బద్రి మృతికి మీడియా ప్రతినిధుల సంతాపం
ఏలూరు: టీవీ9 న్యూస్ ప్రజెంటర్ బద్రి మృతదేహానికి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తైంది. ఆయన భౌతికకాయాన్ని విజయవాడకు తరలించారు. బద్రి భౌతిక కాయానికి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ నివాళులర్పించారు. కలెక్టర్ తో పాటు బద్రి మృతదేహానికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు.ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కె.మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శి వినాయకరావు, ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు జి.రఘురామ రాజు తదితరులు బద్రి మృతికి సంతాపం ప్రకటించారు.