బాలానగర్‌లో చైన్ స్నాచింగ్
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మరో చైన్ స్నాచింగ్ జరిగింది. బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం నడిచి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన దుండగులు లాక్కుని... అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి... సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.