Badaun District
-
తండ్రితోనే కాపురం పెట్టిందని తెలిసి షాకైన కొడుకు
లక్నో: నాన్న చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని.. కనిపించడం లేదంటూ ఆర్టీఐకి అప్లికేషన్ పెట్టుకున్నాడు ఒక కొడుకు. కాగా ఆర్టీఐ తన నాన్నకు సంబంధించిన సమాచారం దొరికిందని చెప్పగానే జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసుకు సంతోషంగా వెళ్లాడు. కానీ వారు ఇచ్చిన వివరాలు చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కారణం ఆ యువకుడి నాన్న మరో యువతిని పెళ్లిచేసుకొని ఆమెతో కాపురం పెట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ యువతి ఎవరో కాదు.. ఐదేళ్ల కిత్రం ఆ యువకుడి మాజీ భార్యే కావడం విశేషం. ఇప్పుడు తన మాజీ భార్యనే పిన్నిగా పిలవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ వింత ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 2016లో సదరు యువకుడు మైనర్‌గా ఉన్నప్పుడు ఒక మైనర్ అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ యువకుడు రోజు తాగి వచ్చి ఆమెను వేధించేవాడు. ఆరు నెలల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. తర్వాత ఆ యువకుడు ఊరి పెద్దల మధ్య ఇక ఎప్పుడు గొడవపడనని చెప్పాడు. కానీ ఆ యువతి అందుకు ఒప్పుకోకుండా విడాకులు తీసుకుంది. కాగా ఆ యువకుడి తండ్రి సానిటేషన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగి. ఇంటి అవసరాలతో పాటు కొడుకుకు కూడా డబ్బులు తనే ఇస్తుండేవాడు. ఇటీవలే కొన్ని రోజుల నుంచి తన తండ్రి కనిపించడం లేదని.. ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయి సాంబల్ ప్రాంతంలో ఉంటున్నారని తెలుసుకొని ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి జాడ తెలిసిందనగానే జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరుకొని వారు అందించిన వివరాలు చదువుకున్నాడు. తన మాజీ భార్యనే నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడని, అక్కడే ఆమెతో కాపురం పెట్టాడని తెలుసుకున్నాడు. వెంటనే బసౌలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం అర్థం చేసుకున్న పోలీసులు జూలై 3న ఇరు వర్గాలను పిలిచి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే యువకుడి తండ్రి భార్య మాత్రం ఇప్పుడు వరుసకు కొడుకు అయ్యే అతనితో కలిసి ఉండలేనని పేర్కొంది. తన రెండో భర్తతోనే సంతోషంగా ఉన్నానని.. అతన్ని మా దగ్గరకు పంపొద్దని పోలీసులకు చెప్పింది. పోలీసులు మరోసారి దీనిపై మాట్లాడదమని చెప్పి వారిని అక్కడినుంచి పంపించేశారు. -
వాట్సాప్ లో గ్యాంగ్ రేప్ వీడియో
పిలిభిత్(ఉత్తరప్రదేశ్): పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం అదృశ్యమైన వివాహిత ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పెట్టిన కేసును నమోదు చేయలేదు. అదృశ్యమైన వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వీడియో క్లిప్ వెల్లడికావడంతో హడావుడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సుగంధి పోలీస్ స్టేషన్ పరిధిలో బార్హా గ్రామానికి చెందిన ఓ మహిళ నవంబర్ 23న తన మూడు నెలల బిడ్డను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. నాలుగు రోజుల క్రితం ఆమె సోదరుడికి వాట్సాప్ ద్వారా ఒక వీడియో క్లిప్ అందింది. ఐదుగురు దుండగులు వివాహితపై అత్యాచారానికి పాల్పడి, వీడియో తీశారు. దీంతో మరోసారి బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దుండగులపై కేసు నమోదు చేశామని ఏఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితులను గుర్తించేందుకు, బాధితురాలి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే తాము మొదట ఫిర్యాదు చేసినప్పుడే స్పందించివుంటే ఇంత దారుణం జరిగివుండేది కాదని బాధితురాలి కుటుంబ సభ్యులు వాపోయారు. -
యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: మాయా
లక్నో: సమాజ్‌వాది పార్టీ పాలనలో ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బహుజన సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి విమర్శించారు. యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. బదౌన్ గ్యాంగ్ రేప్ బాధితుల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బదౌన్ ఘోరానికి పోలీసు అధికారులను బదిలీ చేయడం, సస్పెండ్ చేయడం సరిపోదన్నారు. రాష్ట్రంలో ఘోరాలు ఆగాలంటే ముందుగా సమాజ్‌వాది పార్టీ నాయకులకు కళ్లెం వేయాలని సూచించారు. ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం విఫలమైందని మాయావతి ధ్వజమెత్తారు. రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను కలిసి కోరతామన్నారు. కేంద్రం కూడా ఈ విషయంలో కలగజేసుకోవాలని కోరారు. బదౌన్ జిల్లా కాత్రా సదత్గంజ్ గ్రామంలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, హత్య సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.