానందమూర్తినే తప్ప ఇంకెవరినీ పెళ్లాడనని కూర్చుందనీ- సదానందమూర్తి భవిష్యత్తు ఎలా ఉండగలదోనని!-