balakrishna yadav
-
టీడీపీ మేయర్ అభ్యర్థి అరెస్టు
తెలుగుదేశం పార్టీకి చెందిన మేయర్ అభ్యర్థి బాలకృష్ణ యాదవ్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. పులివెందులకు చెందిన సతీష్ కుమార్ రెడ్డి హత్యకేసులో బాలకృష్ణ యాదవ్ మూడో నిందితునిగా ఉన్నారు. ఇన్నాళ్లుగా పరారీలో ఉన్న ఆయనను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. -
ఆ నేత అరెస్టుకు మీనమేషాలెందుకు?
పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నగిరిగుట్టకు చెందిన కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్‌ని అరెస్ట్ చేయడానికి పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కేసులో ప్రధాన నిందితులుగా మల్లికార్జునరెడ్డి, అతని అల్లుడు ప్రమోద్, కుమార్తె షర్మిల, కడప నగరానికి చెందిన టీడీపీ నేత బాలకృష్ణయాదవ్, అతని అనుచరులను పోలీసులు చేర్చారు. సతీష్‌కుమార్‌రెడ్డి తన పెట్రోలు బంకు దగ్గర అదృశ్యం అయిపోయి.. తర్వాత ఎలా హతమయ్యారన్న విషయంపై ఆయన సోదరుడు హరనాథరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్య కేసులో బాలకృష్ణ యాదవ్ పై బలమైన సాక్ష్యాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ నిందితులెవరు దొరకడం లేదంటూ బాలకృష్ణ యాదవ్ అరెస్టుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. బాలకృష్ణ యాదవ్ మాత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. -
అధికార దర్పమే ఇరికించింది!
సాక్షి ప్రతినిధి, కడప : రాజకీయ నాయకుల చర్యలు, నడవడిక ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉండాలి. ప్రజామెప్పు పొందిన వారికే ఆదరణ లభిస్తుంది. పాతతరం నాయకుల చర్యలు అచ్చం అలానే ఉండేవి. స్వార్థ చింతనకు దూరంగా, ప్రాంతం అభివృద్ధే ధ్యేయంగా మసులుకునేవారు. ప్రస్తుత నాయకులు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి చర్య వెనుక తనకేమిలాభం అన్న ధోరణితోనే ముందుకు వెళ్తున్నారు. అధికారం ఉందంటే విచక్షణ మరిచి మరీ అడ్డంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి వ్యవహారంలోనూ తలదూరుస్తూ వివాదాస్పదమౌతున్నారు. అచ్చం అలాంటి పరిస్థితే కడప నగర టీడీపీ నేత బాలకృష్ణయాదవ్ కొనసాగించారు. వెరశి ఓ హత్య కేసులో చిక్కుకున్నారు. బాలకృష్ణ యాదవ్ కడప కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థిగా నిలుచుండిన్నారు. కడపలో టీడీపీకి ప్రజాదరణ లేకపోవడం కారణంగా మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన కార్పొరేటర్‌గా ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ప్రవర్తించడంలో ఆయన ముందు వరుసలో నిలిచారు. అందుకు జన్మభూమి కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజాద్బాషలకు అడ్డు తగులుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించారు. అధికార దర్పంతో వ్యూహాత్మకంగా ఫోకస్ అయ్యేలా ఆయన చర్యలు ఉండేవి. ఇతని దుశ్చర్యలను ప్రభుత్వ యంత్రాంగం నియంత్రించకపోవడంతో మరింత అడ్డుఅదుపు లేకుండా పోయింది. ప్రస్తుతం బాలకృష్ణయాదవ్‌కు వ్యక్తిగతంగా రాజకీయ భవిష్యత్ సైతం ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం కడప నగర టీడీపీ అధ్యక్షుడుగా పార్టీ పదవి కట్టబెట్టేందుకు సంసిద్ధమైన తరుణంలో హత్య కేసులో నాల్గువ నిందితుడుగా ఇరుక్కుపోయారు. స్వీయ నియంత్రణ లేకపోవడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. కడప గడపలో ప్రతి వ్యవహారంలో జోక్యం... కడపలో చిన్నచిన్న పంచాయితీలు చేయాలన్నా, పోలీసుస్టేషన్లో సెటిల్మెంట్లు చేయాలన్నా నేనున్నానని బాలకృష్ణయాదవ్ ముందుండేవారని పరిశీలకులు పేర్కొంటున్నారు. కార్పొరేషన్లో భవనాలకు అనుమతులు ఇవ్వాలన్నా, దేశం నేత అనుమతి లేకుంటే నిరాకరించే స్థాయికి యంత్రాంగం వచ్చింది. ఓ వైపు అధికారులు ఛీత్కరిస్తున్నా పట్టించుకోకుండా అడ్డంగా వ్యవహరించడం ఇటీవల సర్వ సాధారణమైంది. ఇటీవల ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ ప్రైవేట్ బిల్డింగ్ వ్యవహారంలో తల దూర్చి ధర్నా నిర్వహించడం చూసి పలువురు నవ్వుకున్నారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. పులివెందులకు చెందిన సతీష్‌కుమార్‌రెడ్డి కిడ్నాప్...ఆపై హత్య వ్యవహారంలో సైతం అదే రీతిలో వ్యవహరించారు. నిర్భందించి చితక బాదడం, రక్త గాయాలతో ఉన్న సతీష్‌కుమార్‌రెడ్డి ఫొటోలను వాట్సాప్‌లో వారి బంధువులకు పంపడం వెనుక పూర్తిగా అధికార దర్పంతోనే విర్రవీగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వెరసి అవే ఫోటోలు బాలకృష్ణ యాదవ్‌ను హత్య కేసులో నిందితుడుగా చేర్చగల్గాయి. అధికార దర్పంతో ఇదే రీతిలో వ్యవహరిస్తున్న నేతలపై ఇక నుంచి అయినా నిఘా ఉంచి నియంత్రించాల్సి ఉంది. రాజకీయ పైరవీలు సతీష్‌కుమార్‌రెడ్డి హత్య కేసులో తనపాత్ర లేదని, తెలిసిన వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయమని చెప్పానని.. ఈ వ్యవహారంలో తనను గట్టెక్కించండని బాలకృష్ణ యాదవ్ ప్రభుత్వ పెద్దల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సతీష్‌కుమార్‌రెడ్డి హత్యోదంతం తెరపైకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన తన సామాజిక వర్గానికి చెందిన నాయకుని ద్వారా ప్రభుత్వ పెద్దల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పోలీసులపై కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. అమానుషంగా సతీష్‌కుమార్‌రెడ్డిని హింసించి చంపిన వారిని కఠినంగా శిక్షించాలన్న బాధితుల డిమాండ్ ఓ వైపు, అధికార పార్టీ నేతల ఒత్తిడి మరో వైపు ఉండగా పోలీసుల తీరు ఎలా ఉంటుందోన న్న చర్చ సాగుతోంది. -
ఇంత అన్యాయం చేస్తారా..!
-
ఇంత అన్యాయం చేస్తారా..!
కడప అర్బన్, న్యూస్‌లైన్ : తమకు జరిగిన అన్యాయంపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిప్పగిరి మీనాక్షి, విజయలక్ష్మి తీవ్ర ఆవేదనతో సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని వెంటనే నగరంలోని హిమాలయ హాస్పిటల్‌కు తరలించారు.టీడీపీ మేయర్ అభ్యర్థి బాలకృష్ణయాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు వీఎస్ అమీర్‌బాబు వే ధింపుల కారణంగానే తాము ఈ చర్యకు పాల్పడినట్లు బాధితులు తెలిపారు. కడప నగరంలో స్థానిక సంస్థల వ్యవహారం టీడీపీ నేతల్లో సిగపట్లకు దారితీసింది. మేయర్ అభ్యర్థిగా బాలకృష్ణ యాదవ్‌ను నియమించిన సందర్భం నుంచి ప్రస్తుత సమయం వరకు తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు వాగ్వావాదాలు, గొడవ లు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో తమకు అన్యాయం జరిగిందని రెండు రోజులుగా టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిప్పగిరి మీనాక్షి, విజయలక్ష్మి తమ సహచరులతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆందోళన చేశారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆందోళనలు, ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ తమకు విలువ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఆవేదనకు టీడీపీ నేతలు స్పందించకపోగా 8వ డివిజన్లో విజయలక్ష్మి భర్త రవీంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేస్తే అతనికి పార్టీ తరపున టికెట్ ఖరారు చేయకుండా అదే డివిజన్లో కాంగ్రెస్ నేత గుర్రం గంగాధర్‌కు టికెట్ ఇచ్చారు. అలాగే 26వ డివిజన్లో తన అత్తకు అవకాశం ఇవ్వాలని చిప్పగిరి మీనాక్షి కోరింది. అయితే అమీర్‌బాబు అభీష్టం మేరకు పార్టీతో ఎలాంటి సంబంధం లేని యానాదమ్మ అనే మహిళకు టికెట్ ఇవ్వడంతో వారు తీవ్ర అసంతృప్తి చెందారు. బాలకృష్ణ యాదవ్, అమీర్‌బాబులే కారణం : టీడీపీ నగర మేయర్ అభ్యర్థి బాలకృష్ణ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్‌బాబులే తమ ఆత్మాయత్యాయత్నానికి కారణమని టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిప్పగిరి మీనాక్షి, విజయలక్ష్మిఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన తమను వదిలిపెట్టి బాలకృష్ణ యాదవ్, అమీర్‌బాబులు తమకిష్టిమైన వారికి టికెట్లు అమ్ముకున్నారన్నారు. ఈ విషయమై జిల్లా పార్టీ కార్యాలయంలో రెండు రోజులుగా ఆందోళనలు చేశామన్నారు. కొందరు తమపై వ్యతిరేకంగా చెప్పడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి తమను సస్పెండ్ చేశారన్నారు. పార్టీకోసం కష్టపడితే చివరకు మమ్మల్నే పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలనుకోవడం దురదృష్టమన్నారు. తాము బాలకృష్ణయాదవ్‌కు క్షమాపణ చెప్పాలని కోరారని ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డామన్నారు. ఈ సంఘటనలకు కారణమైన అమీర్‌బాబు, బాలకృష్ణ యాదవ్‌లపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేయాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.