Bajaj Hindustan
-
బజాజ్ హిందుస్తాన్‌పై ఎస్బీఐ దివాలా పిటీషన్
న్యూఢిల్లీ: దేశీయంగా అతి పెద్ద చక్కెర, ఇథనాల్ తయారీ సంస్థ బజాజ్ హిందుస్తాన్ షుగర్‌పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పిటీషన్ వేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్‌లో ఈ మేరకు అభ్యర్ధన దాఖలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రుణ వాయిదా, కూపన్ రేటు వడ్డీ చెల్లింపుల్లో జాప్యం చేయడంతో రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కంపెనీ ఖాతాను మొండి పద్దు (ఎన్పీఏ) కింద వర్గీకరించినట్లు ఎస్బీఐ పేర్కొంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,607 కోట్ల టర్నోవరుపై రూ. 268 కోట్ల నికర నష్టం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. బజాజ్ హిందుస్తాన్ షుగర్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లో పధ్నాలుగు ప్లాంట్లు ఉన్నాయి. చదవండి👉 కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..! -
బజాజ్ గ్రూప్ @ రూ. 7.5 లక్షల కోట్లు..
ముంబై: వ్యాపార దిగ్గజం బజాజ్ గ్రూప్ తాజాగా 100 బిలియన్ డాలర్ల (రూ. 7.5 లక్షల కోట్ల) మార్కెట్ క్యాప్ మైలురాయిని అధిగమించింది. దీంతో కుటుంబాల సారథ్యంలో నడుస్తూ, ఈ ఘనత సాధించిన దిగ్గజ గ్రూప్‌లలో నాలుగోదిగా నిల్చింది. టాటా, రిలయన్స్, అదానీ గ్రూప్‌లు ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల క్లబ్లో ఉన్నాయి. జూన్ 25న బజాజ్ గ్రూప్ కొంత సేపు ఈ మైలురాయి దాటినప్పటికీ.. మార్కెట్ క్షీణించడంతో నిలబెట్టుకోలేకపోయింది. అయితే జూలై 6న తిరిగి సాధించింది. డాలరుతో పోలిస్తే 74.55 రూపాయి మారకం ప్రకారం గ్రూప్‌లోని ఎనిమిది లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 100.6 బిలియన్ డాలర్లకు చేరింది. రూ. 7.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌లో సింహభాగం వాటా బజాజ్ ఫైనాన్స్‌దే (సుమారు రూ. 3.7 లక్షల కోట్లు) ఉంది. వివిధ రంగాల్లోకి విస్తరించిన బజాజ్ గ్రూప్‌లో.. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఫిన్సర్వ్), బజాజ్ ఆటో వంటివి కీలకంగా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా బజాజ్ గ్రూప్ స్టాక్స్ గణనీయంగా ర్యాలీ చేశాయి. బజాజ్ హిందుస్తాన్ షుగర్, ముకంద్ వంటివి 279, 118 శాతం మేర ఎగిశాయి. -
బజాజ్ హిందుస్తాన్ విద్యుత్ వ్యాపారం విక్రయం
డీల్ విలువ రూ.1,800 కోట్లు న్యూఢిల్లీ: బజాజ్ హిందుస్తాన్ షుగర్ కంపెనీ తన విద్యుదుత్పత్తి వ్యాపారాన్ని విక్రయిస్తోంది. తన గ్రూప్‌కే చెందిన లలిత్పూర్ పవర్ జనరేషన్ కంపెనీ(ఎల్పీజీసీఎల్)కు రూ.1,800 కోట్లకు ఈ విద్యుదుత్పత్తి వ్యాపారాన్ని విక్రయించనున్నది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని బజాజ్ హిందుస్తాన్ బాంబే స్టాక్ ఎక్సే్చంజ్(బీఎస్ఈ)కి వెల్లడించింది. 14 ప్రాం తాల్లో 449 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేస్తున్నామని, ఈ విద్యుదుత్పత్తి వ్యాపారాన్ని మొత్తం నగదుకే ఎల్పీజీసీఎల్కు విక్రయిస్తామని వివరించింది.