అనకాపల్లి వాసికి రాష్ట్రపతి అవార్డు
జైల్ వార్డర్‌గా ఉండగా చేసిన సేవలకు గుర్తింపు
26న హైదరాబాద్‌లో ప్రదానం
అనకాపల్లి, న్యూస్‌లైన్ : విధుల్లో ఉండగా ఖైదీల సంక్షేమానికి, వారి మానసిక పరివర్తనకు కృషి చేసిన అనకాపల్లి వాస్తవ్యుడికి రాష్ట్రపతి అవార్డు దక్కింది. పట్టణానికి చెందిన విశ్రాంత జైల్‌వార్డర్ బల్లా నాగభూషణం ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. విశాఖ కేంద్ర కారాగారంలో పని చేస్తూ గత ఏడాది జూన్ 30వ తేదీన పదవీ విరమణ పొందిన బల్లా నాగభూషణం సేవా దృక్పథం ప్రాతిపదికన ఈ అవార్డు దక్కించుకున్నారు.
రాష్ర్టంలోని వివిధ జైళ్లలో 30 సంవత్సరాలపాటు పనిచేసిన నాగభూషణం ఖైదీల సం క్షేమానికి, వారిలో మానసిక పరివర్తనకు కృషి చేశారు. ఖైదీల పిల్లల విద్యాభ్యాసానికి తనవంతుగా ఆర్థిక సాయం అందించడంలో ముం దుండేవారు. మరోవైపు సామాజిక సేవలో భాగస్వాములయ్యేవారు.
బల్లా నాగభూషణం కు ఇప్పటికే 24 అవార్డులు దక్కాయి. వికలాం గులకు, వృద్ధులకు తన వంతు సేవలు అందించడంలో ఆయన ముందున్నారు. ‘నేరాన్ని ద్వే షించు.. నేరస్థుడిని ప్రేమించు’ అనే సూక్తిని జైలు వార్డెన్‌గా నాగభూషణం ఆచరించి చూపా రు. గణతంత్ర దినోత్సవం రోజున హైదరాబాద్లోరాష్ట్రపతి అవార్డు అందుకోనున్నారు.