అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
ఖానాపూర్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామంలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీర్ నంది గ్రామానికి చెందిన బక్క రాజం(45) బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఖానాపూర్ పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. అనారోగ్య సమస్యలే ఇతని ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.