ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
పోరుమామిళ్ల: ఎర్రచందనం దుంగలతో సహా 11 మంది నిందితులను అరెస్టు చేసి శనివారం బద్వేలు కోర్టులో హాజరుపెట్టినట్లు పోరుమామిళ్ల ఫారెస్టు రేంజర్ నజీర్జా తెలిపారు. 11 దుంగలతో పాటు వారి నుంచి మూడు మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో బి.మఠం మండలం కేశవాపురానికి చెందిన వేమిరెడ్డి ఓబుల్‌రెడ్డి, శీలం నరిసిరెడ్డి, కాశినాయన మండలం బసనపల్లెకు చెందిన ఆదూరు భాస్కర్‌రెడ్డి, వరికుంట్ల కాటయ్య, తిప్పరాజుపల్లెకు చెందిన సుంకరి బాలశౌరి, అట్లూరుకు చెందిన చెన్నంశెట్టి గోపయ్య, బద్వేలు మండలం బాలాయపల్లెకు చెందిన నాగిపోగు ఓబులేసు, గొల్లపల్లె రాజయ్య, పందీటి ఈశ్వరయ్య, తొండలదిన్నెకు చెందిన వరికూటి గౌతమబుద్దుడు, నాగిపోగు నడిపి సుబ్బయ్య ఉన్నారని తెలిపారు. వీరందరినీ జ్యోతి బీటులోని భీమునిగుండాల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నామని రేంజర్ నజీర్జా తెలిపారు.