Balineni
-
కోటంరెడ్డి వ్యవహారంపై స్పందించిన సజ్జల
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. బుధవారం వైసీపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సర్పంచ్ల సమావేశంలో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. ‘‘కోటంరెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది?. ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలు ఏం తీసుకుంటాం?. అయినా.. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌లను కాదు’’ అని సజ్జల స్పందించారు. ఎవరైనా ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని.. పదవి రాలేదని అసంతృప్తి ఉండటం వేరు, బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయటం వేరని సజ్జల వ్యాఖ్యానించారు. అలాగే.. అక్కడి నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఇంకా ఎవరినీ నియమించ లేదన్న సజ్జల.. కొంతమందిని ఎలా లాక్కోవాలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు. ప్రకాశం: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీ డైరెక్షన్ లో మాట్లాడుతున్నాడని మాజీమంత్రి, వైఎస్సార్పీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని వ్యాఖ్యానించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ లేదు.. పాడు లేదు.. మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే శ్రీధర్ రెడ్డి, ఆనం డ్రామాలు ఆడుతున్నారు. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ అయినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు బాలినేని. ఫోన్ ట్యాప్ అయితే ఎమ్మెల్యే ఆనం ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. రేపో ఎల్లుండో నెల్లూరు రూరల్ కి కొత్త ఇంచార్జి నియామకం ఉంటుందని, వాళ్లిద్దరూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. వైస్సార్సీపీ లో నాయకులకు కొదవలేదు.. ఒకరు పోతే పది మంది తయారవుతారని బాలినేని కామెంట్ చేశారు. -
దీనిపై అసత్య ప్రచారం తగదు
-
ప్రత్యేక హోదాపై డ్రామాలొద్దు
– హోదా రాకుండా టీడీపీ, బీజేపీలే అడ్డుకుంటున్నాయి – వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని – రేపటి జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా బీజేపీ, టీడీపీలు అడ్డుకుంటున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. హోదా విషయంలో ఆ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయన్నారు. ఇందుకు నిరసనగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహ¯Œæరెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిర్వహించ తలపెట్టిన జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. హోదా లేకుండా రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని, హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, రాయితీలు వస్తాయని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో హోదా ఇవ్వకపోతే రాష్ట్రం కోలుకోవడం కష్టసాధ్యమన్నారు. అన్ని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం లేదని బాలినేని విమర్శించారు. ప్రజలే ఉద్యమించి హోదాను సాధించుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. హోదా కోసం వైఎస్సార్సీపీ ఆది నుంచి పోరాటం సాగిస్తోందన్నారు. మంగళవారం జరిగే బంద్‌ను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బంద్ విజయవంతమయ్యేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. -
తరగని ఆదరణ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమానికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. పార్టీ నేతలకు ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజా సమస్యలను దృష్టికి తెస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. 14వ రోజు గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు 5వ డివిజన్లోని మహేంద్రనగర్, గోపాల్‌నగర్ ప్రాంతాల్లో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి వెళ్లి బాలినేని ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికిన ప్రజలను నగరంలోని ప్రధానంగా తాగునీటి సమస్యలు, మురికి కాలువల్లో పూడిక తీయకపోవడం, తద్వారా దోమల బెడద తదితర సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. మార్కాపురం మండలంలోని గొట్టిపడియ పంచాచతీ అక్కచెరువుతండాలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పర్యటించారు. చీరాల నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి వరికూటి అమృతపాణి దేశాయిపేటలో ఇంటింటి పర్యటన చేశారు. మార్టూరు మండలం చీమిర్రిబండలో పర్చూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్, కంభం మండలం లింగాపురంలో గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించారు. -
పడకేసిన ప్రగతి
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రగతి పడకేసింది. ప్రభుత్వ శాఖల, పథకాల వార్షిక లక్ష్యాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. అభివృద్ధి అడుగు ముందుకు పడటం లేదు. వెనుకబడిన జిల్లాగా ఉన్న ముద్రను దశాబ్దాలుగా చెరిపేసుకోలేకపోతోంది. జిల్లా ప్రగతి రథ చక్రాలను ముందుకు తీసుకెళ్లడంలో అటు పాలకులు, ఇటు అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా లక్ష్యాలు నీరుగారుతున్నాయి. పురోగతిలో ఉండాల్సిన గృహనిర్మాణం తిరోగమనంలో కొట్టుమిట్టాడుతోంది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పనులు సక్రమంగా ముందుకు సాగడంలేదు. ఆర్అండ్బీ బ్రిడ్జిల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పరిశ్రమల పురోగతీ అంతంత మాత్రంగానే ఉంది. నేటికీ పల్లెల్లో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడంలేదు. అంతర్గత రోడ్లు లేని గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. పారిశుధ్యం నానాటికీ దిగజారుతోంది. పంచాయతీరాజ్ శాఖ: రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో ఏడాదిలోపే దెబ్బతింటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం *250.67 కోట్ల వ్యయంతో 504 కిలోమీటర్ల రోడ్లు వేయాలని ప్రణాళిక రూపొందిస్తే కేవలం 200 కిలోమీటర్ల లోపే వేశారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంపై గత ఏడాది డిసెంబర్లో జరిగిన సమీక్ష సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 171 కోట్లు మంజూరు చేస్తే కేవలం 31 కోట్లే ఖర్చు చేశారని మంత్రి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటే పనులు పురోగతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రహదారులతో పాటు పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం వీరి పరిధిలోనే జరుగుతున్నా అవికూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. పంచాయతీ, వెటర్నరీ భవనాలు కొన్ని నేటికీ స్థలాలు లేక ప్రారంభానికి నోచుకోలేదు. ఆర్అండ్బీ బ్రిడ్జిల నిర్మాణం : ఆర్అండ్బీ పరిధిలో జరుగుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాల్లో పురోగతి లేదు. కొత్తపట్నం రోడ్డులో అల్లూరు వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే బాలినేని పోరాడి ఎన్సీఆర్ఎంపీ పథకం నిధులు 3.90 కోట్లు మంజూరు చేయించారు. గత ఏడాది పనులు ప్రారంభించినా పనులు నిదానంగా సాగుతున్నాయి. సూరారెడ్డిపాలెం మోటుమాల రోడ్డు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. వేసిన రెండేళ్లకే దెబ్బతింది. మళ్లీ ఆ రోడ్డుకు * 10 కోట్లు మంజూరయ్యాయి.2013-14లో ఒంగోలు సబ్ డివిజన్లో పలు బ్రిడ్జిలు మంజూరయ్యాయి. ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయానికి * 1.30 కోట్లు మంజూరయ్యాయి. కానీ పనులు ప్రారంభించలేదు. ముందుకు సాగని మరుగుదొడ్ల నిర్మాణం: జిల్లాలో 2,07,026 మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. సగం కూడా పూర్తి కాని పరిస్థితి. పల్లెల్లో నేటికీ 70 శాతం మంది బహిర్భూమికి వెళ్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వలన కొత్తగా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. పరిశ్రమలు కుదేలు : జిల్లాలో అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు రావడం లేదు. దీనికి తోడు బ్యాంకులు రుణాలివ్వడంలో విముఖత చూపుతున్నాయి. జిల్లాలో 71 భారీ, 335 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలున్నాయని అధికారులు చెబుతున్నా వాటిలో ఎన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ కింద మంజూరు చేస్తున్న పథకాలకు బ్యాంకర్లు మొకాలడ్డుతున్నారు. దీంతో వేలాది మంది నిరుద్యోగులు ఉపాధి లేక వలస బాట పడుతున్నారు. తిరోగమనంలో గ్రామ స్వరాజ్యం : గ్రామ స్వరాజ్యం కలగానే మిగులుతోంది. జిల్లాలో 1028 పంచాయతీలుండగా నేటికీ కొన్ని పంచాయతీ కార్యాలయాలకు భవనాలు లేవు. చెరువుగట్లు, సామాజిక భవనాల్లో సమీక్షలను సర్పంచ్‌లు నిర్వహించాల్సి వస్తోంది. మూడేళ్ల క్రితం 306 పంచాయతీ భవనాలు మంజూరైతే నేటికీ వాటిని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పునాదుల్లోనే కొన్ని మగ్గుతున్నాయి. ఇవిగాక సర్పంచులు అనేక సమస్యల తో సతమతమవుతున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. కనీసం రోడ్లకు కూడా నోచుకోని గ్రామాలు కొల్లకొల్లలుగా ఉన్నా అవి పాలకులకు కనిపించడంలేదు. -
సిఎం కిరణ్ వ్యాఖ్యల పై బాలినేని మండిపాటు
-
శాసన సభ్యత్వానికి బాలినేని రాజీనామా
-
కాంట్రాక్ట్ లెక్చరర్ల ధర్నాకు మద్దతు పలికిన బాలినేని