badly
-
ఈడీ అరెస్ట్ వేళ సెంథిల్ తలకు గాయం?
సాక్షి, చెన్నై: ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని అరెస్ట్చేసినపుడు ఈడీ ఆయన పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించిందా అనే అనుమానాలను తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(టీఎన్ఎస్హెచ్ఆర్సీ) సభ్యుడొకరు వ్యక్తంచేశారు. అదే జరిగితే ఆ అంశాన్ని టీఎన్ఎస్హెచ్ఆర్సీ తప్పక పరిశీలిస్తుందని సంస్థ సభ్యుడు కన్నదాసన్ చెప్పారు. రవాణా శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ పలువురి నుంచి భారీఎత్తున నగదు తీసుకున్నారనే ఆరోపణలపై సెంథిల్‌ను విచారించిన ఈడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక అరెస్ట్‌చేశారు. అరెస్ట్వేళ సెంథిల్ బిగ్గరగా రోదించడం, వెంటనే ఆస్పత్రిలో చేర్పించి యాంజియోగ్రామ్ చేయించడం, గుండె నాళంలో బ్లాక్‌లను గుర్తించడం విదితమే. అయితే అర్ధరాత్రి అరెస్ట్ సందర్భంగా తన పట్ల ఈడీ అధికారులు దురుసుగా ప్రవర్తించారని తనను ఆస్పత్రికి కలవడానికి వచ్చిన కన్నదాసన్‌కు సెంథిల్ ఫిర్యాదుచేశారు. ‘ ఈడ్చుకెళ్లారని ఆయన చెప్తున్నారు. లాక్కెళ్లినపుడే ఆయన తలకు గాయమైందట. ఈడీ దురుసు ప్రవర్తన అంశాన్ని టీఎన్ఎస్హెచ్ఆర్సీ పరిశీలిస్తుంది’ అని కన్నదాసన్ చెప్పారు. కాగా, చెన్నై ఓమందూరార్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను కావేరి ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్సకు అనుమతి ఇవ్వాలని మంత్రి భార్య మేఘల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కావేరి ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స, వైద్య సేవలకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఈడీ అధికారులను ఆదేశించింది. రెచ్చ గొట్టొద్దు: కేంద్రంపై స్టాలిన్ ఫైర్ ఈడీ దాడులు, మంత్రి అరెస్టు నేపథ్యంలో డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్‌చేశారు. ‘డీఎంకే వాడిని. రెచ్చగొట్టొద్దు తట్టుకోలేరు’ అని కేంద్రాన్ని హెచ్చరించారు. కరుణానిధి చేసిన హెచ్చరికలను ఉటంకిస్తూ.. ‘డీఎంకే వాళ్లు తిప్పి కొట్టడం మొదలెడితే భరించలేరు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మేం చేయని రాజకీయాలు లేవు. మేం చూడని పోరాటాలు లేవు. ఒకసారి చరిత్రను చూసుకోండి’ అని హెచ్చరించారు. ‘ఇది బెదిరింపు కాదు. హెచ్చరిక’ అని అన్నారు. సెంథిల్ అరెస్ట్‌పై స్పందించారు. ‘ ఈడీ ద్వారానే రాజకీయాలు చేద్దామని బీజేపీ చూస్తోంది. ఈడీని అడ్డుపెట్టుకుని పదేళ్లనాటి పాత కేసులో మానసికంగా, శారీరకంగా సెంథిల్‌ను వేధిస్తున్నారు. ఈడీ అధికారులు పెట్టిన మానసిక ఒత్తిడితోనే ఆయనకు హృద్రోగ సమస్యలొచ్చాయి. 18 గంటలు నిర్బంధించిమరీ ప్రశ్నల పరంపర కొనసాగించారు. ఎవ్వరినీ కలవనివ్వలేదు. దాంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించాక ఆస్పత్రికి తరలించారు’ అని ఆరోపించారు. -
‘ఐటా’ తీరు ఆశ్చర్యం కలిగించలేదు!
ముంబై: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) తనతో వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని మాజీ ఆటగాడు మహేశ్ భూపతి వ్యాఖ్యానించాడు. అయితే ‘ఐటా’ గత రికార్డును బట్టి చూస్తే ఇది తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని అతను అన్నాడు. పాకిస్తాన్‌తో జరిగే డేవిస్ కప్ మ్యాచ్ కోసం ముందుగా మహేశ్నే నాన్‌ప్లేయింగ్ కెప్టెన్‌గా ‘ఐటా’ ఎంపిక చేసింది. అయితే అతను పాకిస్తాన్ ప్రయాణించేందుకు ఇష్టపడటం లేదంటూ తొలగించింది. దీనిపై భూపతి స్పందించాడు. ‘నేను కెప్టెన్‌గా పనికి రానని వారు భావిస్తే తప్పు లేదు. కానీ ప్రస్తుతం నీకు బదులుగా మరొకరిని ఎంపిక చేస్తున్నామని ఒక్క ఫోన్ కాల్ చేసినా బాగుండేది. కానీ నాకు కనీస సమాచారం కూడా అందించలేదు. నన్ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించిన రోజున హైదరాబాద్‌కు వచ్చి మరీ నాతో కలిసి మాట్లాడారు. కానీ ఇప్పుడు వారి ప్రవర్తన తీవ్ర నిరాశ కలిగించింది. నేను బాధ పడటం కూడా సహజం. అయితే గత ఇరవై ఏళ్లుగా భారత టెన్నిస్ సంఘం పలువురు ఆటగాళ్లతో వ్యవహరించిన తీరును బట్టి చూస్తే ఇది ఆశ్చర్యం కలిగించలేదు’ అని భూపతి వివరించాడు. -
ఓటర్ల అనాసక్తి
♦ నీరసంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ ♦ హెబ్బాళలో 46, బీదర్‌లో 56, దేవదుర్గలో 61శాతం పోలింగ్ సాక్షి, బెంగళూరు: శాసనసభ్యుల అకాల మరణంతో ఉప ఎన్నికలు జరిగిన హెబ్బాళ, బీదర్, దేవదుర్గ అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నీరసంగా సాగింది. శనివారం ఉదయం 10గంటల వరకు కూడా పోలింగ్ కేంద్రాల్లో పెద్దగా ఓటర్లు కనిపించలేదు. దీంతో సాయంత్రం ఐదు గంటల సమయానికి హెబ్బాళలో 46శాతం ఓటింగ్ నమోదు కాగా, బీదర్‌లో 56శాతం, దేవదుర్గలో 61శాతం ఓటింగ్ నమోదైంది. ఇక చెదరుమదురు ఘటనలు మినహా మూడు నియోజకవర్గాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఇక హెబ్బాళ పరిధిలోని 88, 103వ నంబర్ పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ♦ డాలర్స్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎమ్మెల్సీ జయమాల తన ఓటరు గుర్తింపు కార్డును మరిచిపోయి వచ్చారు. దీంతో ఆమెను పోలింగ్ అధికారులు ఓటు వేసేందుకు అనుమతించలేదు. అనంతరం జయమాలా కుమార్తె సౌందర్య, జయమాల గుర్తింపు కార్డును తీసుకొచ్చారు. తర్వాత వీరిరువురూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ♦ హెబ్బాళ నియోజక వర్గ పరిధిలో మాజీ ఎమ్మెల్సీ అబ్దుల్ అజీమ్, జేడీఎస్ అభ్యర్థి ఇస్మాయిల్ షరీఫ్, కాంగ్రెస్ అభ్యర్థి రెహమాన్ షరీఫ్, మాజీ ఎంపీ డి.బి.చంద్రేగౌడ, అదనపు పోలీస్ కమిషనర్ చరణ్‌రెడ్డి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ♦ బీదర్ ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి ఓటు వేస్తున్నాని బహిరంగంగా చెప్పడం ద్వారా ధరమ్‌సింగ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. ♦ బీదర్‌లో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయానికి 56శాతం ఓటింగ్ నమోదైంది. ♦ దేవదుర్గలోని అన్ని ప్రాంతాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయానికి ఇతర ప్రాంతాలతో పోలిస్తే అత్యధికంగా 61శాతం ఓటింగ్ నమోదైంది. -
వ్యక్తిని చెప్పుతో చితక్కొట్టిన కానిస్టేబుల్