బాలత్రిపురసుందరిగా వనదుర్గ అమ్మవారు
బాలత్రిపురసుందరిగా వనదుర్గ అమ్మవారు
Published Mon, Aug 15 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
అన్నవరం :
రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి వరుసగా మూడో రోజైన సోమవారం కూడా శ్రావణమాస పూజలు, చండీహోమం నిర్వహించారు. అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 9 గంటలకు రుత్విక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవగ్రహ మండపారాధన, కలశస్థాపన, చండీపారాయణలు, 33 కోట్ల అధిపతులకు ఆహ్వానాలు, సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, లక్ష్మీగణపతి హోమాలు, శివపంచాక్షరి జపాలు, శ్రీసూక్త, పురుషసూక్త పారాయణలు, బాల, కుమారి, సువాసిని తదితర పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమాలను దేవస్థానం వేద పండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, అర్చకులు గంగాధరభట్ల శ్రీను, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement