balatripura sundari
-
బాలాత్రిపుర సుందరిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, అమరావతి బ్యూరో: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మల్లికార్జున మహామండపంలో ఏర్పాటు చేసిన లక్షకుంకుమార్చనలో దంపతులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న అన్నదాన భవనంలో భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం మల్లేశ్వరస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన శ్రీ గంగా పార్వతీ సమేత నగరోత్సవం అర్జునవీధి మీదుగా ఇంద్రకీలాద్రి వరకు కనుల పండువగా సాగింది. దసరా ఉత్సవాల్లో మూడోరోజు అమ్మవారు భక్తులకు గాయత్రీదేవిగా దర్శనం ఇస్తారు. చిన్నశేషుడిపై గోపాలుడి విహారం తిరుమల: తిరుమలేశుని బ్రహ్మోత్సవాల రెండో రోజు గురువారం ఉదయం చిన్నశేషవాహనం, రాత్రి హంసవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 7.00 నుంచి 8.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. ఉదయం శ్రీమలయప్ప స్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై పండరీపురం శ్రీపాండురంగ స్వామి అలంకారంలో ఊరేగారు. వెలసిపోయింది! బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన చిన్నశేష వాహన సేవ పీఠానికి బంగారుపూత వెలసిపోయి కనిపించింది. పీఠానికి అమర్చిన రాగిరేకు కనిపించడంతో భక్తులు ఒకింత అసంతృప్తికి గురయ్యారు. అన్నపూర్ణగా భద్రకాళి హన్మకొండ కల్చరల్: శ్రీ భద్రకాళి దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారిని అన్నపూర్ణా దేవీగా అలంకరించారు. గురువారం ఉదయం 4గంటలకు ఆలయ ప్రధానార్చకులు శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు నిత్యాహ్నికం, సుప్రభాత పూజలు జరిపారు. అమ్మవారి స్వపనమూర్తిని అన్నపూర్ణ అమ్మవారిగా అలంకరించి మకరవాహనంపై ఊరేగించారు. రాత్రి 9గంటలకు మహాపూజ, కుమారీ, సువాసినీ పూజలు మహానీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం జరిపిన మహాప్రసాదవితరణ కార్యక్రమంలో దేవాదాయశాఖ డీసీ నర్సింహులు పాల్గొన్నారు. శుక్రవారం అమ్మవారిని గాయత్రీగా అలంకరించనున్నారు. -
బాలా త్రిపురసుందరిగా బోయకొండ గంగమ్మ
బోయకొండ(చౌడేపల్లె): జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో శనివారం నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు,లక్ష్మణాచార్యులు,గంగిరెడ్డి, సుధాకర్ ఆధ్వర్యంలో అభిషేకం అనంతరం పట్టు పీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో బాలా త్రిపుర సుందరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ కమిటీ చైర్మన్ గువ్వల రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వెంకట్రమణరాజు, ఈవో ఏకాంబరం, పాలకమండలి సభ్యులు సంప్రదాయం ప్రకారం పట్టువస్త్రాలను అందజేశారు. వేదపండితులు గోవర్ధనశర్మ, లక్ష్మణాచార్యులు ఆధ్వర్యంలో గణపతి పూజ, స్వస్తివాచనం, దేవనాంది గణపతిహోమం, చండీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రూ.3,516 చెల్లించి ఉభయదారులుగా చేరండి.. ఆలయంలో దసరా మహోత్సవాల్లో రూ.3,516 చెల్లించి భక్తులు ఉభయదారులుగా పాల్గొనవచ్చని ఈవో ఏకాంబరం తెలిపారు. ఊంజల్‌సేవ, అభిషేకం, గణపతిహోమం, చండీ హోమంలో పాల్గొనవచ్చని, అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, రవికపీసు, కుంకుము, గాజులు,అమ్మవారి చిత్రపటం దేవస్థానం తరపున ఇస్తామని చెప్పారు. ఉభయదారుల పేర్ల నమోదుకోసం 08581–254766 నంబరును సంప్రదించాలని కోరారు. నేడు ధనలక్ష్మి అలంకారం.. దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం అమ్మవారు «ధనలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
బాలత్రిపురసుందరిగా వనదుర్గ అమ్మవారు
అన్నవరం : రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి వరుసగా మూడో రోజైన సోమవారం కూడా శ్రావణమాస పూజలు, చండీహోమం నిర్వహించారు. అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 9 గంటలకు రుత్విక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవగ్రహ మండపారాధన, కలశస్థాపన, చండీపారాయణలు, 33 కోట్ల అధిపతులకు ఆహ్వానాలు, సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, లక్ష్మీగణపతి హోమాలు, శివపంచాక్షరి జపాలు, శ్రీసూక్త, పురుషసూక్త పారాయణలు, బాల, కుమారి, సువాసిని తదితర పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమాలను దేవస్థానం వేద పండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, అర్చకులు గంగాధరభట్ల శ్రీను, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు.